వేసవి వచ్చిందంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. గత కొన్నేళ్ల నుంచి వాహనాలు (Vehicles) అగ్నికి ఆహుతై పోతున్నాయి. ఎండల తీవ్రత కారణంగానో లేక వాహనాల తయారీలో లోపమో తెలియదు కానీ ఉన్నట్టుండి మంటలు(Fire) చెలరేగి కాలి బూడిద అవుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల ఈవీ వాహనాలు ఫైర్ యాక్సిడెంట్‌కు(Fire Accident) గురికావడం ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలు(Electric Vehicles) దేశంలో ప్రాచుర్యం పొందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం (Central Government) సైతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పాంట్ల ఏర్పాటుకు తయారీ సంస్థలకు భారీ స్థాయిలో రాయితీలను(Discounts) ప్రకటిస్తుంది.
దేశంలో కాలుష్యం (Pollution) నానాటికి పెరిగిపోతుండడంతో డీజిల్ (Deiseal), పెట్రోల్ (Petrol) వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగం పెంచేలా కేంద్రం ఈ చర్యలు చేపడతుంది. అయితే ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగడంతో వాటి అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఐఐటీ గాంధీనగర్ తమ విద్యార్థుల కోసం ఒక పోటీని నిర్వహిస్తుంది. ‘‘ఎలక్ట్రిక్ వాహనాల భద్రతలో ఇంజనీరింగ్ సవాళ్లు’’ పేరుతో ఈ పోటీని చేపట్టనుంది. ఇందు కోసం రిజిస్ట్రేషన్ మే 1 నుంచి ప్రారంభం కాగా, మే 10 సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఎలక్ట్రిక్ వాహనాల్లో( ఈవీ) ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఆందోళనలను సమగ్ర విధానంలో తగ్గించే లక్ష్యంతో సెంటర్ ఫర్ సేఫ్టీ ఇంజినీరింగ్ (CSE), IIT గాంధీనగర్ ఈ పోటీని ప్రకటించాయి. ఈ పోటీలో విద్యార్థులు టీమ్‌లుగా పాల్గొనాలి. ఒక టీమ్‌లో కనీసం ముగ్గురు, గరిష్టంగా ఐదుగురు విద్యార్థులుండాలి. గెలుపొందిన టీమ్‌కు రూ.1 లక్ష.. మొదటి, సెకండ్ రన్నరప్ టీమ్స్‌కు రూ.50వేలు, రూ.25వేల రివార్డ్ అందించనున్నారు.
పోటీలో పొల్గొనేవారు కనీస ప్రమాణాలను అందుకుంటే వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. ఈ పోటీలో కేవలం ఐఐటీ గాంధీ నగర్ విద్యార్థులు మాత్రమే పాల్గొనడానికి అర్హులు. ఈ పోటీ ఫలితాలను జూన్ 30న ప్రకటించనున్నారు. ‘‘సబ్జెక్ట్‌పై(ఈవీ) వివరణాత్మక డాక్యుమెంటేషన్, సమీక్షను నిర్వహించడమే పోటీ మొదటి దశ లక్ష్యం. ఇందులో పాల్గొనేవారు RC ఫైర్‌పై డాక్యుమెంట్ చేయనున్నారు. ప్రస్తుత పరిశోధన, సాంకేతికత ఆధారంగా విశ్లేషణాత్మక సమీక్షను నిర్వహించి EV ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సర్టికల్ సమీక్షపై రిపోర్ట్‌ను సమర్పిస్తారు.’’ అని ఐఐటీ గాంధీనగర్ అధికారిక నోటీస్‌లో పేర్కొంది.
ఇన్స్టిట్యూట్ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం... పోటీ అనేక దశల్లో ఉంటుందని అర్థమవుతుంది. ప్రస్తుత ప్రకటన పోటీ మొదటి దశకు సంబంధించినది. పోటీ లక్ష్యాన్ని సాధించడంలో మొదటి దశలో విద్యార్థులు విస్తృతమైన విషయాలను సేకరించడం, సమస్యపై సమీక్షను చేపట్టనున్నారు. ప్రస్తుతం EV వాహనాల్లో చెలరేగుతున్న మంటలపై డాక్యుమెంట్ చేయనున్నారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న పరిశోధన, సాంకేతికతను విశ్లేషించి.. EV ఫైర్ సేఫ్టీకి సంబంధించిన క్లిష్టమైన సమీక్షను అందించనున్నారు. ఈ పోటీ రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తర్వాత మే 10, రిపోర్ట్, ప్రెజెంటేషన్ స్లయిడ్లను అప్లోడ్ చేయడానికి టీమ్ లీడర్లకు లింక్ పంపనున్నారు. మే 30లోపు రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, IIT