IIT DELHI LAUNCHES STEM MENTORSHIP PROGRAMME FOR SCHOOLGIRLS GH VB
IIT Mentorship: స్కూల్ గర్ల్స్ కోసం STEM మెంటర్షిప్ ప్రోగ్రామ్.. తాజాగా ప్రారంభించిన ప్రముఖ విద్యాసంస్థ..
ప్రతీకాత్మక చిత్రం
ప్రభుత్వ పాఠశాలల్లో 11వ తరగతి చదివే విద్యార్థినులను సైన్స్‌ని కెరీర్‌గా ఎంచుకునేలా ప్రోత్సహించడానికి STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) మెంటర్షిప్ ప్రోగ్రామ్‌ను ఐఐటీ ఢిల్లీ లాంచ్ చేసింది. ఆ వివరాలు చూద్దాం.
ఈ రోజుల్లో చాలామంది విద్యార్థులు(Students) ఏ కెరీర్ ఎంపిక చేసుకోవాలో తేల్చుకోలేక తికమకపడుతున్నారు. ముఖ్యంగా స్కూల్ గర్ల్స్(Shcool Girls) సరైన అవగాహన లేక సైన్స్(Science) లాంటి మేటి సబ్జెక్టులను కెరీర్‌గా మలచుకోవడానికి సందేహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని సరైన మార్గంలో నడిపించేందుకు తాజాగా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్‌ను(Mentership Program) తీసుకొచ్చింది ఐఐటీ-ఢిల్లీ (IIT - Delhi). ప్రభుత్వ పాఠశాలల్లో 11వ తరగతి చదివే విద్యార్థినులను సైన్స్‌ని కెరీర్‌గా ఎంచుకునేలా ప్రోత్సహించడానికి STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) మెంటర్షిప్ ప్రోగ్రామ్‌ను ఐఐటీ ఢిల్లీ లాంచ్ చేసింది. విద్యార్థినులు సైన్స్, ఇన్నోవేషన్ గురించి సృజనాత్మకంగా ఆలోచించేందుకు, పరిశోధన సమస్యలను పరిష్కరించడంలో ప్రయోగాత్మక అనుభవం పొందేందుకు, బలమైన నాలెడ్జ్ ఫౌండేషన్‌ను ఏర్పరుచుకునేందుకు వారికి ఈ ప్రోగ్రాం ద్వారా ఐఐటీ శిక్షణ ఇవ్వనుంది.
11వ తరగతి విద్యార్థినులకు ఉద్దేశించిన ఈ ప్రోగ్రామ్ ద్వారా సైన్స్ స్ట్రీమ్‌కు చెందిన 10 మంది బాలికలను ఐఐటీ సంస్థ ఎంపిక చేస్తుంది. ఈ బాలికలు డిసెంబర్ 2021-జనవరి 2022 మధ్య రెండు వారాల వింటర్ ప్రాజెక్టుతో సహా మూడు లెవెల్ల ప్రోగ్రామ్‌కు హాజరవుతారు. పాఠశాలలు తమ స్కూల్ విద్యార్థినులను మెంటార్షిప్ ప్రోగ్రామ్‌కు నామినేట్ చేయడానికి అసోసియేట్ డీన్, అకడమిక్ ఔట్రీచ్ & న్యూ ఇనిషియేటివ్స్, ఐఐటీ ఢిల్లీ (e-mail- adoni@iitd.ac.in; acadoutreach@iitd.ac.in)ని సంప్రదించవచ్చు.
బాలికలకు యువ ప్రాయం నుంచే ప్రపంచాన్ని మార్చే సైన్స్ సబ్జెక్టులలో బలమైన పునాది వేయాలని ఐఐటీ ఢిల్లీ పూనుకుంది. ఈ క్రమంలోనే త్రీ-లెవెల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. తొలి బ్యాచ్‌లో ఢిల్లీ ప్రాంతంలోని వివిధ కేంద్రీయ విద్యాలయాల నుంచి పది మంది విద్యార్థులను ఎంపిక చేయడానికి ఢిల్లీ సిద్ధమైంది. భవిష్యత్తులో దేశంలోని ఇతర ప్రాంతాల్లోని విద్యార్థినుల కూడా ఎంపిక చేసే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు ఐఐటీ ఢిల్లీ తెలిపింది. ఈ ప్రోగ్రామ్‌లో ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటే..
1. రెండు వారాల వింటర్ ప్రాజెక్ట్. ఇది డిసెంబర్ 2021 చివరిలో ప్రారంభమై 2022 జనవరి ప్రారంభంలో ముగుస్తుంది.
2. ఆన్లైన్ లెక్చర్ సిరీస్. ఇందులో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథమెటిక్స్, కొన్ని ఇంజినీరింగ్ బ్రాంచ్‌లలో మాడ్యూల్స్ ఉంటాయి. ఈ లెక్చర్లను ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్లు ఫిబ్రవరి, ఏప్రిల్ 2022 మధ్య కాలంలో అందిస్తారు. విద్యార్థులు తమ ప్రాజెక్ట్‌లపై మెంటర్లతో నిరంతరం ఇంటరాక్ట్ అవుతారు.
3. సమ్మర్ ప్రాజెక్ట్. ఇది మే-జూన్ 2022లో 3-4 వారాలలో జరుగుతుంది. ఇక్కడ విద్యార్థినులు ల్యాబ్‌లలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. విద్యార్థినులు తమ సలహాదారులతో వారి ప్రాజెక్ట్ నివేదికలను ఫైనలైజ్ చేసుకుంటారు.
ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్‌లో ఐఐటీ ఢిల్లీ ఫ్యాకల్టీ సభ్యులు తమ రీసెర్చ్ స్కాలర్లతో కలిసి ప్రతి పాఠశాల విద్యార్థినికి మెంటర్‌గా ఉంటారు. మెంటర్షిప్ ట్రైనింగ్ సెషన్లో విద్యార్థినులు స్టెమ్ (STEM) విభాగాలలో ఫౌండేషన్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. సైన్స్ ల్యాబ్‌లలో ఉపయోగించే ప్రయోగాత్మక పద్ధతులు, టెక్నిక్స్ పై కూడా పట్టు సాధిస్తారు.
“ఈ ప్రోగ్రామ్ బాలికలకు భవిష్యత్తులో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లోకి రావడానికి సహకరిస్తుంది. విద్యార్థులు చిన్నవయసులోనే అకాడమిక్ కాన్సెప్టుల గురించి నేర్చుకోవాలని.. అకడమిక్ రీసెర్చ్‌ని మెచ్చుకోగలగాలని.. పెద్దయ్యాక సైన్స్ ను కెరీర్‌గా మలచుకునేలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని మేం భావిస్తున్నాం” అని అసోసియేట్ డీన్, అకడమిక్ ఔట్రీచ్ న్యూ ఇనిషియేటివ్స్, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ ప్రితా చంద్ర అన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.