IISc Bangalore: ఐఐఎస్సీ బెంగళూరు బంపరాఫర్.. IOTపై ఉచిత ఆన్లైన్ కోర్సు
ప్రతీకాత్మకచిత్రం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) బెంగళూరు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT) ఉచిత కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సు నేర్చుకోవాలనుకునే విద్యార్థులు, నిరుద్యోగులు.. ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫాం NPTEL అధికారిక వెబ్సైట్లో ఆగస్టు 2లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఆన్లైన్ కోర్సు జూలై 26 నుంచి ప్రారంభమవుతుంది.
కరోనా ప్రభావం దాదాపు అన్ని పరిశ్రమలపై పడింది. అయితే ఐటీ పరిశ్రమ మాత్రం కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వేగంగా దూసుకుపోతుంది. దీంతో ఈ రంగంలో ఉద్యోగాల కల్పన పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ఉచిత ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులను ఐటీ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) బెంగళూరు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT) ఉచిత కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సు నేర్చుకోవాలనుకునే విద్యార్థులు, నిరుద్యోగులు.. ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫాం NPTEL అధికారిక వెబ్సైట్లో ఆగస్టు 2లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఆన్లైన్ కోర్సు జూలై 26 నుంచి ప్రారంభమవుతుంది.
కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ పొందాలంటే, అభ్యర్థులు ఐఐఎం రోహ్తక్ నిర్వహించే ఫిజికల్, ప్రోక్టర్డ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్‌ను సెప్టెంబర్ 26న నిర్వహిస్తారు. ఇది మొత్తం రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతుంది. మరో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ఈ కోర్సు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని ఐఐఎస్సీ బెంగళూరు తెలిపింది.
జులై 26 నుంచి కోర్సు ప్రారంభం..
మొత్తం ఎనిమిది వారాల వ్యవధి గల ఈ కోర్సు పూర్తయ్యే నాటికి.. విద్యార్థులు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ప్రోటోకాల్స్‌పై పట్టు సాధిస్తారు. ఈ కోర్సు పాఠ్యాంశాల్లో భాగంగా ఐఓటి బేసిక్స్, దాని అప్లికేషన్, ఛాలెంజెస్, ఆర్ఎఫ్ఐడి, ఎనర్జీ హార్వెస్టింగ్, బ్యాటరీ బేస్డ్ సిస్టమ్స్, పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, పవర్ ఛాలెంజ్‌ను పరిష్కరించడం, ఎల్డిఓ, డిసి- టు- డిసి కన్వర్టర్లు, లో పవర్ సాఫ్ట్వేర్, సెన్సార్లు, యాక్యుయేటర్లు, ఐఒటి ప్రోటోకాల్స్, లో పవర్ వైర్లెస్ టెక్నాలజీ.. వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటారు. ఈ కోర్సు సర్టిఫికేట్ పొందడానికి మొత్తం ఎనిమిది అసైన్మెంట్లలో కనీసం ఆరు అసైన్మెంట్లకు సగటున 25 శాతం స్కోర్ పొందాలి. దీంతో పాటు ప్రొక్టోర్డ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్‌లో 75 శాతం స్కోర్ చేయవలసి ఉంటుంది. ఫైనల్ స్కోర్‌ను యావరేస్ అసైన్మెంట్ స్కోరు, ఎగ్జామ్ స్కోరు ఆధారంగా లెక్కిస్తారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే ఈ–సర్టిఫికేషన్ అందజేస్తారు. ఇది మీ ఉద్యోగ వేటలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.