హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Delhi : ఐఐటీ ఢిల్లీలో ఎన‌ర్జీ ఇంజ‌నీరింగ్ కోర్సు.. జేఈఈ స్కోర్ ఆధారంగా అడ్మిష‌న్‌

IIT Delhi : ఐఐటీ ఢిల్లీలో ఎన‌ర్జీ ఇంజ‌నీరింగ్ కోర్సు.. జేఈఈ స్కోర్ ఆధారంగా అడ్మిష‌న్‌

ఐఐటీ ఢిల్లీ

ఐఐటీ ఢిల్లీ

Energy Engineering : ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) కొత్త అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అదే బీటెక్‌లో ఎనర్జీ ఇంజనీరింగ్ కోర్సు. ఈఈ అడ్వాన్స్‌డ్ 2021 (JEE Advanced 2021) కి అర్హత సాధించిన విద్యార్థులు ఈ కోర్సుకు అర్హులు.

ఇంకా చదవండి ...

ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) కొత్త అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అదే బీటెక్‌లో ఎనర్జీ ఇంజనీరింగ్ కోర్సు. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 (JEE Advanced 2021) కి అర్హత సాధించిన విద్యార్థులు, IIT ఢిల్లీలో ఈ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులుగాపేర్కొంది. ఇనిస్టిట్యూట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (Institute’s Department of Energy Science and Engineering) 2021-2022 అకడమిక్ సెషన్ నుంచి 40 మంది విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఐఐటి ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం (డిఇఎస్‌ఇ) హెడ్ ప్రొఫెసర్ కెఎ సుబ్రహ్మణ్యం ఈ విష‌యంపై మాట్లాడారు. ఐఐటీ ఢిల్లీలో ఎనర్జీ ఇంజనీరింగ్‌లో బీటెక్ ప్రోగ్రామ్ విద్యార్థులకు శక్తివంతమైన రంగానికి సంబంధించిన అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలను సన్నద్ధం చేయడానికి ఈ కోర్సు రూపొందించ‌మ‌ని అన్నారు.

ఈ విభాగం ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌లో ఎంతో శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒక‌టి అని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుతం ఈ విభాగంలో మంచి ప్లేస్‌మెంట్ (Placement) అవ‌కాశాలు ఉన్నాయని ఆయ‌న పేర్కొన్నారు. ఎందో ముందు చూపుతో దేశ అవ‌స‌రాల‌తోపాటు విద్యార్థులు నైపుణ్యం (Skills), ఉపాధి మార్గం క‌ల్పించ‌డంలో ఈ కోర్సు రూపిందించామిన సుబ్ర‌హ్మ‌ణ్యన్ తెలిపారు.

IndiGo Airlines: ఫ్రెష‌ర్స్‌కి శుభ‌వార్త‌.. ఇండిగో ఎయిర్​లైన్స్‌లో ట్రైనీ ఉద్యోగాలు


ఐఐటి ఢిల్లీ (IIT Delhi) డైరెక్టర్ ప్రొఫెసర్ వి రాంగోపాల్ రావు మాట్లాడుతూ.. ఆర్థికాభివృద్ధి, పర్యావరణ స్థిరత్వంపై గణనీయమైన ప్రభావాలను కలిగి ఉన్నందున ఈ రంగం చాలా కీల‌కం అన్నార‌ను. అందువల్ల, ఇంధన రంగంలో విద్యార్థుల‌కు మంచి అనేక అవకాశాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

NEET 2021: త్వ‌ర‌లో నీట్ కౌన్సెలింగ్‌.. దేశంలోని టాప్ మెడిక‌ల్ కాలేజీలు ఇవే..


ఇంధన రంగంలో వృత్తిని చేపట్టడానికి మక్కువ ఉన్న విద్యార్థులు, IIT ఢిల్లీ ద్వారా అందిస్తామ‌న్నారు. BTech in Energy ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లో చేరడానికి విద్యార్థులు ఆస‌క్తిగా ఉన్నార‌న్నారు. విద్యార్థులకు నాణ్య‌మైన కోర్సు అందించేందుకు ఇన్స్టిట్యూట్ (Institute) బలమైన విద్యా విభాగం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

విద్యార్థుల కెరీర్ (Career) అవకాశాల పరంగా ఇది మంచి కోర్సుగా ఇన్‌స్టిట్యూట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇంధన రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), మొదలైనవి కాకుండా, అభ్యర్థులు ఎంగేర్జీ రంగంలో ఉన్నత చదువులను ఎంచుకుంటారని ఇనిస్టిట్యూట్ తెలిపింది. ఈ కోర్సులో చేరేందుకు జేఈఈ స్కోర్‌ను ఆధారంగా ఎంపిక చేయ‌నున్నారు.

First published:

Tags: EDUCATION, Engineering, Engineering course, IIT, New course

ఉత్తమ కథలు