ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ పలు పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలో(Junior Research fellow), సీనియర్ రీసెర్చ్ ఫెలో (Senior Research fellow) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కేవలం రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్‌లో ఈ పోస్టులున్నాయి. ఇవి మూడేళ్ల గడువున్న రీసెర్చ్ ఫెలో పోస్టులు. జూనియర్ రీసెర్చ్ ఫెలోను సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (SERB) ప్రాజెక్ట్ కోసం, సీనియర్ రీసెర్చ్ ఫెలోను డీఆర్డీఓ ప్రాజెక్ట్ కోసం నియమిస్తోంది ఐఐటీ హైదరాబాద్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 25 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫెలోషిప్‌కు ఎంపికైనవారు ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్డీ రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు.
Telangana Jobs: రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు | 2 | విద్యార్హతలు | వయస్సు | రెమ్యునరేషన్ |
జూనియర్ రీసెర్చ్ ఫెలో | 1 | మెటల్లార్జికల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్, ఎంఈ పాస్ కావాలి. లేదా బీటెక్ పాస్ అయి గేట్ స్కోర్ ఉండాలి. | 35 ఏళ్ల లోపు | మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000 + హెచ్ఆర్ఏ, మూడో ఏడాది నెలకు రూ.35,000 + హెచ్ఆర్ఏ |
సీనియర్ రీసెర్చ్ ఫెలో | 1 | మెటల్లార్జికల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్, సిరామిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్, ఎంఈ పాస్ కావాలి. | 35 ఏళ్ల లోపు | రూ.35,000 + హెచ్ఆర్ఏ |
దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 12
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 25
ఫెలోషిప్ గడువు- మొదట 11 నెలల కాలానికి నియమిస్తారు. ఆ తర్వాత పనితీరును బట్టి మూడేళ్లు పొడిగిస్తారు.
అనుభవం- మైక్రోస్ట్రక్చరల్ స్టడీ, మెటల్లాగ్రఫీ ప్రాక్టీసెస్, హీట్ ట్రీట్మెంట్స్, మెకానికల్ టెస్టింగ్, మెటల్స్ అండ్ అలాయ్స్, పౌడర్ మెటాల్లర్జీ, మెటల్ అడిక్టీవ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ లాంటివాటిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం- ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ జరిగే తేదీని అభ్యర్థులకు తెలియజేస్తుంది ఐఐటీ హైదరాబాద్.
జూనియర్ రీసెర్చ్ ఫెలో నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
సీనియర్ రీసెర్చ్ ఫెలో నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Govt Jobs 2021, Hyderabad, Hyderabad news, IIT, IIT Hyderabad, Job notification, JOBS