IIT Hyderabad Jobs | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ లో పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్విడుదల చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలో(Junior Research fellow), సీనియర్ రీసెర్చ్ ఫెలో (Senior Research fellow), సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ లో పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్విడుదల చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలో(Junior Research fellow), సీనియర్ రీసెర్చ్ ఫెలో (Senior Research fellow), సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కేవలం రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్‌లోఈ పోస్టులున్నాయి. ఇవి మూడేళ్ల గడువున్న రీసెర్చ్ ఫెలో పోస్టులు. జూనియర్ రీసెర్చ్ ఫెలోను సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (SERB) ప్రాజెక్ట్ కోసం, సీనియర్ రీసెర్చ్ ఫెలోను డీఆర్డీఓ ప్రాజెక్ట్ కోసం నియమిస్తోంది ఐఐటీ హైదరాబాద్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మే 27, 2022 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
నానోమెడిసిన్, నానోబయోటెక్నాలజీ, మాలిక్యులర్లో ఎంటెక్ చేసి ఉండాలి. కలిగి ఉన్న MSc అభ్యర్థులు, CSIR/UGC/DBT/ICMR- JRF లేదా ఇన్స్పైర్ ఫెలోషిప్‌ను క్లియర్ చేసి ఉండాలి.
మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000 + 24% HRA
సీనియర్ రీసెర్చ్ ఫెలో
1
మెకానికల్‌లో, రసాయన లేదా థర్మల్/పవర్ ప్లాంట్ బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. మెకానికల్‌లో, రసాయన లేదా థర్మల్/పవర్ ప్లాంట్ ఎంటెక్ చేసి ఉండాలి. అంతే కాకుండా కనీసం 2 సంవత్సరాల పరిశోధన అనుభవం అవసరం.
రూ.35,000 + హెచ్ఆర్ఏ
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్
1
మెకానికల్‌లో, రసాయన లేదా థర్మల్/పవర్ ప్లాంట్ బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. మెకానికల్‌లో, రసాయన లేదా థర్మల్/పవర్ ప్లాంట్ ఎంటెక్ చేసి ఉండాలి.
రూ.42,000 + హెచ్ఆర్ఏ
దరఖాస్తుకు చివరి తేదీ- మే 27, 2022
ఫెలోషిప్ గడువు- మొదట 12 నెలల కాలానికి నియమిస్తారు. ఆ తర్వాత పనితీరును బట్టి మూడేళ్లు పొడిగిస్తారు.
ఎంపిక విధానం- ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ జరిగే తేదీని అభ్యర్థులకు తెలియజేస్తుంది ఐఐటీ హైదరాబాద్.
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 - ముదుగా అధికారిక వెబ్సైట్ https://iith.ac.in/careers/ ను సందర్శించాలి.
Step 3 - నోటిఫికేషన్ వివరాలను పూర్తిగా చదవాలి.
Step 4 - అనంతరం నోటిఫికేషన్లో ఉన్న లింక్‌లోకి వెళ్లాలి.
Step 5 - తప్పులు లేకుండా దరఖాస్తు ఫాంను నింపాలి.
Step 6 - అనంతరం సబ్మిట్ చేయాలి.
Step 7 - దరఖాస్తుకు మే 27, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.