హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్​లో వాటికి దరఖాస్తుల ఆహ్వానం.. ఎంపికైతే ప్రతినెలా రూ. 60 వేల స్టైఫండ్

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్​లో వాటికి దరఖాస్తుల ఆహ్వానం.. ఎంపికైతే ప్రతినెలా రూ. 60 వేల స్టైఫండ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్ ఫెలోషిప్ ఫర్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్కాలర్స్ ఇన్ టెక్నాలజీ (FIRST) స్కీమ్ మూడవ రౌండ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్(Hyderabad) ఫెలోషిప్ ఫర్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్కాలర్స్ ఇన్ టెక్నాలజీ (FIRST) స్కీమ్(Scheme) మూడవ రౌండ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఐఐటీ హైదరాబాద్​లో జూన్/జూలై 2022 సెషన్‌ పీహెచ్​డీ(PhD) ప్రవేశాలు పొందిన విదేశీ విద్యార్థులకు మాత్రమే ఈ ఫెలోషిప్​ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. FIRST ఫెలోషిప్​కు ఎంపికైన అభ్యర్థులకు నాలుగు సంవత్సరాల పాటు స్టైఫండ్​ అందజేస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు FIRST స్కీమ్​లో భాగంగా సంవత్సరానికి రూ. 1 లక్ష రీసెర్చ్​ గ్రాంట్​తో పాటు ప్రతి నెలా రూ. 60 వేల ఫెలోషిప్ స్టైఫండ్ అందజేస్తుంది. అభ్యర్థులు తమ దరఖాస్తును టెస్టిమోనియల్‌ ఎలక్ట్రానిక్ కాపీలతో పాటు ఒక రిఫరెన్స్ లెటర్‌ను జతచేసి firs.iar@iith.ac ఈ–మెయిల్​కు ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటలలోపు పంపించాల్సి ఉంటుంది. FIRST ఫెలోషిప్​ దరఖాస్తుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Application Invited: వాళ్లు ఏడాదికి రూ.60 వేలు పొందే అవకాశం.. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 15.. వివరాలివే..


ఐఐటీ హైదరాబాద్ ఫస్ట్​ ఫెలోషిప్ అర్హత

కనీసం 8.5 CGPAతో సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ/బీటెక్​ లేదా ఎంఈ/ఎంటెక్​ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. వారి దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ/పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు, తమ విభాగంలోని ఏదైనా టాపిక్​ మీద రీసెర్చ్​ చేయడంతో పాటు దానికి సంబంధించిన పబ్లికేషన్​/పేటెంట్‌ హక్కులు పొందిన వారికి షార్ట్​లిస్టింగ్ సమయంలో వెయిటేజీ ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

1. ఐఐటీ హైదరాబాద్ వెబ్‌సైట్‌లోని FIRST ఫెలోషిప్ పేజీకి లాగిన్ అవ్వండి.

2. అప్లికేషన్ ప్రొసీజర్ విభాగంలోని ‘క్లిక్ హియర్​’పై క్లిక్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి.

3. అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సాఫ్ట్ కాపీని జత చేయండి.

4. మీ దరఖాస్తు ఫారమ్​ను డౌన్​లోడ్​ చేసుకొని సేవ్ చేయండి.

5. ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటలలోపు first.iar@iith.ac.in ఈ–మెయిల్​కు దరఖాస్తు ఫారమ్‌ను పంపండి. మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

NEET 2022: త్వరలోనే నీట్ 2022 నోటిఫికేషన్​ విడుదల.. దరఖాస్తు విధానం, కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలివే!


ఐఐటీ హైదరాబాద్​లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, క్లైమేట్ చేంజ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్​ మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్​ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, లిబరల్ ఆర్ట్స్, డిజైన్ విభాగాలు ఈ ఫెలోషిప్​ను ఆఫర్​ చేస్తున్నాయి. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్​ 15లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం మంచిది.

First published:

Tags: CAREER, Career and Courses

ఉత్తమ కథలు