Home /News /jobs /

IIT GUWAHATI OFFERS ONLINE COURSES IN CYBERSECURITY AI DEEP LEARNING FOR WORKING PROFESSIONALS GH VB

Working Professional: వర్కింగ్​ ప్రొఫెషనల్స్​కు గుడ్​న్యూస్.. 8 నెలల సమయంలోనే ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఐటీ గౌహతి సైబర్ సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్​ డీప్ లెర్నింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. వర్కింగ్​ ప్రొషెషనల్స్​ (Working professionals) తమ కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ కోర్సులను రూపొందించింది.

ఇంకా చదవండి ...
మారుతున్న టెక్నాలజీకి(Technology) అనుగుణంగా కొత్త కోర్సులను (New courses) ప్రవేశపెడుతున్నాయి ప్రతిష్టాత్మక సంస్థలు. జాబ్ మార్కెట్ను(Job Market) దృష్టిలో పెట్టుకొని వీటికి శ్రీకారం చుడుతున్నాయి. తాజాగా ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- గౌహతి (IIT Guwahati) సైబర్ సెక్యూరిటీతో(Cyber Security) పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అండ్​ డీప్ లెర్నింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. వర్కింగ్​ ప్రొషెషనల్స్​ (Working professionals) తమ కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ కోర్సులను రూపొందించింది. కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(Bachlor Degree), ఐటీ లేదా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో(Software Development) కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్న అభ్యర్థులు మాత్రమే కోర్సులో ఎన్​రోల్ చేసుకునేందుకు అర్హులు. విజయవంతంగా కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులు ఐఐటీ గౌహతి, ప్రొఫెషనల్​ లెర్నింగ్​ ప్లాట్​ఫామ్​​ టైమ్స్ జారీ చేసిన సర్టిఫికేట్‌లను అందుకుంటారు.

10Th Class Jobs: పదో తరగతి పాస్ అయ్యారా.. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీ కోసమే..


ఈ ప్రోగ్రామ్​ను ఐఐటీ గౌహతి, టైమ్స్​TSW ఫ్యాకల్టీ సభ్యులు నిర్వహిస్తున్నారు. కోర్సులో భాగంగా ఇండస్ట్రీ ఎక్స్​పర్ట్స్​తో వీకెండ్స్‌ లైవ్​ సెషన్లు నిర్వహిస్తారు. ఆన్​లైన్​ లైవ్​ సెషన్లు పూర్తయ్యాక.. విద్యార్థులు క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత ఐఐటీ గౌహతి క్యాంపస్‌లో ఐదు రోజుల పాటు రియల్​ టైమ్​ ప్రాజెక్ట్​పై పని చేయాల్సి ఉంటుంది. సైబర్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్ మొత్తం 8 నెలల వ్యవధి గల కోర్సు. నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌లు, సైబర్ సెక్యూరిటీ మేనేజర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ వంటి పొజిషన్స్ కోసం ప్రయత్నించే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ 9-నెలల కోర్సు. ఈ కోర్సులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్‌లో పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా అనలిటిక్స్, న్యూరల్ నెట్‌వర్క్‌లు, కంప్యూటర్ విజన్, ఇమేజ్ రికగ్నిషన్ మొదలైన అంశాలపై శిక్షణనిస్తారు. ఇది ఏఐ, మెషిన్​ లెర్నింగ్​​ ఇంజనీర్ వంటి జాబ్​ రోల్స్​ కోసం అభ్యర్థులను సిద్ధం చేయడంలో సహాయపడుతుంది.

Missing Ex After Marriage: పెళ్లి అయినా ఎక్స్ లవర్ గుర్తుకు వస్తున్నారా..?అయితే ఇలా చేయండి..


టైమ్స్​ భాగస్వామ్యంతో ​కొత్త కోర్సులు..
కొత్త కోర్సులపై ఐఐటీ గౌహతి డైరెక్టర్ ప్రొఫెసర్ టీజీ సీతారాం మాట్లాడుతూ, “పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాం. ఈ ప్రోగ్రామ్‌ల ద్వారా వర్కింగ్​ ప్రొఫెషనల్స్​ తమ నైపుణ్యాలను మరింతగా పెంచుకోవచ్చు. వారి కెరీర్​లో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు వీలు కల్పిస్తాయి. టైమ్స్ ప్రొఫెషనల్ లెర్నింగ్ ప్లాట్​ఫామ్​ భాగస్వామ్యంతో ఈ కోర్సులను ఆఫర్​ చేస్తున్నాం.” అని చెప్పారు.

దీనిపై టైమ్స్ ప్రొఫెషనల్ లెర్నింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీష్ శ్రీకృష్ణ మాట్లాడుతూ, “డిజిటలైజేషన్ మన జీవితంలో అంతర్భాగంగా మారింది. ఈ కొత్త టెక్నాలజీతో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. కొత్త టెక్నాలజీని ఆసరాగా చేసుకొని సైబర్‌టాక్‌లు కూడా పెరుగుతున్నాయి. మాల్వేర్, రాన్​సమ్​వేర్​, ఫిషింగ్ దాడులతో సహా సైబర్‌టాక్‌లను ఎదుర్కోవడానికి బలమైన సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం చాలా ఉంది. అందుకే, ఐఐటీ గౌహతి భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & డీప్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నాం.” అని తెలిపారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు