దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) గాంధీనగర్ సరికొత్త ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ ఫెసిలిటీ (ISTF)లో ఇంటర్న్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 5 లేదా అంతకంటే ముందు ఐఐటీ గాంధీనగర్ అధికారిక వెబ్సైట్ www.iitgn.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఐఎస్టీఎఫ్లో వివిధ అంశాలపై శిక్షణనిస్తుంది. వీటిలో హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC), నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (Network and Systems), సాఫ్ట్వేర్ మొదలైన మాడ్యూల్స్‌పై అవగాహన కల్పిస్తారు. ఎంపికైన ఇంటర్న్‌లను ప్రాథమికంగా ఆరు నెలల (six months) పాటు నియమించుకుంటారు. వారి పనితీరు ఆధారంగా మరో ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం ఉంది.
ఐఎస్టీఎఫ్ ఇంటర్న్‌షిప్ అర్హత ప్రమాణాలు
దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ (Computer Science), ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ విభాగాల్లో బీటెక్ (BTech) పూర్తి చేసి ఉండాలి. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) పూర్తి చేసిన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
Jobs in Hyderabad: హైదరాబాద్‌లో వాయిస్/ నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
అయితే, అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 6.5 క్రెడిట్స్ (Credits) లేదా 65 శాతం మార్కులను సాధించి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఐఐటీ గాంధీనగర్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
Step 1: ఐఐటీ గాంధీనగర్ అధికారిక పోర్టల్‌ని సందర్శించండి.
Step 2: హోమ్‌పేజీలో కనిపించే కెరీర్ ట్యాబ్‌లోకి వెళ్లండి.
Step 3: తర్వాత, స్టూడెంట్స్/నాన్ టీచింగ్ స్టాఫ్/ఇంటర్న్‌షిప్ లింక్‌పై క్లిక్ చేయండి.
Step 4: వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. సంబంధిత ఖాళీల కోసం అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
Step 5: పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడి వంటి వివరాలతో ముందుగా మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి.
CAT 2021: "క్యాట్" రాస్తున్నారా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Step 6: మీ రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
Step 7: అన్ని వివరాలను సమర్పించి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేయండి.
ఎంపిక ఎలా ఉంటుంది?
అర్హత ప్రమాణాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వాటిలో ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఐఐటీ గాంధీనగర్ ప్రతినెలా రూ. 28,000 స్టైఫండ్‌ను చెల్లిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, IIT, Internship, Students