హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Delhi: ఐఐటీ ఢిల్లీలో కొత్త ఎంటెక్ కోర్సు.. ఏఐ, మెషిన్​ లెర్నింగ్​, డేటా సైన్స్​పై లోతైన అవగాహన

IIT Delhi: ఐఐటీ ఢిల్లీలో కొత్త ఎంటెక్ కోర్సు.. ఏఐ, మెషిన్​ లెర్నింగ్​, డేటా సైన్స్​పై లోతైన అవగాహన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ (IIT)- ఢిల్లీ సైతం కొత్త పోస్ట్​ గ్రాడ్యుయేట్​ కోర్సును(Graduate Course) ప్రకటించింది. స్కూల్​ ఆఫ్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్(ScAI) కింద మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్​ డేటా సైన్స్‌లో కొత్త ఎంటెక్​ కోర్సును ఆఫర్​ చేస్తోంది.

ఇంకా చదవండి ...

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఇండస్ట్రీ అవసరాలకు సరిపోయే కోర్సులపై(Courses) దృష్టి సారించాయి. తాజాగా ఇండియన్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ ఢిల్లీ (IIT-Delhi) సైతం కొత్త పోస్ట్​ గ్రాడ్యుయేట్​ కోర్సు(Course)ను ప్రకటించింది. స్కూల్​ ఆఫ్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్(ScAI) కింద మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్​ డేటా సైన్స్‌లో కొత్త ఎంటెక్​ కోర్సును ఆఫర్​ చేస్తోంది. ఈ కోర్సు(Course)ను వచ్చే ఏడాది జులై 2022 నుంచి అందించనుంది. ఐఐటీ ఢిల్లీ ఇటీవల ‘ఎంటెక్​ ఇన్ మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ (MINDS)’ పేరుతో ఓ కొత్త ప్రోగ్రామ్‌ను ఆమోదించింది. ఈ ప్రోగ్రామ్​కు అనుసంధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(Artificial intelligence)లో పీహెచ్‌డీ కోర్సును ఇప్పటికే ప్రారంభించింది. ఇప్పుడు, దీనికి అదనంగా పోస్ట్​ గ్రాడ్యుయేట్​ ప్రోగ్రామ్​ను ప్రకటించింది.

ఈ కొత్త ప్రోగ్రామ్​పై స్కూల్​ ఆఫ్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్(Artificial intelligence)​​ ప్రొఫెసర్ మౌసమ్ మాట్లాడుతూ “ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ కోర్సు ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉంది. ఈ కోర్సు నేర్చుచుకున్న వారికి ఐటీ రంగంలో అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అందుకే గతేడాది ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్​ను ప్రారంభించాం. ఈ ప్రోగ్రామ్​కు అనూహ్యమైన స్పందన లభించింది. ఇప్పుడు ఇదే తరహాలో పోస్ట్​ గ్రాడ్యుయేట్​ ప్రోగ్రామ్​ను ఆఫర్​ చేస్తున్నాం. ఏఐలో అపార అనుభవం ఉన్న అధ్యాపక బృందాన్ని ఏర్పాటు చేశాం.” అని చెప్పారు.

NIOS Registration: నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్​లో ఒకేషనల్​ కోర్సులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రముఖ ఐటీ సంస్థలతో అనుసంధానం..

మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, గూగుల్ ఏఐ, ఐబీఎం రీసెర్చ్ వంటి ఇండస్ట్రీ రీసెర్చ్​ సెంటర్లలో పనిచేస్తున్న 40 మంది అనుభవజ్ఞులను ఫ్యాకల్టీలుగా నియమించినట్లు ప్రొఫెసర్ మౌసమ్ తెలిపారు. ఈ కొత్త ఎంటెక్ ప్రోగ్రామ్​ ఇండస్ట్రీ ఓరియెంటెడ్ విధానంలో కొనసాగుతోంది. ఈ ప్రోగ్రామ్​లో ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్, స్పాన్సరింగ్ కంపెనీకి చెందిన ఒక రిసెర్చ్​ స్కాలర్​ హెడ్​గా పనిచేస్తారు. సైన్స్​, కంప్యూటర్ విభాగంలో బీఈ/బీటెక్​ పూర్తి చేసిన విద్యార్థులందరూ MINDS ప్రోగ్రామ్‌లో చేరేందుకు అర్హులు.

Job Offers: ఫ్రెష్​ గ్రాడ్యుయేట్లకు గుడ్​న్యూస్​.. ఈ ప్రోగ్రామ్​ల ద్వారా పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగ నియామకాలు

దీనిపై ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి రాంగోపాల్ రావు మాట్లాడుతూ ‘‘నూతన టెక్నాలజీని విద్యార్థులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఐఐటీ ఢిల్లీలో మైండ్స్​ ప్రోగ్రామ్​ను ఆవిష్కరించాం. ఎంటెక్ ఇన్​ ఏఐ​ కోర్సు నేర్చుకున్న వారికి అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కోర్సులో భాగంగా డేటా మైనింగ్ వంటి కోర్ ఏఐ టెక్నాలజీ, కంప్యూటర్ విజన్, నేచురల్​ లాంగ్వేజ్​ ప్రాసెసింగ్, హెల్త్​ కేర్ వంటి విభాగాలపై పట్టు సాధించవచ్చు.

First published:

Tags: Artificial intelligence, EDUCATION, IIT, New course

ఉత్తమ కథలు