IIT GANDHINAGAR LAUNCHES ONLINE INTERACTIVE PROGRAMME ON STEM WITH GIRL STUDENTS GH VB
Online Programme: విద్యార్థినుల కోసం సరికొత్త ఆన్లైన్ ప్రొగ్రామ్.. లాంచ్ చేసిన ప్రముఖ ఐఐటీ .. వివరాలిలే..
ప్రతీకాత్మక చిత్రం
విద్యార్థి దశలోనే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) సబ్జెక్టులలో కెరీర్ ఎంచుకునేలా బాలికలను ప్రోత్సహించేందుకు దాదాపు అన్ని ఐఐటీ సంస్థలు తమ వంతుగా కృషి చేస్తున్నాయి. ఇదే తరహాలో తాజాగా అమెరికన్ ఇండియా ఫౌండేషన్ (AIF)తో కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గాంధీనగర్ (IITGN) ‘స్పార్కిల్ సిరీస్’ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది.
విద్యార్థి దశలోనే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) సబ్జెక్టులలో కెరీర్ ఎంచుకునేలా బాలికలను ప్రోత్సహించేందుకు దాదాపు అన్ని ఐఐటీ సంస్థలు తమ వంతుగా కృషి చేస్తున్నాయి. ఇదే తరహాలో తాజాగా అమెరికన్ ఇండియా ఫౌండేషన్ (AIF)తో కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గాంధీనగర్ (IITGN) ‘స్పార్కిల్ సిరీస్’ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లోని (JNVs) 11వ తరగతికి చెందిన విజ్ఞాన జ్యోతి స్కాలర్ల కోసం తీసుకొచ్చిన ఆన్లైన్ ఇంటరాక్టివ్ స్టెమ్ (STEM) ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. బాలికలను సైన్స్ వైపు మళ్లించే లక్ష్యంతో భారత ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) ఇప్పటికే విజ్ఞాన్ జ్యోతి పథకం ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా విద్యనభ్యసిస్తున్న తొలిదశలోనే పోకస్ ఇంటర్వెన్షన్ చేయడం ద్వారా సైన్స్ (STEM) రంగాలలో మహిళల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఐటీ జీఎన్ (IITGN) లాంచ్ చేసిన ‘స్పార్కిల్ సిరీస్’ విజ్ఞాన్ జ్యోతి పథకానికి అనుగుణంగా ఉంటూ యువ విద్యార్థినులలో STEMని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని భావిస్తోంది.
ఈ తొమ్మిది ఎపిసోడ్ల స్టెమ్ సిరీస్ దేశవ్యాప్తంగా ఉన్న 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 200 జిల్లాల్లోని 200 జవహర్ నవోదయ విద్యాలయాల్లోని సుమారు 10,000 మంది విజ్ఞాన జ్యోతి బాలికలకు చేరుకుంటుందని అంచనా. ఐఐటీ జీఎన్ సెంటర్ ఫర్ క్రియేటివ్ లెర్నింగ్ ( IITGN centre for creative learning) యూట్యూబ్ ఛానెల్లో జనవరి 22 నుంచి ప్రతి శనివారం మధ్యాహ్నం 3 నుంచి 4:30 గంటల వరకు ‘స్పార్కిల్ సిరీస్’ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ యూట్యూబ్ ఛానెల్లో ‘స్పార్కిల్ సిరీస్’లోని గణితం, సైన్స్, కంప్యుటేషనల్ థింకింగ్ లపై వరుస సెషన్లను విద్యార్థినులు వినవచ్చు. CCL IITGN అని విద్యార్థినులు యూట్యూబ్ లో సెర్చ్ చేసినా.. ఈ ఛానల్ కనిపిస్తుంది.
ఈ ఆన్లైన్ ప్రోగ్రాంకు IBM ఇండియా నిధులు సమకూర్చింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొనే విద్యార్థినులు సాధారణ పాఠ్యాంశాల ఆధారిత సైన్స్ విద్యకు మించి ఎక్కువ విషయాలను తెలుసుకుంటారు. ఈ ప్రోగ్రాం విద్యార్థినుల్లో శాస్త్రీయ స్వభావం (scientific temperament)తో పాటు ఉత్సాహాన్ని పెంపొందించడంలో వారికి సహాయపడుతుంది. ఈ సిరీస్‌లోని ఇంటరాక్టివ్ సెషన్లు సైన్స్, మ్యాథమెటిక్స్ పాఠ్యాంశాలపై ఆధారపడి ఉంటాయి. అయితే అవి కాగితం, కూరగాయలు, ప్లేయింగ్ కార్డ్‌లు, సంగీత వాయిద్యాలు, వివిధ రకాల ఈలలు, సైకిళ్లు మొదలైన సాధారణ మెటీరియల్స్ ఉపయోగించి వివిధ యాక్టివిటీస్ కలిగి ఉంటాయి. "స్టెమ్ సబ్జెక్టుల సహజమైన సౌందర్యాన్ని (inherent beauty) విద్యార్థినులు వివిధ ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌లు, కార్యకలాపాలు, ఓపెన్-ఎండ్ ప్రశ్నలతో అద్భుత భావాన్ని పెంపొందించుకోవడమే మా ముఖ్య ఆలోచన" అని ఇన్స్టిట్యూట్ చెబుతోంది.
ఈ సిరీస్ లక్ష్యాలను ఐఐటీ జీఎన్ సీసీఎల్ హెడ్, ప్రొఫెసర్ మనీష్ జైన్ మాట్లాడుతూ వివరించారు. ఆయన మాట్లాడుతూ.. "సాంప్రదాయకంగా స్టెమ్ సబ్జెక్టులలో వృత్తిని చాలా మంది మహిళలు కొనసాగించరు. దీని కారణంగా ఎంతో మేధోసంపత్తి గల మహిళ సహకారాన్ని సొసైటీ కోల్పోతోంది. దీనికి పరిష్కారంగా స్టెమ్ సబ్జెక్టులను ఆకర్షణీయంగా.. స్ఫూర్తిదాయకంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.
ఇలా చేయడం ద్వారా పాఠశాల బాలికలను సైన్స్, మ్యాథ్లకు కట్టిపడేసేందుకు JNV, AIF, IBMలతో సహకరించడానికి మేం ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ తీసుకువచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. గణితం/విజ్ఞానం మన జీవితానికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూపడంపై దృష్టి ఉంటుంది. ఈ సిరీస్ లో మేం ఆకర్షణీయమైన, ఆసక్తికరమైన కార్యకలాపాలు, ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌లు, చారిత్రక కథనాలు.. ఓపెన్-ఎండ్ ప్రశ్నల ద్వారా గణితం, సైన్స్ పాఠ్యాంశాల సహజమైన సౌందర్యాన్ని అన్వేషిస్తాం." అని మనీష్ జైన్ వివరించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.