IIT Guwahati: సాధారణంగా ఐఐటీల్లో అడ్మిషన్ పొందాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. విపరీతమైన పోటీని తట్టుకుని ఆ పరీక్షలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు మాత్రమే ఐఐటీల్లో అడ్మిషన్ లభిస్తుంది. కాగా, ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేకుండానే ఐఐటీ గౌహతి (IIT Guwahati) అడ్వాన్స్ సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఐఐటీ గౌహతి ఆఫర్ చేసే ఆ కోర్సులు ఏంటి, అవి స్టూడెంట్స్‌కు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఈ కోర్సులు ప్రవేశపెట్టడం వెనుక ఐఐటీ గౌహతి లక్ష్యం ఏంటి, అనే వివరాలు తెలుసుకుందాం.
ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, సప్లై చైన్ & ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డిజిటల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఐఐటీ గౌహతి స్పెషలైజ్డ్ కోర్సులను అందించనుంది. అభివృద్ధికి తోడ్పడే నైపుణ్యం కలిగిన మానవ వనరులను సృష్టించే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రవేశపెట్టినట్లు ఐఐటీ ప్రకటించింది. ఈ కోర్సులను ఆన్‌లైన్ ఫార్మాట్‌లో వెరండా (Veranda) ద్వారా అందించనున్నారు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ &ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ఎడ్యురేక(Edureka) బ్రాండ్‌కు వెరండా (వెరెండా లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్) ప్రాతినిథ్యం వహిస్తోంది. ఈ కోర్సులను ఐఐటీ గౌహతి ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (E&ICT) అకాడమీ అందిస్తోంది.
Doordarshan Recruitment: దూరదర్శన్ లో ఉద్యోగాలు .. వెబ్‌సైట్ అసిస్టెంట్, న్యూస్ రీడర్ పోస్టులు.. వివరాలిలా..
* నిపుణులతో క్లాసులు
ఈ కోర్సుల్లో భాగంగా ఆయా విభాగాల్లో నిపుణులతో విద్యార్థులకు క్లాసులను కండక్ట్ చేయనున్నారు. ప్రతి ఒక్కరినీ గైడ్ చేయడంతో పాటు వారికి సహకారం అందించి వారి కెరీర్ ముందుకు సాగేలా సూచనలు, సలహాలు ఇస్తారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ను వారి కెరీర్‌లో నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్పిస్తారు. అందుకు హ్యాండ్స్-ఆన్ ప్రాక్టీస్(Hands-On Practice) ఇస్తారు. ఈ విషయాలను సరిగా సద్వినియోగం చేసుకుంటే, తప్పకుండా కెరీర్‌లో ముందుకు వెళ్లగలరని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.
* భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు
భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు వేగంగా జరుగుతున్నాయని, దేశం డిజిటల్ దిశగా వడివడిగా అడుగులు వేస్తుందని తెలిపారు ఐఐటీ గౌహతి ఈ&ఐసీటీ అకాడమీ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ గౌరవ్ త్రివేది. ఈ క్రమంలోనే ఇండియన్ వర్క్ ఫోర్స్ తమ స్కిల్స్ మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఈ&ఐసీటీ అకాడమీ సర్టిఫికెట్ అందిస్తుంది.
IT Companies: ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన Wipro, Infosys, Tech Mahindra కంపెనీలు.. ఏం జరిగిందంటే..
సంస్థకు కావాల్సిన అవసరాలు, నైపుణ్యాలు ఉద్యోగులు ఇచ్చే ఔట్‌పుట్ మధ్య తేడా ఉందని, ఈ క్రమంలో వారికి కావాల్సిన నైపుణ్యాలు అందించేందుకు తమ కోర్సు ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు వెరండా(ప్లాట్ ఫామ్) సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హెడ్ ఆదిత్య మాలిక్. బిజినెస్ ఓనర్స్, ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్‌కు సహకారం అందించేందుకు ఐఐటీ గౌహతి ఈ&ఐసీటీ అకాడమీతో భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. ఐఐటీ గౌహతి అందించే ఈ కోర్సుల్లో విస్తారమైన నైపుణ్యం, అనుభవం ఉన్న నిపుణులు గైడెన్స్ ఇవ్వనున్నారని వివరించారు.
* నైపుణ్యాలతో కెరీర్ అడ్వాన్స్‌మెంట్
మార్కెట్‌లో నైపుణ్యాలు, ప్రతిభ ఉన్న వారికి ఫుల్ డిమాండ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచం ప్రతి రోజూ అప్‌గ్రేడ్ అవుతున్న క్రమంలో వర్క్ ఫోర్స్ కూడా తమ స్కిల్స్ మరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఐఐటీ గౌహతి, వెరండా అందించే ఈ కెరీర్ అడ్వాన్స్‌డ్ కోర్సులు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.