IIT Delhi : టెక్స్‌టైల్ రంగంలో మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు.. ఐఐటీ ఢిల్లీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు

ఐఐటీ ఢిల్లీ

IIT Delhi : ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology)లో ఉన్న తన స్మార్ట్ మెటీరియల్స్ అండ్ ఇన్నోవేటివ్ టెక్స్‌టైల్ అప్లికేషన్స్ (Smart Materials and Innovative Textile Applications) రీసెర్చ్ ల్యాబ్‌ను స్మార్ట్ టెక్స్‌టైల్స్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (Centre of Excellence) గా మార్చింది.

  • Share this:
    ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology)లో ఉన్న తన స్మార్ట్ మెటీరియల్స్ అండ్ ఇన్నోవేటివ్ టెక్స్‌టైల్ అప్లికేషన్స్ (Smart Materials and Innovative Textile Applications) రీసెర్చ్ ల్యాబ్‌ను స్మార్ట్ టెక్స్‌టైల్స్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (Centre of Excellence) గా మార్చింది. ఈ రీసెర్చ్ కేంద్రం అభివృద్ధి చెందుతున్న పదార్థాలు, ప్రాసెస్ టెక్నాలజీ (Process Technology) లను ఉపయోగించి స్మార్ట్ అండ్ ఫంక్షనల్ టెక్స్‌టైల్స్ రంగంలో ప‌రిశోధ‌న‌లు చేస్తుంది. సీఓఈ (CoE) నానో ఇంజనీరింగ్ మెటీరియల్స్, ధరించగలిగిన వస్త్రాల అభివృద్ధి, హెల్త్‌కేర్ అప్లికేషన్‌ల కోసం ఫంక్షనల్ టెక్స్‌టైల్స్ అని పిలువబడే హై-పెర్ఫార్మెన్స్ (High-performance textile టెక్స్‌టైల్ మెటీరియల్స్ అభివృద్ధిలో ప‌ని చేస్తుంది.

    కొత్త అంశాల‌పై ప‌రిశోధ‌న‌లు..
    ఐఐటి ఢిల్లీలోని టెక్స్‌టైల్ అండ్ ఫైబర్ ఇంజనీరింగ్ (Fiber Engineering) విభాగంలో ప్రొఫెసర్ మరియు కోఇ కోఆర్డినేటర్ డాక్టర్ అశ్విని అగర్వాల్ ఈ విష‌యంపై మాట్లాడారు. స్మార్ట్ టెక్స్‌టైల్స్ అండ్ ధరించగలిగే ఎలక్ట్రానిక్స్ (Electronics) అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇది వృద్ధుల సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్‌లు మరియు క్రీడలలో అపూర్వమైన మార్పులను తెస్తుందని అంచనా వేస్తున్నాం.

    Railway Recruitment 2021 : రైల్వేలో 782 ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక.. ద‌ర‌ఖాస్తుకు వారం రోజులే అవ‌కాశం


     ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) ద్వారా స్మార్ట్ మరియు టెక్నికల్ టెక్స్‌టైల్స్  రంగంలో చేపట్టిన ప‌ని అభివృద్ధికి కేంద్రం సాయం చేస్తుంద‌ని అన్నారు. అంతే కాకుండా ఇత‌ర సంస్థ‌ల నుంచి ఇత‌ర విభాగాల నుంచి అధ్యాప‌కుల‌ను ప్రోత్స‌హిస్తామ‌న్నారు. స్మార్ట్ టెక్స్‌టైల్‌పై ఆస‌క్తిని అన్వేషిండానికి ప్రోత్స‌హిస్తామ‌ని ఆయ‌న అన్నారు.

    సాంకేతిక ఆవ‌శ్య‌క‌త ఉంది..
    దేశంలో టెక్స్‌టైల్ అత్య‌ధికంగా ప్ర‌ధాన‌మైన రంగం. వ్య‌వ‌సాయం త‌రువాత ఎక్కువ‌మంది ఉపాధి పొందుతున్న రంగం టెక్స్‌టైల్ రంగం. ఈ రంగంలో ప‌రిశోధ‌న‌లు ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి దోహ‌దం చేస్తాయి. ఈ రంగంలో ప్ర‌స్తుతం గ‌ట్టిపోటీ నెల‌కొంది. ఈరంగంలో మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఐఐటీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెక్నికల్ టెక్స్‌టైల్స్ (Technical Textile), హెల్త్‌కేర్ నుంచి ఏరోస్పేస్ వరకు అన్ని రంగాల్లో విస్తృతంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయని అన్నారు.

    ఢిల్లీ ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ వి రాంగోపాల్ రావు ఈ రీసెర్చ్ (Research) విభాగంపై మాట్లాడారు. ఐఐటి ఢిల్లీ టెక్నికల్ టెక్స్‌టైల్ డొమైన్‌లో చేయగల ప్రభావాన్ని మరింత మెరుగుపరచడంతోపాటు ఈ రంగంలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి "ఐఐటి ఢిల్లీ తన" స్మార్ట్ మెటీరియల్స్ అండ్ ఇన్నోవేటివ్ టెక్స్‌టైల్ అప్లికేషన్స్ (SMITA) రీసెర్చ్ ల్యాబ్ "ను స్మార్ట్ టెక్స్‌టైల్స్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కోఇ) గా మార్చామ‌న్నారు. . భవిష్యత్ స్మార్ట్ టెక్స్‌టైల్స్‌ (Smart Textile)ను అభివృద్ధి చేయడానికి కోఇని సృష్టించడం వివిధ విభాగాల పరిశోధకులను ఒకచోట చేర్చింద‌న్నారు.
    Published by:Sharath Chandra
    First published: