హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Bombay: నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. నైపుణ్యాల కల్పనకు కోర్సులను ప్రారంభించిన ఐఐటీ బాంబే

IIT Bombay: నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. నైపుణ్యాల కల్పనకు కోర్సులను ప్రారంభించిన ఐఐటీ బాంబే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

తాజాగా ఐఐటీ బాంబే రెండు సరికొత్త సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్స్ ను ప్రారంభించింది. ఎడ్ టెక్ ప్లాట్‌ఫాం (Edtech platform) కోర్స్ ఎరా(Coursera) భాగస్వామ్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.

బీటెక్ (B.Tech) కంప్లీట్ అయినా నైపుణ్యాల కొరత వల్ల సరైన ఉద్యోగం (Job) దొరక్క చాలా మంది అవస్థలు పడుతున్నారు. దీని వల్ల ఇటు నిరుద్యోగులతో పాటు సంస్థల (Companies)కు కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ లోటును పూడ్చడానికి నైపుణ్యాల (skills) కల్పన తప్పనిసరైంది. ఇందుకోసం చాలా మంది సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్స్ (certificate programs) నేర్చుకుంటున్నారు. తాజాగా ఐఐటీ బాంబే రెండు సరికొత్త సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్స్ ను ప్రారంభించింది. ఎడ్ టెక్ ప్లాట్‌ఫాం (Edtech platform) కోర్స్ ఎరా(Coursera) భాగస్వామ్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మోటార్స్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVs) విభాగాల్లో సంస్థ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్స్ ప్రారంభించింది.

నవంబరు 20 నుంచి తరగతులు..

ఈ ప్రోగ్రామ్స్ అభ్యర్థులకు టెక్నికల్ (technical), మేనేజీరియల్, లీడర్షిప్ స్కిల్స్ (leadership skills) పెంపొందించడంలో సహాయపడతాయి. ఆసక్తికలిగిన అభ్యర్థులు 2021 నవంబరు 19లోపు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. నవంబరు 20 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. నాలుగు నెలలపాటు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్టిఫికేషన్ కోర్సు కొనసాగుతుంది. ఐటీయేతర మేనేజర్ల కోసం లీడింగ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఇనిషియేటీవ్స్ (Leading transformation initiative)   తో రూపొందించిన లైవ్ లెక్చర్లు (live lectures) ఇస్తారు. నూతన సాంకేతికతలను వ్యూహాత్మకంగా అమలు చేయడం ద్వారా సంస్థ (company)ను మార్చే అవకాశాలను ఎలా గుర్తించాలో ఈ కోర్సులో నేర్పిస్తారు. సరైన పరిష్కారాలను, వాటిని అర్థం చేసుకోవడానికి విశ్లేషణాత్మక నైపుణ్యాలను అందిస్తారు.

మోటార్ డిజైన్, పవర్ కన్వర్టర్ డిజైన్, మోటార్ డ్రైవ్..

ఐఐటీ బాంబే (IIT Bombay)లోని శైలేష్ జే మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కు చెందిన ప్రొఫెసర్ రాజేంద్ర సోనార్ ఈ ప్రోగ్రాంను బోధిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విజిటింగ్ ఫ్యాకల్టీగా సీనియర్ ఇండస్ట్రీ లీడర్ సుహృద్ బ్రహ్మ పాల్గొంటారు. పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మోటార్స్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సర్టిఫికెట్‌ కోర్సు నాలుగున్నర నెలల పాటు కొనసాగుతుంది. ఇందులో మోటార్ డిజైన్ (motor Design), పవర్ కన్వర్టర్ డిజైన్, మోటార్ డ్రైవ్ (Motor drive)లో కోర్సులను కవర్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ను ఐఐటీ బాంబేలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ బీజీ ఫెర్నాండేజ్, డాక్టర్ కిషోర్ ఛటర్జీ, డాక్టర్ సందీప్ ఆనంద్ బోధిస్తారు.

ఎలక్ట్రిక్ వెహికల్ విక్రయాలు పెరుగుతాయంటూ..

ఐఈఏ గ్లోబల్ ఈవీ ఔట్ లుక్ నివేదిక ప్రకారం 2030 నాటికి భారత్ లో అన్ని మోడ్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్ విక్రయాల వాటా 30 శాతం పెరుగుతుందని ఐఐటీ బాంబే కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ఇంఛార్జి (Education program IN charge) ప్రొఫెసర్ సిద్ధార్థ ఘోష్ అన్నారు. కోర్స్ ఎరాలోని సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్ ఇన్- డిమాండ్ ఫీల్డ్ లో కెరీర్ ను నిర్మించడానికి ఇష్టపడేవారికి అవసరమైన నైపుణ్యాలను అందిస్తుందని స్పష్టం చేశారు.

First published:

Tags: Engineering course, IIT Bombay, JOBS, Latest news, New course

ఉత్తమ కథలు