JEE Advanced: మరో రెండు రోజుల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష..ఈ టైమ్ ని అభ్యర్థులు ఎలా సద్వినియోగం చేసుకోవాలి?

ప్రతీకాత్మక చిత్రం

ఐఐటీలో ప్రవేశానికి నిర్వహించే జెఈఈ అడ్వాన్స్‌డ్ 2021 మరో రెండు రోజుల్లో జరగనుంది. ఈ పరీక్ష కోసం చాలా మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో మంచి స్కోర్‌ సాధిస్తే ఐఐటీలో సీటు వచ్చినట్టే.

  • Share this:
ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జెఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advacned) 2021 మరో రెండు రోజుల్లో జరగనుంది. ఈ పరీక్ష కోసం చాలా మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో మంచి స్కోర్‌ సాధిస్తే ఐఐటీలో సీటు వచ్చినట్టే. అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయనున్న విద్యార్థులు ముందు తమ టెన్షన్స్‌ అన్నీ పక్కన పెట్టాలి. ఒకవేళ వాళ్లు ఈ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించకపోయినా టాప్ ర్యాంకింగ్స్‌ ఎన్‌ఐటీల్లో చేరేందుకు అర్హులనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రెండు రోజులు కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపకుండా ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారో వాటిని మరోసారి రివిజన్ చేసుకోవడం మంచిది. ముఖ్యమైన కాన్సెప్ట్స్‌ అన్నీ మరోసారి రివైజ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇతర విషయాలు పక్కన పెట్టి ఎగ్జామ్‌కు సిద్ధం కావాలి.

* బేసిక్స్‌ రివైజ్‌ చేసుకోవాలి:
మూడు సబ్జెక్టులైన ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమ్యాటిక్స్‌లోని ముఖ్యమైన ఫార్మూలాలు, ముఖ్యమైన కాన్సెప్టులన్నీ ఇప్పుడు రివైజ్‌ చేసుకోవాలి. మీరు సొంతంగా రాసుకున్న నోట్స్‌ నుంచి రివైజ్‌ చేసుకుంటే సులభంగా గుర్తుంటుంది. ఇప్పుడు కొత్త చాప్టర్లు ఏవి చదవకండి.

* తప్పుల విశ్లేషణ:
ప్రిపరేషన్‌ టైమ్‌లో రాసిన మాక్‌ టెస్టులన్నీ విశ్లేషించుకోవాలి. వాటిల్లో కామన్‌గా చేసిన తప్పులేంటో ఒక ఐడియా వస్తుంది. పరీక్షలో ఆ తప్పులు చేయకుండా చూసుకోండి.

* మానసిక సన్నద్ధత
పరీక్ష వేళ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పరీక్ష రోజున మీరు మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉండాలి. గాబరా, టెన్షన్‌ లాంటివాటిని దూరం పెట్టేందుకు యోగా, ధ్యానం ప్రాక్టీస్‌ చేయండి.

* ముఖ్యమైన టాపిక్స్
మూడు సబ్జెక్టుల్లోని ముక్యమైన చాప్టర్స్‌/టాపిక్స్‌పై విద్యార్థులు దృషి పెట్టాలి. మ్యాథమెటిక్స్‌లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ & ఎక్స్‌ప్రెషన్స్‌, కాంప్లెక్స్ నెంబర్స్, ప్రాబలిలిటీ, వెక్టార్స్‌ & 3డి జామెట్రీ, మ్యాట్రిసెస్‌ ఇన్ ఆల్జీబ్రా, సర్కిల్‌, పారాబోలా, హైపర్‌బోలా ఇన్‌ కోఆర్డినేట్‌ జామిట్రీ, ఫంక్షన్స్, లిమిట్స్, కంటిన్యూటీ అండ్‌ డిఫరెన్షియబిలిటీ, అప్లికేషన్ ఆఫ్‌ డిరైవేటివ్స్, డెఫినైట్‌ ఇంటిగ్రల్‌ ఇన్‌ క్యాల్కూలస్‌ వంటి వాటిని రివైజ్ చేసుకోవాలి.

ఫిజిక్స్‌లో మెకానిక్స్, ఫ్లూయిడ్స్‌, హీట్‌ & థర్మోడైనమిక్స్, వేవ్స్ అండ్ సౌండ్‌, కెపాసిటర్స్ & ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మ్యాగ్నెటిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ ఇండక్షన్‌, ఆప్టిక్స్‌ అండ్‌ మోడ్రన్ ఫిజిక్స్ విభాగాలపై దృష్టి పెట్టాలి.

కెమిస్ట్రీలో క్వాలిటేటివ్‌ అనాలసిస్‌, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ & కెమికల్‌ బాండింగ్‌ ఇన్‌ ఇన్‌ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్‌ ఈక్విలిబ్రియం ఇన్‌ ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఆక్సిజన్‌ రిలేటెడ్‌ కాంపౌండ్స్‌ & ఆమైన్స్‌ ఇన్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అంశాలను మరోసారి చూసుకోవాలి.

* పేపర్‌ ఎలా అటెంప్ట్ చేయాలి
పరీక్ష పేపరును రెండు రౌండ్స్‌లో సాల్వ్ చేయాలి. మొదటి రౌండ్‌లో మీకు ఈజీగా ఉండే సబ్జెక్టు ఎంచుకోండి. అందులో సులభంగా ఉండేవి, కాస్త కఠినంగా ఉండే ప్రశ్నలు సాల్వ్ చేయండి. ప్రతీ సబ్జెక్టుపై 45 నిమిషాలకు మించి సమయం కేటాయించవచ్చు. చివిరి 45 నిమిషాలు మిగిలిన ప్రశ్నలను సెకండ్‌ అటెంప్ట్‌లో ప్రయత్నించండి. అలాగే రివ్యూ కోసం మార్క్ చేసిన వాటిని చెక్‌ చేయండి. జవాబు దొరకడం కష్టంగా ఉందని అనిపించినప్పుడు.. ప్రశ్నలకు నిమిషం కంటే ఎక్కువ సమయం వెచ్చించకండి. నెగిటివ్‌ మార్కులు లేని అన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
Published by:Sridhar Reddy
First published: