ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సరికొత్త కోర్సులు అవసరమవుతున్నాయి. అందుకు ఐఐటీ (IIT)లు వేదికగా నిలుస్తున్నాయి. తాజాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్( IIT- Hyderabad) దేశంలోనే మొదటిసారి సరికొత్త కోర్సును లాంచ్ చేసింది. కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (Computational Engineering)లో బీటెక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
BTechలో కాంప్యుటేషనల్ ఇంజినీరింగ్ కోర్సులో చేరే విద్యార్థులకు ఇంటర్ డిసిప్లినరీ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. దీంతో హై-పర్ఫార్మెన్స్ కాంప్యుటింగ్, మోడలింగ్, ఇంజనీరింగ్ సిస్టమ్స్, ప్రాసెస్ సిమ్యూలేషన్‌పై లోతైన అవగాహన పొందనున్నారు. అంతేకాకుండా న్యూమరికల్ మెథడ్స్ అండ్ అల్గారిథమ్స్, ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆప్టిమైజేషన్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించనున్నారు.
* అర్హత ప్రమాణాలు
ఈ కోర్సు కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్‌ల నుంచి ఇంటర్ లేదా అందుకు సమానమైన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా జేఈఈ అడ్వాన్స్‌డ్ క్లియర్ చేసి ఉండాలి.
* ఆరు నెలల చొప్పున 8 సెమిస్టర్స్
బీటెక్‌లో కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ కోర్సు అనేది నాలుగు సంవత్సరాల ఇంటర్ డిసిప్లినరీ అండర్ గ్రాడ్యుయేట్ (UG) ప్రోగ్రామ్. ఈ కోర్సును ఎనిమిది సెమిస్టర్‌లుగా విభజించారు. ఒక్కొ సెమిస్టర్ ఆరు నెలల పాటు ఉంటుంది. మొదటి ఐదు సెమిస్టర్స్‌లో న్యూమరికల్ టెక్నిక్స్, కాంప్యుటర్ సిమ్యూలేషన్స్, ఆప్టిమైజేషన్, మ్యాథమాటికల్ మెథడ్స్, మ్యాథమాటికల్ మోడల్స్ డెవలప్‌మెంట్, హై-పర్ఫార్మెన్స్ కాంప్యుటింగ్ వంటి వాటిపై అభ్యర్థులకు బోధనతో పాటు ట్రైనింగ్ ఉంటుంది.
* ఎలక్టివ్స్‌లో ఉండే సబ్జెక్టులు
చివరి మూడు సెమిస్టర్లలో అభ్యర్థులు వివిధ ఎలక్టివ్స్ నుంచి ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ గురించి మరింత ప్రత్యేకంగా నేర్చుకోవడానికి ఇది సహాయపడుతుంది. అడ్వాన్స్‌డ్ మ్యానిఫాక్చరింగ్, మెటీరియల్స్ డిజైన్, స్ట్రక్చరల్ డిజైన్, ప్రాసెస్ ఇంజనీరింగ్, చిప్ డిజైన్, బయోమెడికల్ ఇంజనీరింగ్ వంటి అనేక సబ్జెక్టులు ఎలక్టివ్స్‌లో ఉంటాయి.
ఇది కూడా చదవండి : ChatGPTను అలా వాడేస్తున్న స్టూడెండ్స్.. AI టూల్‌ను బ్యాన్ చేస్తున్న విద్యాసంస్థలు
* ఫీజు వివరాలు
BTech 2022 బ్యాచ్ మినహా జనరల్, ఎకనామికలీ వీకర్ సెక్షన్(EWS), ఇతర వెనుకబడిన తరగతి (OBC) కేటగిరీ విద్యార్థులు ప్రతి సెమిస్టర్‌కు రూ.1 లక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వీరు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మెస్, హాస్టల్ ఫీజు వంటి అదనపు ఛార్జీలను మాత్రం తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.
* కెరీర్ స్కోప్
బీటెక్‌లో కాంప్యుటేషనల్ ఇంజినీరింగ్ కోర్సు పూర్తిచేసిన వారికి పుష్కలమైన కెరీర్ అవకాశాలు ఉంటాయి. అభ్యర్థులు ఈ కోర్సును పూర్తి చేస్తే న్యూమరికల్ అల్గారిథమ్స్ అండ్ మెథడ్స్‌పై ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అలాగే సైంటిఫిక్ కాంప్యుటింగ్, కాంప్యుటింగ్ టూల్స్ అండ్ టెక్నిక్స్‌లో నైపుణ్యం సాధిస్తారు. తద్వారా ఇండస్ట్రీకి అవసరమయ్యే స్కిల్స్‌పై పట్టు సాధించి, ఉద్యోగాలు పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, IIT Hyderabad, JOBS, New course