Home /News /jobs /

IISC BANGALORE SPECIAL PROGRAM RESEARCH FELLOWSHIP IN MATERIAL ENGINEERING FOR MTECH STUDENTS GH VB

Fellowship: IISc బెంగళూరు స్పెషల్ ప్రోగ్రామ్‌.. MTech విద్యార్థులకు మెటీరియల్ ఇంజనీరింగ్‌లో రీసెర్చ్ ఫెలోషిప్..

 IISc బెంగళూరు స్పెషల్ ప్రోగ్రామ్‌.. MTech విద్యార్థులకు మెటీరియల్ ఇంజనీరింగ్‌లో రీసెర్చ్ ఫెలోషిప్..

IISc బెంగళూరు స్పెషల్ ప్రోగ్రామ్‌.. MTech విద్యార్థులకు మెటీరియల్ ఇంజనీరింగ్‌లో రీసెర్చ్ ఫెలోషిప్..

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు మరో కొత్త ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. సంస్థ పరిధిలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CeNSE) విభాగం.. 2022-23 విద్యా సంవత్సరం నుంచి రెండో సంవత్సరం మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (MTech) విద్యార్థులకు స్పాన్సర్డ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది.

ఇంకా చదవండి ...
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు మరో కొత్త ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. సంస్థ పరిధిలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CeNSE) విభాగం.. 2022-23 విద్యా సంవత్సరం నుంచి రెండో సంవత్సరం మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (MTech) విద్యార్థులకు స్పాన్సర్డ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. దేశంలో అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ పరిశ్రమకు మద్దతుగా టాలెంట్ పూల్‌ను విస్తరించడం, ఇందుకు సహాయపడటం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్... జూన్‌లో బ్యాంకులు ఈ రోజుల్లో తెరుచుకోవు

అప్లైడ్ మెటీరియల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో IISc బెంగళూరు ఈ ఫెలోషిప్ అందిస్తోంది. సంప్రదాయ ఇంజనీరింగ్, సైన్స్ విభాగాలకు చెందిన విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ టెక్నాలజీలో నైపుణ్యాలపై అవగాహన కల్పించడం, అవకాశాలను అందించడం వంటి లక్ష్యాలతో ఈ స్పెషల్ ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేశారు.

CeNSE మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌ల నుంచి ఇద్దరు రెండో సంవత్సరం మాస్టర్స్ విద్యార్థులు రెండేళ్ల ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు అర్హులు. మెటీరియల్స్ ఇంజనీరింగ్‌పై పరిశోధన చేయడానికి అవకాశాలతో పాటు, ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారు అప్లైడ్ మెటీరియల్స్ ఇండియాలో ఇంటర్న్‌షిప్‌లకు అర్హుత పొందుతారు.

ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడారు అప్లైడ్ మెటీరియల్స్ ఇండియా కంట్రీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సత్య. ఆయన మాట్లాడుతూ ‘CeNSE నుంచి విద్యార్థులకు MTech ఫెలోషిప్‌ను అందించడం అనేది మంచి విషయం. ప్రోగ్రామ్ ద్వారా నానోసైన్స్, ఇంజనీరింగ్‌లో విద్యార్థులు తమ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో పొందిన పునాదిని కొత్తగా నిర్మించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. MTech పాఠ్యాంశాలను రూపొందించడానికి, సెక్స్ట్ జనరేషన్ ఇన్నొవేటర్స్‌ను ప్రేరేపించడానికి CeNSE ఫ్యాకల్టీతో సహకరించడానికి మేము ఎదురుచూస్తున్నాం’ అని చెప్పారు.

“మెకానికల్, ఎలక్ట్రికల్, మెటీరియల్స్, కెమికల్ ఇంజినీరింగ్, ఫిజికల్, కెమికల్ సైన్సెస్ రంగాలలో సహకారం కోసం మేము ఎదురుచూస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ విద్యార్థులను ఉన్నత శిక్షణ పొందిన టెక్-ప్రొఫెషనల్స్‌తో కలుపుతుంది. వారిని పరిశ్రమకు సిద్ధం చేస్తుంది” అని తెలిపారు CeNSE విభాగానికి చెందిన IISc ప్రొఫెసర్ శ్రీనివాసన్ రాఘవన్.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్ తన లక్ష్యాలను సాధిస్తున్నారా..?యుద్ధం ముగినట్లేనా..?


ఈ రిలేషన్‌షిప్ ప్రభావంపై మాట్లాడారు అప్లైడ్ మెటీరియల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, CTO సూరజ్ రంగరాజన్. ‘AI కంప్యూటింగ్ రంగానికి సపోర్ట్ ఇవ్వడానికి అత్యంత నైపుణ్యం కలిగిన టెక్ వర్కర్ల అవసరం పెరిగింది. ఈ సహకారం ద్వారా ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌కు ప్రధాన ప్రోత్సాహాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఫెలోషిప్ ద్వారా విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యాలను పొందవచ్చు. ఇది అద్భుతమైన కెరీర్ అవకాశాలను అందజేస్తుంది’ అని చెప్పారు.
Published by:Veera Babu
First published:

Tags: Bangalore, Career and Courses, Fellowship, Iisc bangalore, Material engineering

తదుపరి వార్తలు