IIT Bombay: స్కూల్ స్టూడెంట్స్ కోసం ఐఐటీ బాంబే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒలింపియాడ్.. విన్నర్‌కి రూ.1.5 లక్షలు గిప్ట్ ప్రైజ్

(ప్రతీకాత్మక చిత్రం)

6 నుంచి 12 తరగతుల పాఠశాల విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ స్కిల్స్‌ (skills) ప్రోత్సహించడానికి ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒలింపియాడ్ (Entrepreneurship Olympiad)’ పోటీలను IIT Bombay నిర్వహించనుంది.

  • Share this:
స్కూల్ స్టూడెంట్స్ (school students) కోసం సరికొత్త ప్రోగ్రాంను ప్రారంభించింది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బాంబే (IIT Bombay). ఎడ్-టెక్ ప్లాట్‌ఫాం ‘ప్రాక్టికల్లీ’తో (Practically) కలిసి ఈ సంస్థ ‘యురేకా! జూనియర్’ (Eureka! Junior) ఐదవ ఎడిషన్‌ పోటీలకు (competition) రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 6 నుంచి 12 తరగతుల పాఠశాల విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ స్కిల్స్‌ (skills) ప్రోత్సహించడానికి ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒలింపియాడ్ (Entrepreneurship Olympiad)’ పోటీలను నిర్వహించనుంది. ఒలింపియాడ్‌లో నమోదు చేసుకోవడానికి అక్టోబర్ 25 చివరి తేదీ. అక్టోబర్ 31న నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒలింపియాడ్‌ను ప్రాక్టికల్లీ టెస్ట్ ప్లాట్‌ఫామ్‌లో నిర్వహించనున్నారు.

మూడు ట్రాక్‌లుగా పరీక్ష..

ఆసక్తిగల అభ్యర్థులు (candidates) యురేకా జూనియర్ (Eureka! Junior) వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని, ప్రాక్టికల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఐఐటీ బాంబే (IIT Bombay) కోరింది. ఫైనల్ ఒలింపియాడ్ పరీక్షను మూడు ట్రాక్‌లుగా (three tracks) విభజించారు. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు.. 9, 10 తరగతులకు.. 11, 12 తరగతులకు ప్రత్యేకంగా ఎగ్జామ్ (special exam) ఉంటుంది. ప్రాక్టికల్లీ యాప్ (practically app) ద్వారా ప్రాక్టీస్ టెస్ట్ కూడా యాక్సెస్ (access) చేసుకోవచ్చు.

రూ.1.5 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌..

ఈ ఒలింపియాడ్‌ (Olympiad) లోని మూడు ట్రాక్‌లలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విజేతలకు.. ప్రాక్టికల్లీ సంస్థ దాదాపు రూ.1.5 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌ల (Practically scholarships)ను అందించనుంది. దీంతోపాటు విజేతలు IIT బాంబేకు చెందిన E-సెల్ నుంచి రూ.15,000 నగదు బహుమతి (prize money) కూడా పొందవచ్చు. ఈ ట్రాక్‌లలో టాప్- 24లో నిలిచిన వారు ప్రాక్టికల్లీ సబ్‌స్క్రిప్షన్‌ (subscription)లపై 50 శాతం డిస్కౌంట్ వోచర్‌ (discount vouchers)లను కూడా గెలుచుకోవచ్చు. ఒలింపియాడ్‌లో పాల్గొనే వారందరికీ ఐఐటీ బాంబే (IIT bombay) ఈ-సెల్ సర్టిఫికెట్‌ (E-cell certificate)లను అందజేస్తుంది.

ఆవిష్కరణలకు ప్రేరణ : ప్రతీక్ చౌహాన్

ఐఐటీ బాంబే ఈ-సెల్ ఈవెంట్స్ అండ్ పీఆర్ హెడ్ ప్రతీక్ చౌహాన్ మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ( Entrepreneurship)పై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో వారి ఆవిష్కరణలకు ప్రేరణ కలుగుతుందన్నారు . ఆసక్తిగల అభ్యర్థులు యూరేకా జూనియర్ (Eureka! Junior) వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు అందించి ఈ పోటీ (competition)ల్లో పాల్గొనవచ్చని ప్రతీక్ చౌహాన్ సూచించారు. ‘యురేకా! జూనియర్ ( Eureka! Junior)’ అనేది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్, సృజనాత్మక ఆలోచనలను (Creative thinking) మెరుగుపరిచే వేదిక. ఈ పోటీల్లో భాగంగా.. విద్యార్థుల్లో (in students) సృజనాత్మకతను పెంపొందించాలనే లక్ష్యంతో వెయ్యి పాఠశాలల నుంచి పదివేల మందికి పైగా విద్యార్థుల (students)తో వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంటారు.

read this also: సొంత సోషల్ మీడియా సైట్‌ను ప్రారంభించనున్న ట్రంప్.. దాని పేరు ఏంటంటే..
Published by:Prabhakar Vaddi
First published: