Home /News /jobs /

IIT HYDERABAD ANNOUNCES CERTIFICATE PROGRAM ON FUTURE WIRELESS COMMUNICATION UMG GH

IIT Hyderabad: ప్యూచర్ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌.. ఐఐటీ హైదరాబాద్ కొత్త కోర్సు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఐటీ హైదరాబాద్, ‘ఫ్యూచర్ వైర్‌లెస్ కమ్యూనికేషన్’పై 12 నెలల సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు జూలై 10లోపు దరఖాస్తు చేసుకోవాలి. సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ 2022, ఆగస్టు 1 నుంచి ప్రారంభం క

ఇంకా చదవండి ...
ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad), ‘ఫ్యూచర్ వైర్‌లెస్ కమ్యూనికేషన్’పై 12 నెలల సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల (Applicationsను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు జూలై 10లోపు దరఖాస్తు చేసుకోవాలి. సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ 2022, ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 స్కాలర్‌షిప్ లభించనుంది. స్కాలర్‌షిప్‌‌తోపాటు ఐఐటీహెచ్ (IITH) 6జీ రీసెర్చ్ ప్రాజెక్ట్‌లో 50 ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్స్, 200 ఆర్ అండ్ డీ ప్రాజెక్ట్ స్టాఫ్ పొజిషన్స్ ఉంటాయని ఐఐటీ హైదరాబాద్ తెలిపింది. మరిన్ని వివరాలకు http://fwc.iith.ac.in/ వెబ్ సైట్ సందర్శించాలని సూచించింది.

ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ జీవీవీ శర్మ మాట్లాడుతూ.. “డిప్లొమా, బీఎస్‌సీ, బీటెక్ గ్రాడ్యుయేట్లు/ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా సైన్స్, ఇంజనీరింగ్‌లోని ఏదైనా బ్రాంచ్‌లో అందుకు సమానమైన డిగ్రీ ఉన్నవారు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు. ఈ సర్టిఫికేషన్ కోర్సు 4 మాడ్యూల్‌లుగా ఉంటుంది. ఏదైనా ఒక మాడ్యూల్ తర్వాత నిష్క్రమించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రోగ్రామ్ ముగిసే వరకు నెలకు రూ. 25,000 స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఐఐటీ హెచ్ 6G రీసెర్చ్ ప్రాజెక్ట్‌లో 50 వరకు ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్స్, 200 R&D ప్రాజెక్ట్ స్టాఫ్ ఫొజిషన్స్ ఉంటాయి.’’ అని తెలిపారు.

ఐఐటీ హైదరాబాద్, డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ‘‘ఐఐటీహెచ్ 5జీ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో రూపొందించిన విజ్ఞాన సంపదను వీలైనంత తక్కువ సమయంలో దేశంలోని తాజా గ్రాడ్యుయేట్‌లతో పంచుకోవడం చాలా అవసరం. ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ సంవత్సరానికి కనీసం 500 ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ డొమైన్‌లో శ్రామిక శక్తి తీవ్రమైన కొరతను పరిష్కరించగలదు’’ అని చెప్పుకొచ్చారు.

కేంద్ర కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తాజా ప్రోగ్రామ్ లాంచ్‌ ఈవెంట్‌లో మాట్లాడారు. “ఐఐటీ హైదరాబాద్, ప్రతి సంవత్సరం 500 మంది ఇంజనీర్లకు శిక్షణనిచ్చే లక్ష్యంతో ఫ్యూచర్ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌పై సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. భారత్ విశ్వసనీయమైన గ్లోబల్ సప్లయ్ చైన్ పార్టనర్‌గా మారడానికి 20 ఏళ్ల సుదీర్ఘ రోడ్ మ్యాప్‌కు అనుగుణంగా ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఇంజనీర్ల వనరుల సమూహాన్ని రూపొందించడానికి ఎంతో నిబద్ధతతో ఉన్నాం. ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ మూర్తి, మొత్తం బృందానికి అభినందనలు. డిజిటల్ నేషన్ బిల్డింగ్‌కు సహకరించే ఈ కోర్సులో పాల్గొనే వారి కోసం ఎదురు చూస్తున్నాం.’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పదోతరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో భారీ ఉద్యోగాలు..!


ఐఐటీ హైదరాబాద్, హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఆన్‌లైన్ ఎంటెక్ (MTech) ప్రోగ్రామ్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఇది రాబోయే అకడమిక్ ఇయర్ నుంచి అందుబాటులో ఉంటుందని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ (HST) ఆఫర్ చేస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తును డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ http://www.hst.iith.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో జూలై 7లోపు సమర్పించాలని ఐఐటీ హైదరాబాద్ సూచించింది.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Iiit hyderabad, IIT, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు