Home /News /jobs /

IIT HYDERABAD LAUNCHES ONLINE MTECH COURSE IN HERITAGE SCIENCE AND TECHNOLOGY UMG GH

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌లో కొత్త కోర్సు.. సైన్స్ విద్యార్థులకు ప్రత్యేకం

ఐఐటీ హైదరాబాద్‌లో కొత్త కోర్సు

ఐఐటీ హైదరాబాద్‌లో కొత్త కోర్సు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్.. హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఆన్‌లైన్ ఎంటెక్ (MTech) ప్రోగ్రామ్‌ను అందించనుంది. ఇది రాబోయే అకడమిక్ ఇయర్ నుంచి అందుబాటులో ఉంటుందని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన హెరిటే?

ఇంకా చదవండి ...
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్.. హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఆన్‌లైన్ ఎంటెక్ (MTech) ప్రోగ్రామ్‌ను అందించనుంది. ఇది రాబోయే అకడమిక్ ఇయర్ నుంచి అందుబాటులో ఉంటుందని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ (HST) ఆఫర్ చేస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ కొత్త ఆన్‌లైన్ ఎంటెక్ కోర్సు కోసం అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులను డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ http://www.hst.iith.ac.in ద్వారా జూలై 7లోపు ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

కోర్సుకు అర్హతలు
ఎంటెక్ కోర్సుకు అర్హత సాధించాలంటే, అభ్యర్థులు టెక్నాలజీ/ఇంజనీరింగ్/ఆర్కిటెక్చర్/మెడిసిన్ లేదా సైన్స్‌లో 4 సంవత్సరాల బ్యాచిలర్స్ ప్రోగ్రామ్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో ఫస్ట్-క్లాస్ MSc డిగ్రీ లేదా అందుకు సమానమైన మరో మాస్టర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు కనీసం రెండు సంవత్సరాల డాక్యుమెంటబుల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండడం తప్పనిసరి. రెండు సంవత్సరాల మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయడానికి విద్యార్థులు మొత్తం 48 క్రెడిట్ పాయింట్‌లను పొందాల్సి ఉంటుంది. హెరిటేజ్ అసెట్స్ పరిసరాల్లో ఆవిష్కరణలను ప్రేరేపించడానికి ప్రతి సెమిస్టర్‌లో విద్యార్థులు ఇన్-రెసిడెన్స్ టూ డేస్ హ్యాకథాన్‌లో కూడా పాల్గొంటారు.

హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆన్‌లైన్ మాస్టర్స్ ప్రోగ్రామ్, మూడు సబ్జెక్టుల్లో స్పెషలైజేషన్‌ను ఆఫర్ చేస్తోంది. యోగా, ఇండిక్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కన్జర్వేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ అంశాలపై అభ్యర్థులు స్పెషలైజేషన్ చేయవచ్చు. పరిశోధన లేదా ప్రాడక్ట్ డెవలప్‌మెంట్‌పై ప్రధానంగా దృష్టి సారించే థీసిస్ ప్రాజెక్ట్ కోసం కోర్సులోని రెండో సంవత్సరాన్ని ప్రత్యేకంగా కేటాయించనున్నారు. విద్యార్థులు పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా (PGD)తో ఒక సంవత్సరం తర్వాత కోర్సు నుండి నిష్క్రమించే అవకాశం కూడా ఉంటుంది.

కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో కొత్తగా హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ను PARAM సిరీస్ సూపర్ కంప్యూటర్స్ పితామహుడు విజయ్ భట్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రధానమైన సంస్థల్లో ఐఐటీ హైదరాబాద్ ఒకటని.. సైన్స్, హెరిటేజ్‌ను ఏకం చేయడం భారతీయ అకడమిక్‌లో కీలక పరిణామం అన్నారు. ఇది ప్రాచీన తక్షశిల, నలందా యూనివర్సిటీలను సమకాలీన రూపంలో పునఃసృష్టించే మార్గాన్ని చూపుతుందని భట్కర్ చెప్పుకొచ్చారు.

మరోవైపు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఉదయ్‌పూర్, ఇటీవల వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (PGDBA-WE) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సు 20-నెలల పాటు జరగనుంది. ఈ కోర్సు ద్వారా వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌లకు కనీసం మూడు సంవత్సరాల పుల్- టైమ్ పోస్ట్-క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఈ కోర్సు వారాంతాల్లో ఆన్‌లైన్ ఫార్మాట్‌లో జరుగుతుంది. అలాగే ప్రతి రెండు వారాలకోసారి ఆన్-క్యాంపస్ మాడ్యూల్స్‌లో తరగతులు ఉంటాయి. GMAT, GRE లేదా CAT లేదా IIM ఉదయ్‌పూర్ నిర్వహించిన పరీక్షలో సాధించిన స్కోర్‌, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Iiit hyderabad, IIT, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు