IIT Hyderabad: అవకాశాలే లక్ష్యంగా.. ఐఐటీ హైదరాబాద్​లో మూడు కొత్త బీటెక్​ కోర్సులు

ఐఐటీ హైద‌ర‌బాద్‌

IIT Hyderabad : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీహెచ్​) 2021–22 విద్యా సంవత్సరానికి గాను మూడు కొత్త కోర్సులను ప్రారంభించింది. బయోటెక్నాలజీ అండ్​ బయోఇన్ఫర్మేటిక్స్, కంప్యుటేషనల్ ఇంజనీరింగ్,​ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో ఈ మూడు ఇండస్ట్రీ ఓరియెంటెడ్ బీటెక్​ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.

  • Share this:
మార్కెట్​ అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు. తాజాగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (Indian Institute Of Technology Hyderabad​) 2021–22 విద్యా సంవత్సరానికి గాను మూడు కొత్త కోర్సులను ప్రారంభించింది. బయోటెక్నాలజీ అండ్​ బయోఇన్ఫర్మేటిక్స్, కంప్యుటేషనల్ ఇంజనీరింగ్,​ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో ఈ మూడు ఇండస్ట్రీ ఓరియెంటెడ్ బీటెక్​ ప్రోగ్రామ్‌ (Industrial Oriented BTech Program) లను అందిస్తోంది. ఈ మూడు కొత్త ప్రోగ్రామ్స్​ మొదటి రెండు సెమిస్టర్లలో గణితం (Maths), భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం (Chemeistry) వంటి అన్ని సైన్స్​ విభాగాల నుంచి కోర్సులు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆరో సెమిస్టర్లో ఆయా సబ్జెక్టులపై పూర్తి స్థాయి అనుభవం పొందడానికి సెమిస్టర్-లాంగ్ ప్రాజెక్ట్‌లను ఎంచుకోవచ్చు.

ఈ కోర్సుల ద్వారా బయోటెక్, ఫార్మా, మాన్యుఫాక్చరింగ్ (Manufacturing)​, ఐటీ, డేటా అనలిటిక్స్​, కెమికల్​ ఇన్ఫర్మేటిక్స్ రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ కొత్త కోర్సులపై ఐఐటి-హెచ్ బయోటెక్నాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ అనింద్య రాయ్ మాట్లాడుతూ "బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్‌ రంగాల్లో ప్రస్తుతం పెరుగుతున్న అవకాశాల దృష్ట్యా మూడు కొత్త కోర్సులను ప్రారంభించాం.

CTET 2021 : సీటెట్ 2021 రిజిస్ట్రేష‌న్‌ గ‌డువు పొడ‌గింపు.. ద‌రఖాస్తు విధానం


ఈ కొత్త కోర్సుల ద్వారా బయోటెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ కంప్యూటింగ్, వెబ్ టెక్నాలజీలు, స్ట్రక్చరల్ బయాలజీ, బయోలాజికల్ డేటా మైనింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, మోడలింగ్ అండ్​ సిమ్యులేషన్, సిస్టమ్స్ బయాలజీ అండ్​ బయోస్టాటిక్స్​లో నైపుణ్యాలను పెంచుకోవచ్చు.”అని అన్నారు.  ఈ కోర్సుల‌కు సంబంధించిన స‌మాచారం పూర్తిగా తెలుసుకొనేందుకు iith.ac.in/news/2021/10/15/New-Industry-oriented-BTechs/ ను స‌ద‌ర్శించ‌వ‌చ్చు.

బయో టెక్నాలజీలో పెరుగుతున్న అవకాశాలు..

ఈ మూడు ప్రోగ్రామ్‌లలో వివిధ విభాగాల నుంచి సబ్జెక్ట్​లను ఎంచుకోవడం ద్వారా.. విద్యార్థులు ఆయా సబ్జెక్టులో లోతైన అవగాహన పెంచుకోవచ్చు. ఆయా విభాగాల్లో 12 అదనపు క్రెడిట్‌లను దక్కించుకోవడం ద్వారా ఎంట్రప్రెన్యూర్​షిప్​, కంప్యూటర్​ వంటి డిపార్ట్‌మెంట్ వెలుపలి రంగాలపై కూడా పట్టు సాధించవచ్చు.

ఈ కొత్త కోర్సులపై ఐఐటీ హైదరాబాద్​ కెమిస్ట్రీ డిపార్ట్​మెంట్ హెడ్​, ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘ఈ మూడు కొత్త కోర్సుల ద్వారా​ ఫార్మా (Pharma), డ్రగ్ డిజైన్, పాలిమర్ ఇండస్ట్రీ, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఎన్విరాన్మెంట్, ఎనర్జీ మొదలైన పరిశ్రమల్లో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. అప్లైడ్ కెమిస్ట్రీ, టెక్నాలజీ (Technology) లో అత్యుత్తమ గ్రాడ్యుయేట్లను తయారు చేయడమే లక్ష్యంగా ఈ కోర్సును రూపొందించాం. వివిధ అధ్యయనాలు, పరిశోధనలు రీసెర్చ్​ విభాగాల్లో పనిచేయడానికి ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి.’’ అని చెప్పారు.

Education News : వ‌చ్చే ఏడాది నాటికి నాలుగేళ్ల‌ ఏళ్ల‌ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు : యూజీసీ


కొత్తగా 7 ఆన్​లైన్​ పీజీ కోర్సులు..
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయి. మార్కెట్​ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నాయి విద్యా సంస్థలు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీ హైదరాబాద్ ఏడు కొత్త ఆన్‌లైన్ ఎంటెక్​ ప్రోగ్రామ్‌ (Mtech Programs) లను ప్రారంభించింది. విద్యార్థుల కోసం ఏడు ఎంటెక్​, వర్కింగ్ ప్రొఫెషనల్స్ (Working Professionals) కోసం ఒక ఎం-డిజైన్ ప్రోగ్రామ్​లను రూపొందించింది.

విద్యార్థుల కోసం ఏడు ఎంటెక్​, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఒక ఎం-డిజైన్ ప్రోగ్రామ్​లను రూపొందించింది. కోర్సులు క్రెడిట్ సిస్టమ్​పై ఆధారపడి ఉంటాయి. తద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుకు మారే అవకాశం ఉంటుంది. కోర్సులో భాగంగా కోర్, ఎలక్టివ్, ప్రాజెక్ట్ వర్క్​లు ఉంటాయి. కాగా, ఇండస్ట్రియల్​ మెటలర్జీ, ఈవీ టెక్నాలజీ, కంప్యుటేషనల్ మెకానిక్స్, ఇంటిగ్రేటెడ్ కంప్యూటేషనల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్స్ ప్రాసెసింగ్ (CSP), పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ సిస్టమ్ (PEPS), మైక్రోఎలక్ట్రానిక్స్ అండ్​ వీఎల్​ఎస్​ఐ (ME & VLSI) వంటి ఏడు ఎంటెక్​ ప్రోగ్రామ్స్​లో విద్యార్థులకు దేనికైనా దరఖాస్తు చేసుకోవచ్చు
Published by:Sharath Chandra
First published: