ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్(JEE Advance) పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 16 వరకు కొనసాగనుంది. ఈ దరఖాస్తుకు జేఈఈ మెయిన్స్‌లో మొదటి 2.5 లక్షల ర్యాంకుల్లో సీటు పొందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జీఈఈ అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కచ్చితంగా అక్టోబర్ 1, 1996 తర్వాత జన్మించి ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, దివ్యాంగులకు అక్టోబర్ 1, 1991 తర్వాత జన్మించి ఉండాలి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే వారు జేఈఈ మెయిన్‌లో 2,50,000 లోపు ర్యాంకు(Rank) పొంది ఉండాలి. దరఖాస్తుకు సంబంధిత డాక్యుమెంట్‌తోపాటు ఫీజు చెల్లించాలి.
దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లు..
జేఈఈ అడ్వాన్స్ 2021 దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు.
- బర్త్ సర్టిఫికెట్, పదో తరగతి మార్క్ మెమో
- ఇంటర్ లేదా 12వ తరగతి మార్కుల మెమో
- ఆధార్ కార్డు
- పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు
ISRO Recruitment 2021: ఇస్రోలో జూనియర్ రీసర్చ్ ఫెలో పోస్టులు.. జీతం రూ.47,000
దరఖాస్తుల స్వీకరణ ముగిసిన తర్వాత అక్టోబర్ 3న జేఈఈ అడ్వాన్స్ పరీక్షనిర్వహించనున్నారు. అభ్యర్థుల హాల్‌టికెట్‌లు, పరీక్ష కేంద్రం సమాచారం సెప్టెంబర్ 25 తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది.
విదేశాల్లో జేఈఈ పరీక్షా కేంద్రాలు లేవు..
JEE (అడ్వాన్స్‌డ్) 2021 పరీక్ష రాసేందుకు విదేశాల్లో చదివిన విద్యార్థులు 12 తరగతి లేదా సమాన స్థాయిలో చదివి ఉండాలి. వారు భారతీయ విద్యార్థులు రాసినట్టు ఐఐటీ జేఈఈ మెయిన్స్ రాయాల్సిన అవసరం లేదు. నేరుగా ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ రాయవచ్చు. ఈ పరీక్షకు ఐఐటీ జేఈఈ మెయిన్స్ పాసైన ఇండియన్ విద్యార్థులతో పాటు ఇప్పుడు దరఖాస్తు చేసుకొనే విదేశాల్లో చదివిన వారు అర్హులు. సాధారణంగా విదేశాల్లో రాసే వారికి పలు దేశాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం విదేశాల్లో పరీక్షా కేంద్రాలను ఎత్తివేశారు. ఎవరైన విదేశాల్లో చదవుకొన్న వారు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయాలనుకొంటే తమ సొంత ఖర్చులతో భారతదేశానికి వచ్చి పరీక్ష రాసి వెళ్లాల్సిందే అని పేర్కొన్నారు. సార్క్ (SAARC) దేశాలకు చెందిన విద్యార్థులు ఈ పరీక్ష రాయాలనుకుంటే 75 డాలర్ల ఫీజు చెల్లించాలి. ఇతర దేశస్తులకు 150 డాలర్ల ఫీజు చెల్లించాల్సిందిగా పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులకు ప్రతీ కోర్సులో 10శాతం సీట్లను కేటాయిస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న GEN-EWS, OBC-NCL, SC, ST రిజర్వేషన్‌లు కాక ఇవి విడిగా తీసుకొంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.