Home /News /jobs /

IIT GANDHINAGAR INVITATION TO APPLY FOR IIT GANDHINAGAR EARLY CAREER FELLOWSHIP 1 LAKH STIPEND GH VB

Students: విద్యార్థులకు గుడ్ న్యూస్..వాటికి దరఖాస్తుల ఆహ్వానం.. ఎంపికైతే ప్రతి నెలా రూ. 1 లక్ష స్టైఫండ్..​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోనే ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ (ఐఐటీ) గాంధీనగర్ 'ఎర్లీ-కెరీర్ ఫెలోషిప్'ని ప్రకటించింది. యంగ్​ రీసెర్చ్​ స్కాలర్లను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఫెలోషిప్​ ఆఫర్ చేస్తుంది. రీసెర్చ్ ఫెలోషిప్​కు ఎంపికైన స్కార్లకు ప్రతినెలా రూ.1,00,000 స్టైఫండ్ అందజేస్తుంది.

ఇంకా చదవండి ...
దేశంలోనే ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ (ఐఐటీ) గాంధీనగర్(Gandhi Nagar) 'ఎర్లీ-కెరీర్ ఫెలోషిప్(Fellowship)'ని ప్రకటించింది. యంగ్​ రీసెర్చ్​ స్కాలర్లను(Research Scholars) ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఫెలోషిప్​ ఆఫర్(Fellowship Offer) చేస్తుంది. రీసెర్చ్ ఫెలోషిప్​కు ఎంపికైన స్కార్లకు ప్రతినెలా రూ.1,00,000 స్టైఫండ్ అందజేస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఐఐటీ గాంధీనగర్ అధికారిక వెబ్‌సైట్ iitgn.ac.in ద్వారా ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా అభ్యర్థులు ఏప్రిల్ 30లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. “దరఖాస్తుదారులు ఐఐటీ గాంధీనగర్​లోని ఫ్యాకల్టీల సహకారంతో ప్రతిపాదనను అభివృద్ధి చేయాలి. వారి పరిశోధన, వృత్తిపరమైన లక్ష్యాలను వివరించాలి. వారి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు ఫ్యాకల్టీ ఆమోదం తప్పనిసరిగా పొందాలి. దరఖాస్తుదారులు తమ రీసెర్చ్​ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఐఐటీ గాంధీనగర్​ ఫ్యాకల్టీ సభ్యుల సహకారం తీసుకోవాలి.’’ అని ఐఐటీ గాంధీనగర్ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్​లో పేర్కొంది.

కాగా, దరఖాస్తుదారులు 2021 జనవరి 1న లేదా ఆ తర్వాత భారత్​ లేదా విదేశాల్లోని ఒక సంస్థలో డాక్టరల్ థీసిస్‌ను విజయవంతంగా సమర్పించి ఉండాలి. వారి పబ్లికేషన్లకు మంచి రేటింగ్ వచ్చి ఉండాలి. ఇప్పటికే తమ డాక్టరల్ థీసిస్‌ను సమర్పించిన లేదా రాబోయే రెండు నెలల్లో తమ థీసిస్‌ను సమర్పించాలనుకుంటున్న అభ్యర్థులు కూడా ఫెలోషిప్​ దరఖాస్తుకు అర్హులే. భారతీయ పౌరులతో పాటు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ హోల్డర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఐఐటీ గాంధీనగర్​ ప్రకటనలో తెలిపింది.

Xiaomi Mi Pad 5: షియోమి నుంచి త్వరలోనే ఎంఐ ప్యాడ్ 5 ట్యాబ్లెట్​ లాంచ్​.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు..


ఏడాదికి రూ. 2 లక్షల ట్రావెలింగ్ అలవెన్సు..
ఈ ఫెలోషిప్ పొందిన స్కాలర్లు అధ్యాపక సభ్యుల సహకారంతో నిర్దిష్ట పరిశోధన ప్రాజెక్ట్‌పై పని చేస్తారు. స్కాలర్లు వారి పరిశోధన ఫలితాలను అంచనా వేసిన తర్వాత కోర్సును బోధించడానికి లేదా అండర్ గ్రాడ్యుయేట్ & పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి అర్హత సాధిస్తారు. ఈ ఫెలోషిప్​కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,00,000 (రూ. 90,000 స్టైఫండ్​, రూ. 10,000హెచ్‌ఆర్‌ఏ) అందజేస్తారు. ఐఐటీ గాంధీనగర్​ క్యాంపస్​లో వసతి పొందని స్కాలర్లకు మాత్రమే హెచ్​ఆర్​ఏ అందజేస్తారు.

మరోవైపు, రీసెర్చ్​ స్కాలర్లు వర్క్‌షాప్‌లు, శిక్షణా కార్యక్రమాలు మొదలైన వాటికి హాజరు కావడానికి అంతర్జాతీయ ప్రయాణాల కోసం సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు ట్రావెలింగ్ అలవెన్సులు కూడా అందజేస్తారు. సెమినార్లు, వర్క్‌షాప్‌లు, ఇతర రీసెర్చ్​ కార్యకలాపాలను నిర్వహించేందుకు కావాల్సిన ఆర్థిక సహాయం కోసం వ్యక్తిగత ప్రతిపాదనలను సమర్పించవచ్చు. ఫెలోషిప్​ను ప్రారంభంలో ఒక ఏడాది పాటు మాత్రమే అందజేస్తారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారి ఫెలోషిప్‌ను మరో ఏడాది పొడిగిస్తారు. అంటే మొత్తం ఫెలోషిప్ వ్యవధి రెండేళ్లు ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: CAREER, Career and Courses, IIT, Travel

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు