Home /News /jobs /

IISC BANGALORE NEW COURSE INVITATION FOR APPLICATIONS FOR MATHEMATICS AND COMPUTING COURSE IN BTECH GH VB

IISc Bangalore: IISc బెంగళూరు కొత్త కోర్సు.. బీటెక్‌లో మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు, బీటెక్‌(BTech)లో మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ కోర్సు కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. JEE అడ్వాన్స్‌డ్ స్కోర్‌ ఆధారంగా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టనుంది.

ఇంకా చదవండి ...
ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు, బీటెక్‌(BTech)లో మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ కోర్సు కోసం ఆన్‌లైన్(Online) దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. JEE అడ్వాన్స్‌డ్ స్కోర్‌ ఆధారంగా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 1 నుంచి అధికారిక వెబ్‌సైట్ iisc.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 31 అని ఐఐఎస్‌సీ బెంగళూరు వెల్లడించింది. ఈనెల ప్రారంభంలో IISc బెంగళూరు ట్వీట్ చేస్తూ... “గణితం & కంప్యూటింగ్‌లో కొత్త BTech కోర్సు కోసం త్వరలో అప్లికేషన్లు ఓపెన్ చేస్తున్నాం. ఈ కోర్సుతో గణితం, AI & ML, కంప్యూటేషనల్ సైన్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సిగ్నల్ ప్రాసెసింగ్, కంప్యూటర్ బయాలజీ & మ్యాథమెటికల్ ఫైనాన్స్‌లో అనుభవం పొందవచ్చు.’’ అని పేర్కొంది.

కొత్త అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ద్వారా గణితం(mathematics) కంప్యూటర్ సైన్స్(computer science), డేటాసైన్స్( data science) లో లోతైన పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తదుపరితరం సాంకేతికతలలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలలో ముందంజలో ఉండే భవిష్యత్తు లీడర్లను తయారు చేయడమే తమ లక్ష్యమని ఐఐఎస్ బెంగళూరు తెలిపింది. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థులు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కోర్ సబ్జెక్టులుగా ఉండి గుర్తింపు పొందిన బోర్డు నుంచి అందుకు సమానమైన పరీక్ష పాసై ఉండాలి.

WFH | Vastu Tips: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా.. అయితే ఈ నాలుగు వాస్తు టిప్స్ పాటిస్తే సక్సెస్ మీవెంటే..!


ఈ కోర్సులో మొత్తం 52 సీట్లు ఉంటాయి. ఇందులో మహిళా అభ్యర్థులకు ఎనిమిది సూపర్‌న్యూమరీ సీట్లు, నాలుగు సీట్లు విదేశీ విద్యార్థులు, NRI, OCI విద్యార్థులకు కేటాయించారు. కోర్సులో గణితం, కృత్రిమ మేధస్సు(artificial intelligence), మెషిన్ లెర్నింగ్, కంప్యూటేషనల్ సైన్స్, సైద్ధాంతిక కంప్యూటర్ సైన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సిగ్నల్ ప్రాసెసింగ్, కంప్యూటేషనల్ బయాలజీ, మ్యాథమెటికల్ ఫైనాన్స్ వంటి సబ్జెక్టులు ఉంటాయి.

ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం ఆరు సెమిస్టర్లు ఉంటాయి. సైన్సెస్, హ్యుమానిటీస్, ఇతర ఇంజనీరింగ్ విభాగాలతో పాటు గణితం, కంప్యూటింగ్‌లో ఆరు కోర్సులు ఉంటాయి. ఇన్‌స్టిట్యూట్ అందించే అనేక ఎలిక్టివ్‌లే కాకుండా గణితం, కంప్యూటింగ్‌లోని అనేక కోర్సుల నుండి సాఫ్ట్‌కోర్ క్రెడిట్‌లను ఎంచుకోవచ్చు. గణితం, కంప్యూటింగ్ డిగ్రీలో బీటెక్ తర్వాత, విద్యార్థులు అదనంగా ఒక సంవత్సరం ప్రాజెక్ట్ క్రెడిట్ తీసుకోవడం ద్వారా ఎంటెక్ డిగ్రీకి కూడా వెళ్లవచ్చని ఐఐఎస్ బెంగళూరు ప్రకటించింది.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు కోర్సు ఫీజుగా మొదటి ఏడాది రూ.2,20,200 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులైతే కేవలం రూ.20,200 చెల్లిస్తే సరిపోతుంది. విద్యార్థులు తమ నాలుగో సంవత్సరంలో రిసెర్చ్ లేదా ప్రాజెక్ట్ వర్క్ ఎంచుకోవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Bangalore, Career and Courses, Iisc bangalore

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు