హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Robotics Training: పాఠశాల విద్యార్థులకు రోబోటిక్స్‌ ట్రైనింగ్‌.. ఐఐటీ ఢిల్లీ స్పెషల్ ప్రోగ్రామ్

Robotics Training: పాఠశాల విద్యార్థులకు రోబోటిక్స్‌ ట్రైనింగ్‌.. ఐఐటీ ఢిల్లీ స్పెషల్ ప్రోగ్రామ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Robotics Training: పాఠశాల స్థాయిలోనే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలను విద్యార్థులకు పరిచయం చేసే కార్యక్రమాలను ఢిల్లీ ప్రభుత్వం చేపడుతోంది. యంగ్‌ మైండ్స్‌ను సరైన దిశలో ప్రోత్సహించేందుకు తాజాగా ఒక స్పెషల్ ఈవెంట్‌లకు శ్రీకారం చుట్టింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పాఠశాల స్థాయిలోనే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలను విద్యార్థులకు పరిచయం చేసే కార్యక్రమాలను ఢిల్లీ ప్రభుత్వం చేపడుతోంది. యంగ్‌ మైండ్స్‌ను సరైన దిశలో ప్రోత్సహించేందుకు తాజాగా ఒక స్పెషల్ ఈవెంట్‌లకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోని వందకు పైగా పాఠశాలల విద్యార్థులకు రోబోటిక్స్‌పై రెండు నెలల శిక్షణ అందించనుంది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ. ఈ బాధ్యతను సంస్థకు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ IHFC(I-Hub Foundation for Cobotics) తీసుకుంది. ఈ హబ్ ఇటీవలే ఢిల్లీ రోబోటిక్స్ లీగ్(DRL)ను ప్రారంభించింది.

DRL-2023లో ఢిల్లీలోని అన్ని పాఠశాలలు, అన్ని బోర్డుల పరిధిలోని విద్యార్థులు పాల్గొనడానికి అర్హులు. ఈ లీగ్‌కు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 100కు పైగా పాఠశాలలు రిజిస్టర్‌ చేసుకున్నాయి. ఆసక్తి ఉన్న వాళ్లు 2023 జనవరి 26లోపు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

* విద్యార్థులకు ప్రయోజనం

DRLలో పాల్గొనే 9, 10వ తరగతికి చెందిన ఢిల్లీ పాఠశాల విద్యార్థులకు బూట్‌క్యాంప్‌ల ద్వారా రోబోట్ బిల్డింగ్ సబ్జెక్టులో IHFC శిక్షణ అందిస్తుంది. బూట్‌క్యాంప్‌లను IHFC నిర్వహిస్తోంది. దాని ఇంక్యుబేటెడ్ స్టార్టప్‌లు, రాంచో ల్యాబ్స్, ది ఇన్నోవేషన్ స్టోరీ సపోర్ట్‌ ఇస్తున్నాయి. ఇప్పటివరకు గత రెండు వారాలలో నిర్వహించిన 26 బూట్‌క్యాంప్‌ల నుంచి 800 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు.

* స్పెషల్ బూట్‌క్యాంప్‌లు

యంగ్‌ మైండ్స్‌ తమ స్కిల్స్‌ను ఉపయోగించి టీమ్స్‌గా రోబోలను తయారు చేసే లక్ష్యంతో బూట్‌క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. ఈ బూట్‌క్యాంప్‌లు విద్యార్థులకు రోబోటిక్స్ ప్రాథమిక విషయాలపై మాత్రమే కాకుండా రోజువారీ జీవితంలో రోబోలను ఎలా ఉపయోగించాలో కూడా శిక్షణ ఇస్తాయి. DRL 2023 కింద ఆడబోయే ‘రోబో-కంచ’ (చిన్నతనంలో ఆడుకునే ప్రముఖ ఆట కంచ)లో పాల్గొనడానికి వారిని సన్నద్ధం చేస్తాయి. IHFC భాగస్వామ్యంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కార్యక్రమాలను ప్రారంభించింది.

రోబో-కంచ గేమ్‌లో కంచ ఆట ఆడేందుకు సహకరించే మానవులు, రోబోల అందమైన సహజీవనాన్ని చూడవచ్చు. జులై మొదటి వారంలో ఫైనల్స్‌తో DRL ముగుస్తుంది. IHFC-IIT ఢిల్లీ నుంచి నగదు బహుమతులు, మెంటర్‌షిప్‌తో పాటు విద్యార్థుల యాజమాన్యంలోని స్టార్టప్‌ల కోసం ప్రీ-సీడ్ గ్రాంట్‌తో సహా విద్యార్థులకు అనేక బహుమతులు ఉన్నాయి.

* ప్రోత్సాహం అవసరం

ఐహెచ్‌ఎఫ్‌సి సీఈవో శ్రీ అశుతోష్ దత్ శర్మ మాట్లాడుతూ.. ఈ చిన్న పిల్లలకు రాబోయే టెక్నాలజీలను పరిచయం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమని చెప్పారు. కొత్త తరాన్ని అలాంటి నైపుణ్యాలతో నింపడం వల్ల దేశం అభివృద్దిలో కీలకం అవుతారని తెలిపారు. ఈ బూట్‌క్యాంప్‌లపై ప్రత్యేకించి విద్యార్థినుల్లో ఉన్న ఆసక్తి చూసి చాలా సంతోషపడ్డానని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : స్వయం అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్.. తప్పులను ఇలా సరిదిద్దుకోండి..

దీని గురించి IHFC ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ S.K. సాహా మాట్లాడుతూ.. ఢిల్లీ పాఠశాలల నుంచి బూట్‌క్యాంప్‌లకు వచ్చిన అఖండమైన స్పందన, అలాగే లీగ్‌పై విద్యార్థుల్లో ఏర్పడిన ఆసక్తిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ యంగ్‌ మైండ్స్‌ మన భవిష్యత్తు అని పేర్కొన్నారు. ఈ వయస్సులో వారి ఆలోచనలు, భావనలు, రోబో క్రియేషన్‌, భవిష్యత్తులో రోబో అవసరాల గురించి ఆలోచించేలా ప్రోత్సహించాలని చెప్పారు.

First published:

Tags: Career and Courses, Delhi, EDUCATION, IIT, JOBS, Robotics

ఉత్తమ కథలు