హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Guwahati: ఐఐటీ గౌహతి నుంచి స్పెషల్ కోర్సులు.. ఐటీ ప్రొఫెషనల్స్‌కు పీజీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ లాంచ్..

IIT Guwahati: ఐఐటీ గౌహతి నుంచి స్పెషల్ కోర్సులు.. ఐటీ ప్రొఫెషనల్స్‌కు పీజీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ లాంచ్..

IIT Guwahati: ఐఐటీ గౌహతి నుంచి స్పెషల్ కోర్సులు.. ఐటీ ప్రొఫెషనల్స్‌కు పీజీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ లాంచ్..

IIT Guwahati: ఐఐటీ గౌహతి నుంచి స్పెషల్ కోర్సులు.. ఐటీ ప్రొఫెషనల్స్‌కు పీజీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ లాంచ్..

ఐఐటీ గౌహతి మూడు పీజీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేస్తోంది. కంప్యూటింగ్ అప్లికేషన్స్, డీప్‌లెర్నింగ్ ఫర్ కంప్యూటర్ విజన్ అండ్ ఎక్స్‌ఆర్, యూఎక్స్ డిజైన్ అండ్ హెచ్‌సీఐపై సర్టిఫికేషన్ కోర్సులను ప్రారంభించనుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌(Entrance Exam) ద్వారా ఐఐటీల్లో అడ్మిషన్(Admission) పొందలేని వారి కోసం ఇప్పుడు అనేక స్పెషల్ ఆన్‌లైన్ స్కిల్ ప్రోగ్రామ్స్(Special Online Skill Programme), సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్(Certification Programme) అందుబాటులో ఉన్నాయి. స్టూడెంట్స్‌తో పాటు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ కోసం ఇలాంటి కోర్సులను ఐఐటీలు లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ఐటీ ప్రొఫెషనల్స్(Professionals) కోసం ఐఐటీ గౌహతి మూడు పీజీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేస్తోంది. కంప్యూటింగ్ అప్లికేషన్స్(Applications), డీప్‌లెర్నింగ్ ఫర్ కంప్యూటర్ విజన్ అండ్ ఎక్స్‌ఆర్, యూఎక్స్ డిజైన్ అండ్ హెచ్‌సీఐపై సర్టిఫికేషన్ కోర్సులను(Certification Course) ప్రారంభించనుంది. ఇందుకోసం ఎడ్యూటెక్ ప్లాట్‌ఫామ్ కోర్సెరా(Coursera) సహకారం అందించనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు 2022 సెప్టెంబర్ 21 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Telangana Jobs: అభ్యర్థుల ఆందోళనతో.. తెలంగాణలో మరో రిక్రూట్ మెంట్ రద్దు..

ఐటీ ప్రొఫెషనల్స్, టెక్ కంపెనీల్లో ప్రాజెక్ట్ లీడ్స్/మేనేజర్లు, డేటా ప్రొఫెషనల్స్, కోడింగ్ ప్రొఫెషనల్స్, క్లౌడ్ డెవలపర్స్ వంటి వారు తమ కెరీర్‌‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్స్ కోసం అప్లై చేసుకోవాలంటే కోడింగ్ (C/C++), అల్గారిథమ్స్, హైస్కూల్ స్థాయి గణితంపై ప్రాథమిక అవగాహనతో పాటు ఏదైనా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.

* క్లౌడ్ ఇంప్లిమెంటేషన్‌‌లో ఎక్స్‌పర్ట్..

క్లౌడ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్‌లో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్.. క్లౌడ్ ఇంప్లిమెంటేషన్‌ డిజైన్, ప్లాన్, స్కేలింగ్‌లో అభ్యర్థులు ఎక్స్‌‌పర్ట్‌గా మారడంలో కీలకం కానుంది. AWS, Microsoft Azure, GCP వంటి పాపులర్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ ప్రొవైడర్‌లలో డైనమిక్‌గా స్కేలబుల్ అప్లికేషన్‌లను డిజైన్ చేసి, అమలు చేయడానికి అవసరమైన కోర్ స్కిల్ సెట్‌లను నేర్చుకోవడంలోనూ ఈ ప్రోగ్రామ్ సహాయపడనుందని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.

IGNOU July 2022 Admission: మరోసారి రిజిస్ట్రేషన్ గడువు పొడిగించిన ఇగ్నో.. చివరి తేదీ ఎప్పుడంటే..

* డెస్క్‌టాప్స్, మొబైల్ ప్లాట్‌ఫారమ్స్‌లో..

కంప్యూటర్ విజన్ అండ్ XRలో డీప్ లెర్నింగ్‌ కోసం ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఎంతో సహాయపడనుంది. అలాగే కంప్యూటర్ విజన్ అండ్ XR డొమైన్‌లో డీప్ లెర్నింగ్ పద్ధతులతో పని చేయడానికి అభ్యర్థుల్లో అప్‌స్కిల్స్ కూడా పెంపొందించనున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా డెస్క్‌టాప్స్, మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ల్లో యూనిటీ గేమ్ ఇంజిన్, SDKలను ఉపయోగించి AR/VR సిస్టమ్స్ డిజైన్ చేసి, అమలు చేయడంలో అభ్యర్థులు సాధికారత సాధించనున్నారు.

UX డిజైన్ & HCI ఎక్యూప్స్‌లో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్.. కటింగ్-ఎడ్జ్ UX డిజైన్ అండ్ HCI కాన్సెప్ట్‌లను ఉపయోగించి అర్థవంతమైన, స్పష్టమైన ఆన్‌లైన్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి, డిజిటల్ యూజర్ జెర్నీ ట్రాన్స్‌ఫామ్ కావడానికి లెర్నర్స్‌కు అవసరమైన నాలెడ్జ్, టూల్స్‌ను అందించనుంది.

Government Job Notifications: ఇంటర్, డిగ్రీ/బీటెక్ అర్హతతో 4 నోటిఫికేషన్లు విడుదల.. వివరాలు తెలుసుకోండి..

* అవగాహన ఉండాల్సిన సాఫ్ట్‌వేర్స్ ఇవే..

గ్రాఫిక్ డిజైనర్స్, ఫ్రంట్- ఎండ్ డెవలపర్స్, UX రీసెర్చర్లు, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ వంటివారు అద్భుతమైన డిజిటల్ ఎక్స్ పీరియన్స్ పొందటానికి ఆసక్తిగా ఉంటే.. Figma, Adobe XD, Balsamic, Miro వంటి సాఫ్ట్‌వేర్‌లపై బేసిక్ అవగాహన ఉండాలని ఇన్‌స్టిట్యూట్ సూచించింది. అయితే ఇది తప్పనిసరి కాదు. కంప్యూటేషనల్ ఇమేజింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ హ్యూమన్ విజన్‌పై ఆసక్తి ఉన్న లెర్నర్స్ కూడా ఈ సర్టిఫికేషన్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. న్యూ ఇమేజింగ్ డివైజస్, VR/AR, ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎలక్ట్రానిక్ గేమ్స్, రోబోటిక్ అసిస్టెడ్ టెక్నాలజీస్ తదితర వాటిలో అప్లికేషన్‌ల కోసం కంప్యూటేషనల్ పద్ధతులపై ఆసక్తి ఉన్నవారికి కూడా ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడనుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, IIT, JOBS, Students

ఉత్తమ కథలు