హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Startups: స్టార్టప్స్ కోసం ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్.. సంయుక్తంగా నిర్వహించనున్న ఐఐటీ బాంబే, మారుతి సుజుకి

Startups: స్టార్టప్స్ కోసం ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్.. సంయుక్తంగా నిర్వహించనున్న ఐఐటీ బాంబే, మారుతి సుజుకి

Startups: స్టార్టప్స్ కోసం ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్.. సంయుక్తంగా నిర్వహించనున్న ఐఐటీ బాంబే, మారుతి సుజుకి

Startups: స్టార్టప్స్ కోసం ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్.. సంయుక్తంగా నిర్వహించనున్న ఐఐటీ బాంబే, మారుతి సుజుకి

స్టార్టప్‌లతో ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లను నిర్వహించడానికి ఐఐటీ బాంబే (IIT Bombay)తో మారుతి సుజుకి (Maruti Suzuki) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని మారుతి సుజుకి ఇండియా గురువారం వెల్లడించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

భారత్‌లో ఇప్పుడు స్టార్టప్‌ల ట్రెండ్‌(Trend) నడుస్తోంది. ప్రభుత్వంతో పాటు ఇంక్యుబేషన్‌ సెంటర్లు, పెద్ద కంపెనీలు పెట్టుబడులతో వీటిని ప్రోత్సహిస్తున్నాయి. ఫలితంగానే ఈ మధ్య కాలంలో మేడిన్‌ ఇండియా ప్రొడక్ట్స్ ఎక్కువగా మార్కెట్‌లో చూస్తున్నాం. స్టార్టప్‌ల(Startups) నుంచి వచ్చే మంచి ఐడియాలు కార్యరూపం దాల్చి అవి పెద్ద కంపెనీలుగా ఎదగడానికి ఇప్పుడు భారత్‌లో చాలా సంస్థలు ఆర్థికంగా(Funding)నూ సహకరిస్తున్నాయి. సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నాయి. ఇందులో భాగంగా స్టార్టప్‌లతో ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లను నిర్వహించడానికి ఐఐటీ బాంబే (IIT Bombay)తో మారుతి సుజుకి (Maruti Suzuki) ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ విషయాన్ని మారుతి సుజుకి ఇండియా గురువారం వెల్లడించింది. స్టార్టప్‌లతో తమ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. బాంబే ఐఐటీకి సంబంధించిన సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్(SINE)తో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. భారత్‌ను గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా మార్చడానికి ఈ టయప్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ హిసాషి టేకుచి.

* కొత్త సొల్యూషన్స్ కోసం ఒప్పందం

ఇప్పుడు మార్కెట్‌ మరింత అభివృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి, కొత్త స్టార్టప్‌లకు అనేక అవకాశాలను తెచ్చి పెడుతోందన్నారు SINE సీఈఓ పోయిని భట్. ‘40 సంవత్సరాల క్రితం మారుతి సుజుకి, మారుతి 800 అనే చిన్న కారుతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇప్పుడు ఇది ఆటోమోటివ్ పరిశ్రమ ల్యాండ్‌స్కేప్‌ను మార్చివేసింది. మారుతి సుజుకితో భాగస్వామిగా ఉండటానికి మేము సంతోషిస్తున్నాం. మా కలయికతో స్టార్టప్‌లకు మరింత ఇన్నోవేటివ్‌ సొల్యుషన్లు చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం.’ అని భట్ పేర్కొన్నారు.

Job Opportunity: వచ్చే ఏడాది లక్ష ఉద్యోగాలు.. వార్షిక ప్యాకేజీ రూ.10లక్షలకు పైగా..

ఈ మూడు సంవత్సరాల ఎంఓయూ (MOU) ఫలితంగా స్టార్టప్‌ ఇనోవేషన్‌ ప్రోగ్రాం కోసం మారుతి సుజుకి, SINE విభాగాలు కలిసి పనిచేస్తాయి. వచ్చిన అప్లికేషన్లను ముందు పరిశీలించి వడపోసి, షార్ట్‌ లిస్ట్‌ అయిన వాటిలో మంచి స్టార్టప్‌లకు SINE సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రాథమిక దశలో స్టార్టప్‌లకు ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా, మేనేజ్‌ చేయడంలో, ప్రణాళికలను పక్కాగా అమలు చేయడంలో అవి ఇబ్బందులను ఎదుర్కొంటాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడి మార్కెట్లోకి రావడానికి వాటికి సలహాలు, సపోర్ట్‌ ఎంతో అవసరం. అలా వాటికి కావాల్సిన సపోర్ట్‌ అంతటినీ SINE ఇస్తుంది. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లు, ఇన్వెస్టర్లు, మెంటర్లతో వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేస్తుంది. సమస్యలకు కచ్చితమైన సొల్యుషన్స్‌ చూపుతుంది. ఈ ఒప్పందం వల్ల మారుతి సుజుకి ఇన్నోవేషన్‌ ప్రోగ్రాంలోకి వచ్చే స్టార్టప్‌లకు ఎంతో మేలు చేకూరనుంది.

First published:

Tags: Career and Courses, Degree students, JOBS

ఉత్తమ కథలు