ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) మరో అద్భుత ఆవిష్కరణ చేసింది. దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన బెంగళూరులోని(Bangalore) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IISc) కోసం మరో శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ను(Super Computer) అభివృద్ధి చేసింది. 3.3 పెటాఫ్లాప్స్(1 పెటాఫ్లాప్ సెకనుకు క్వాడ్రిలియన్ లేదా 1015 ఆపరేషన్స్‌కు సమానం) సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ సూపర్ కంప్యూటర్ను ‘పరమ్ ప్రవేగా’ పేరుతో పిలుస్తున్నారు. ఇప్పటి వరకు భారతీయ విద్యా సంస్థల్లో ఇన్స్టాల్ చేసిన వాటిలో ఇదే అతి పెద్ద సూపర్ కంప్యూటర్ కావడం విశేషం. దీన్ని ఐఐఎస్సీ బెంగళూరులో విభిన్న పరిశోధనలు, విద్యా కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు.
ఈ సూపర్ కంప్యూటర్ను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారు. సూపర్ కంప్యూటర్లో ఉపయోగించే చాలా భాగాలను దేశంలోనే తయారు చేశారు. అంతేకాదు, సూపర్ కంప్యూటర్ను ఇక్కడే అసెంబుల్ చేసినట్లు C-DAC తెలిపింది. దేశవ్యాప్తంగా విభిన్న పరిశోధన, విద్యా అన్వేషణల కోసం ఏర్పాటు చేసిన నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎమ్) కింద ఈ సూపర్ కంప్యూటర్ను తయారు చేసినట్లు పేర్కొంది. C-DAC దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10 సూపర్ కంప్యూటర్లను ఇన్స్టాల్ చేసింది. వీటిని ఐఐఎస్సీ, ఐఐటీలు, ఐఐఎస్ఈఆర్ పూణే, జేఎన్సీఏఎస్ఆర్, ఎన్ఏబీఐ -మొహాలీ, C-DAC వంటి విద్యా, పరిశోధన సంస్థల్లో ఏర్పాటు చేసింది.
Param Pravega, among the most powerful supercomputers in India (3.3 petaflops), has been installed at IISc under National Supercomputing Mission. Many components manufactured & assembled in India, including indigenous software stack developed by @cdacindiahttps://t.co/BIyOPSgwkw pic.twitter.com/WDifsRnx1r
— IISc Bangalore (@iiscbangalore) February 3, 2022
పరమ్ ప్రవేగా అంటే ఏంటి?
పరమ్ ప్రవేగా అంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్లాస్ ఆఫ్ సిస్టమ్స్ కలిగిన ఒక సూపర్ కంప్యూటర్. దీన్ని ఇంటెల్ జియోన్ కాస్కేడ్ ప్రాసెసర్లు, ఎన్విడియా టెస్లా V100 కార్డ్‌లతో కూడిన జీపీయూ నోడ్స్‌తో రూపొందించారు. C-DAC సాఫ్ట్వేర్ సహాయంతో హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సూపర్ కంప్యూటర్ ATOS BullSequana XH2000 సిరీస్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
ఇది 3.3 పెటాఫ్లాప్‌ల సామర్థాన్ని కలిగి ఉంటుంది. ఐఐఎస్సీ బెంగళూరులో ఇప్పటికే చాలా సంవత్సరాల క్రితం నెలకొల్పిన అత్యాధునిక సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థ ఉంది. 2015లో ఐఐఎస్సీ బెంగళూరులో సహస్రట్ సూపర్ కంప్యూటర్ను ఇన్స్టాల్ చేశారు. అప్పట్లో ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌గా నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.