హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Hyderabad: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేస్తారా? ఐఐటీ హైదరాబాద్‌లో దరఖాస్తుకు 2 రోజులే గడువు

IIT Hyderabad: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేస్తారా? ఐఐటీ హైదరాబాద్‌లో దరఖాస్తుకు 2 రోజులే గడువు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

IIT Hyderabad | ఐఐటీ హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎంటెక్ కోర్స్ అందిస్తోంది. డీప్ లెర్నింగ్, మెషీన్ లెర్నింగ్ లాంటి 18 సబ్జెక్ట్స్‌తో ఈ కోర్సు చేయొచ్చు.

పరిశ్రమకు కావాల్సిన నిపుణులను తయారు చేసేందుకు కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు. రానున్న కాలంలో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(కృత్రిమ మేధ)లో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు ఏర్పడనుండటంతో పలు ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పటికే ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​, మెషిన్​ లెర్నింగ్​, రోబోటిక్స్​ వంటి కొత్త కోర్సులను అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ప్రతిష్టాత్మక ఐఐటీ హైదరాబాద్ కూడా చేరింది. ఇప్పటికే బీఈ/బీటెక్​ ఇన్​ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కోర్సు అందిస్తున్న ఐఐటీ హైదరాబాద్​ తాజాగా, ఎఐలో ఎంటెక్ కోర్సును ప్రవేశపెట్టింది. దీని కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోర్సుకు దరఖాస్తులు చేసుకోవడానికి 2021 ఏప్రిల్ 14 వరకే అవకాశం ఉంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కోర్సులో నేర్చుకునే పరిశోధనా అంశాలు


1. డీప్​ లెర్నింగ్​

2. మెషిన్​ లెర్నింగ్​

3. అటానామస్​ వెహికిల్స్

4. కంప్యూటర్ విజన్​

5. జనరేటివ్​ మోడల్స్​

6. వీడియో క్వాలిటీ అసెస్​మెంట్​

7. స్పీచ్​ సిస్టమ్స్​

8. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ ఫర్​ అగ్రికల్చర్​

9. బయేసియన్ లెర్నింగ్​

10. సోషల్ మీడియా, టెక్స్ట్ అనాలసిస్​

11. రోబోటిక్స్ రికమండేషన్​ సిస్టమ్​, డేటా మైనింగ్.

12. మెషిన్​ లెర్నింగ్​ ఇన్​ ఆస్ట్రానమీ

13. ఇంటర్​ఫియరెన్స్​ అల్గోరిథం

14. గ్రాఫికల్ మోడల్స్

15. బిగ్​ డేటా అనాలసిస్​

16. కంప్యూటర్​ ఆర్కిటెక్చర్​ ఫర్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్

17. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్​

18. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్

SBI Youth for India Fellowship 2021: డిగ్రీ పాస్ అయినవారికి గుడ్ న్యూస్... రూ.50,000 ఫెలోషిప్

IIM Professor: నైట్ వాచ్‌మెన్ నుంచి ఐఐఎం ప్రొఫెసర్ వరకు... నెటిజన్లలో స్ఫూర్తిని రగిలిస్తున్న సక్సెస్ స్టోరీ

ఐఐటి హైదరాబాద్‌ మొత్తం 18 రకాల విభాగాల్లో ఎంటెక్ ఇన్​ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కోర్సును అందిస్తుంది. అభ్యర్థులు వారి అర్హతలు, ఆసక్తి ఆధారంగా పైవాటిలో ఏ కోర్సునైనా ఎంచుకోవచ్చు. కాగా ఆయా కోర్సుల్లో చేరేందుకు కావాల్సిన అర్హత, ఎంపిక విధానాలను తెలుసుకుందాం.

ఎంటెక్​ రెండేళ్ల ప్రోగ్రామ్


ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​లో రెండేళ్ల ఎంటెక్ కోర్సు కోసం బీఈ/బీటెక్​/ ఎంఎస్సీ లేదా దానికి సమానమైన డిగ్రీతో పాటు వ్యాలిడ్​ గేట్ స్కోరు కలిగి ఉండాలి. లేదా మ్యాథమేటిక్స్​లో బీఈ/బీటెక్​/ ఎంఎస్సీ చేసిన ఐఐటీ విద్యార్థులు గేట్​ స్కోర్​ లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక, ఎంటెక్​ సెల్ఫ్​ స్పాన్సర్డ్​ కోర్సు కోసం బీఈ/బీటెక్/ ఎంఎస్సీ లేదా సమానమైన డిగ్రీ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈ కోర్సుకు గేట్ స్కోరు తప్పనిసరి కాదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Teacher Jobs: మొత్తం 3400 టీచర్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

DSSSB Teacher Recruitment 2021: గుడ్ న్యూస్... 12,065 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

ఎంటెక్​ మూడేళ్ల ప్రోగ్రామ్​


బీఈ/బీటెక్​, ఎంఎస్సీ లేదా తత్సమాన డిగ్రీలో 8.0 లేదా అంతకంటే ఎక్కువ CGPA స్కోరు ఉన్న విద్యార్థులు లేదా వాలిడ్​ గేట్ స్కోరు కలిగి ఉన్న వారు ఈ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా చివరి ఏడాదిలో ఉన్న వారు కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

First published:

Tags: Artificial intelligence, CAREER, EDUCATION, IIT, IIT Hyderabad

ఉత్తమ కథలు