హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Hyderabad : బీటెక్‌లో కొత్త కోర్సులు.. అక్టోబ‌ర్ నుంచి ప్రారంభించ‌నున్న ఐఐటీ హైద‌రాబాద్‌

IIT Hyderabad : బీటెక్‌లో కొత్త కోర్సులు.. అక్టోబ‌ర్ నుంచి ప్రారంభించ‌నున్న ఐఐటీ హైద‌రాబాద్‌

ఐఐటీ హైద‌ర‌బాద్‌

ఐఐటీ హైద‌ర‌బాద్‌

హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (Indian Institute of Technology Hyderabad) ఇంజ‌నీరింగ్ విభాగంలో కొత్త కోర్సును ప్ర‌వేశ పెట్టింది. భ‌విష్య‌త్ అవ‌స‌రాలు, ఉపాధి మార్గాలు, ప‌రిస్థితుల ఆధారంగా ఈ కోర్సును ప్ర‌వేశపెట్టిన‌ట్టు యూనివ‌ర్సిటీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి ...

హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (Indian Institute of Technology Hyderabad) ఇంజ‌నీరింగ్ విభాగంలో కొత్త కోర్సును ప్ర‌వేశ పెట్టింది. భ‌విష్య‌త్ అవ‌స‌రాలు, ఉపాధి మార్గాలు, ప‌రిస్థితుల ఆధారంగా ఈ కోర్సును ప్ర‌వేశపెట్టిన‌ట్టు యూనివ‌ర్సిటీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ కోర్సులే బయోటెక్నాలజీ & బయోఇన్ఫర్మేటిక్స్ (Biotechnology & Bioinformatics), కంప్యుటేషనల్ ఇంజనీరింగ్ & ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ (Computational Engineering & Industrial Chemistry). బీటెక్‌లో మొదటి రెండు సెమిస్టర్‌లలో గణితం, భౌతిక శాస్త్రం (Physics) అండ్ రసాయన శాస్త్రం అన్ని శాఖల నుంచి కోర్సులు తీసుకొనే అవ‌కాశాన్ని యూనివ‌ర్సిటీ క‌ల్పిస్తోంది.

ఈ మూడు ప్రొగ్రామ్‌లు ఇతర విభాగాల నుంచి ఎంపిక చేసుకోవ‌డం వ‌ల్ల ఆయా స‌బ్జెక్టుల్లో త‌మ ప‌రిజ్ఞానం పెంచుకొనే అవ‌కాశం ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కంప్యూటర్ వంటి డిపార్ట్‌మెంట్ వెలుపల వారికి కూడా ఆస‌క్తి ఉంటే 12 క్రెడిట్‌ల‌ను పూర్తి చేయ‌డం ద్వారా ఈ కోర్సుల‌ను పొంద వ‌చ్చు. ఈ కోర్సుల‌కు సంబంధించిన స‌మాచారం పూర్తిగా తెలుసుకొనేందుకు iith.ac.in/news/2021/10/15/New-Industry-oriented-BTechs/ ను స‌ద‌ర్శించ‌వ‌చ్చు. ఆరో సెమిస్ట‌ర్, విద్యార్థులు బయోటెక్/ఫార్మా/తయారీ/IT/డేటా విశ్లేషణ/కెమ్ ఇన్ఫర్మేటిక్స్‌లో పని చేయడానికి మాత్ర‌మే కాకుండా అనుభవాన్ని పొందే అవకాశాన్ని అందించే సెమిస్టర్-లాంగ్ ప్రాజెక్ట్‌లను ఎంచుకోవచ్చు.

IIT Kanpur Recruitment 2021 : ఐఐటీ కాన్పూర్‌లో 95 నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హ‌తలు ఇవే


భ‌విష్య‌త్ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా..

ఈ విష‌యంపై ఐఐటీ హైద‌రాబాద్ డైరెక్ట‌ర్ బీఎస్ మూర్తి మాట్లాడారు. ఈ కోర్సులను సంబంధి ప‌రిశ్ర‌మ‌ల భ‌విష్య‌త్ ప్ర‌యోజ‌నాలు ప్ర‌స్తుత మార్కెట్ అనుగుణంగా రూపొందించామ‌ని అన్నారు. బీటెక్ త‌రువాత అధ్యాయ‌నాల‌కు, ప‌రిశోధ‌న‌ల అభ్యాసానికి జాతీయ సంస్థ‌లు, విద్యాసంస్థ‌ల్లో రీసెర్చ్ విభాగాల్లో ప‌ని చేయ‌డానికి ఈ కోర్సులు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయని ఆయ‌న అన్నారు.

కంప్యుటేషనల్ ఇంజ‌నీరింగ్‌లో బీటెక్ ప్రాధాన్య‌త‌ను గురించి ఐఐటీ మెకానికల్ & ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం రాజా బెనర్జీ మాట్లాడారు. కంప్యుటేషనల్ ఇంజ‌నీరింగ్ విద్యార్థులు ఇంట‌ర్‌-డిసిప్లిన‌రీ విద్య‌ను పొందుతారిన ఆయ‌న అన్నారు. ఈ విభాగంలో కోర్సు చేసిన వారు అత్యాధునిక సంఖ్యా పద్ధతులు, అల్గోరిథంలు, మోడలింగ్, ఇంజనీరింగ్ వ్యవస్థలు మరియు ప్రక్రియల అనుకరణలు (Algorithm), అధిక పనితీరు కలిగిన కంప్యూటింగ్, ప్రాసెస్ కంట్రోల్ మరియు ఆప్టిమైజేషన్, డేటా అనలిటిక్స్ మరియు మెషిన్ లెర్నింగ్ (Machine Learning) విభాగాల్లో ప్రావీణ్య‌త సాధిస్తార‌ని అన్నారు.

Online Course : నైపుణ్యానికి చిరునామా.. IIIT ఢిల్లీలో కంప్యూట‌ర్ సైన్స్‌ ఉపాధ్యాయుల‌కు ప్ర‌త్యేక కోర్సు


కొత్తగా 7 ఆన్​లైన్​ పీజీ కోర్సులు..

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయి. మార్కెట్​ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నాయి విద్యా సంస్థలు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీ హైదరాబాద్ ఏడు కొత్త ఆన్‌లైన్ ఎంటెక్​ ప్రోగ్రామ్‌ (Mtech Programs) లను ప్రారంభించింది. విద్యార్థుల కోసం ఏడు ఎంటెక్​, వర్కింగ్ ప్రొఫెషనల్స్ (Working Professionals) కోసం ఒక ఎం-డిజైన్ ప్రోగ్రామ్​లను రూపొందించింది.

విద్యార్థుల కోసం ఏడు ఎంటెక్​, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఒక ఎం-డిజైన్ ప్రోగ్రామ్​లను రూపొందించింది. కోర్సులు క్రెడిట్ సిస్టమ్​పై ఆధారపడి ఉంటాయి. తద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుకు మారే అవకాశం ఉంటుంది. కోర్సులో భాగంగా కోర్, ఎలక్టివ్, ప్రాజెక్ట్ వర్క్​లు ఉంటాయి. కాగా, ఇండస్ట్రియల్​ మెటలర్జీ, ఈవీ టెక్నాలజీ, కంప్యుటేషనల్ మెకానిక్స్, ఇంటిగ్రేటెడ్ కంప్యూటేషనల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్స్ ప్రాసెసింగ్ (CSP), పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ సిస్టమ్ (PEPS), మైక్రోఎలక్ట్రానిక్స్ అండ్​ వీఎల్​ఎస్​ఐ (ME & VLSI) వంటి ఏడు ఎంటెక్​ ప్రోగ్రామ్స్​లో విద్యార్థులకు దేనికైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

First published:

Tags: EDUCATION, IIT, IIT Hyderabad, New course, Online Education

ఉత్తమ కథలు