హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Guwahati: ఐఐటీ గౌహతిలో టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్ కోర్సులు.. నో ఎంట్రెన్స్ టెస్ట్!

IIT Guwahati: ఐఐటీ గౌహతిలో టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్ కోర్సులు.. నో ఎంట్రెన్స్ టెస్ట్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IIT Guwahati: ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (E&ICT) అకాడమీ.. టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ రంగాల్లో స్పెషలైజేషన్ కోర్సులను ఆన్‌లైన్ ఫార్మాట్‌లో అందించనుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు స్కిల్స్ పెంపొందించటానికి ప్రధాన ఇన్‌స్టిట్యూట్స్ వివిధ రకాల కోర్సుల (New Courses)ను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా ఐఐటీ గౌహతి (IIT Guwahati) కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఇలాంటి ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (E&ICT) అకాడమీ.. టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ రంగాల్లో స్పెషలైజేషన్ కోర్సులను ఆన్‌లైన్ ఫార్మాట్‌లో అందించనుంది. ఇందుకు ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ వెరాండా సహాయ సహకారాలను అందించనుంది.

* హ్యాండ్స్- ఆన్ ప్రాక్టీస్, కేస్ స్టడీస్‌

ఈ కోర్సుల్లో భాగంగా వివిధ రంగాల్లోని ఎక్స్‌పర్ట్స్ బోధించనున్నారు. అలాగే వ్యక్తిగత కెరీర్ కోసం అవసరమైన కోచింగ్, మెంటరింగ్‌తో పాటు సహాయ సహకారాలను వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు అందించనున్నారు. ప్రతి కోర్సులో సిములేషన్స్, హ్యాండ్స్- ఆన్ ప్రాక్టీస్, కేస్ స్టడీస్‌ వంటివి ఉంటాయి. తద్వారా వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ కెరీర్‌‌ను మరింత మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఇన్ స్టిట్యూట్ పేర్కొంది.

* కోర్సుల వివరాలు

ఎమర్జింగ్ రంగాల్లో స్కిల్డ్ హ్యుమన్ పూల్‌ను క్రియేట్ చేయడమే లక్ష్యంగా ఐఐటీ గౌహతి.. ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, సప్లై చైన్ & ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డిజిటల్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌ వంటి రంగాల్లో స్పెషలైజేషన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.

* వర్క్‌ఫోర్స్‌లోని నిపుణులకు స్కిల్స్ పెంపొందించడానికి..

వెరాండా హయ్యర్ ఎడ్యుకేషన్ హెడ్ ఆదిత్య మాలిక్ మాట్లాడుతూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ రంగాల్లో విద్యార్థులు, బిజినెస్ యాజమాన్యాలు, వర్క్‌ఫోర్స్‌లోని నిపుణులకు తమ నైపుణ్యాన్ని మెరుగుపరచడంలో ఈ కోర్సులు దోహదపడనున్నాయి. ఇందుకు ఐఐటీ గౌహతితో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉంది.

ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు నెపుణ్యం ఉన్న అభ్యర్థుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో సంస్థలు అభివృద్ధి చెందడానికి, ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. విస్తారమైన నైపుణ్యం కోసం ప్రతి కోర్సు గైడెన్స్‌గా ఉపయోగపడుతుంది. అలాగే బిజినెస్, పరిశ్రమల డిమాండ్‌లకు అనుగుణంగా కెరీర్ మెరుగుదలకు అవసరమైన మరింత నైపుణ్యాన్ని అందిస్తుంది.’’ అని మాలిక్ అన్నారు.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు అలర్ట్.. FCIలో 5 వేల జాబ్స్ .. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్

ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (E&ICT) అకాడమీ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ గౌరవ్ త్రివేది మాట్లాడుతూ.. ప్రపంచం డిజిటల్ ఎకానమీ వైపు వేగంగా కదులుతోందన్నారు. అందుకు అనుగుణంగా వర్క్‌ఫోర్స్‌ను మెరుగుపరచడానికి స్కిల్స్ అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ నుంచి సర్టిఫికేషన్ ఇవ్వనున్నారు.

* నో ఎంట్రెన్స్ టెస్ట్

సాధారణంగా ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌లలో చదవాలంటే ఎంట్రెన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే ఐఐటీ గౌహతి ఆఫర్ చేస్తున్న ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, సప్లై చైన్ & ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డిజిటల్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌ వంటి ఎమర్జింగ్ రంగాల్లో స్పెషలైజేషన్ కోర్సుల్లో ఎలాంటి ఎంట్రెన్స్ పరీక్ష లేకుండానే చేరవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, IIT, JOBS

ఉత్తమ కథలు