రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల (Semi Conductors) కొరత తీవ్రంగా వేధించింది. పైగా ఈ రంగంలో ప్రొఫెషనల్ నిపుణుల సంఖ్య అవసరాలకు తగట్టు లేదు. దీంతో ఈ అంతరాన్ని తగ్గించడానికి దేశంలోని టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు (IISc- Bangalore) సరికొత్త కోర్సును ఆఫర్ చేస్తోంది. సెమీకండక్టర్ రంగంలో మైక్రో అండ్ నానో ఎలక్ట్రానిక్స్‌పై పీజీ లెవల్ అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను తాజాగా ప్రకటించింది. ప్రముఖ గ్లోబల్ ఎడ్‌టెక్ సంస్థ టాలెంట్‌స్ప్రింట్ ఈ ప్రోగ్రామ్ కోసం అవసరమైన సహాయ సహకారాలను అందించనుంది.
IISc బెంగళూరుకు చెందిన MSDLab, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ (DESE) ఈ కోర్సుకు సంబంధించిన కరిక్యూలమ్‌ను రూపొందించాయి. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీతో ఇంటర్‌ఫేస్ కావడానికి సెమీకండక్టర్ రంగంపై లోతైన అవగాహన ఉన్న నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ ఇన్‌స్టిట్యూట్ మైక్రో అండ్ నానో ఎలక్ట్రానిక్స్‌పై పీజీ సర్టిఫికేషన్ కోర్సును డిజైన్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా నెక్ట్స్ జనరేషన్ సెమీకండక్టర్ నిపుణులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.
* స్పెషల్ ల్యాబ్
టాలెంట్‌స్ప్రింట్ సీఈఓ డాక్టర్ సంతన్ పాల్ మాట్లాడుతూ.. IISC నానోఎలక్ట్రానిక్స్ పరిశోధన కోసం అత్యాధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేసిందన్నారు. ఎలక్ట్రానిక్ డివైజ్‌ల తయారి విధానంలో ఫాస్టర్, స్మాలర్, మోర్ ఎఫిసియన్సీ వంటి విప్లవాత్మక మార్పులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఇందులో ఉంటాయన్నారు.
* రీసెర్చర్స్, ఎక్స్‌ఫర్ట్స్ టీమ్‌కు లీడ్
ప్రోగ్రామ్ ఇన్‌స్ట్రక్టర్ ప్రొఫెసర్ మయాంక్ శ్రీవాస్తవ.. MSDLabకు చెందిన రీసెర్చర్స్, ఎక్స్‌ఫర్ట్స్ టీమ్‌కు నాయకత్వం వహించనున్నారు. దాదాపు 50 పేటెంట్స్, 25 జాతీయ & అంతర్జాతీయ అవార్డులు, 200 రీసెర్చ్ పబ్లికేషన్స్ ఈయన ట్రాక్ రికార్డ్. మయాంక్ నేతృత్వంలోని ఈటీమ్ మోస్ట్ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఏ సమయంలోనైనా కనీసం ఐదుకు పైగా సెమీకండక్టర్ పరిశ్రమలతో కనెక్ట్ అయి ఉంటుంది.
* లోతైన అవగాహన కోసం..
ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మయాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. మైక్రో అండ్ నానో ఎలక్ట్రానిక్స్ రంగం నెక్ట్స్ జనరేషన్ సెమీకండక్టర్ టెక్నాలజీలను ఎనేబుల్ చేస్తుందన్నారు. అప్‌కమింగ్ న్యూరోమోర్ఫిక్, క్వాంటమ్ టెక్నాలజీలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత రియల్ వరల్డ్‌లో సెమీ కండక్టర్ పరిశ్రమ మంచి ఎఫిసియన్సీ ఉన్న రంగమన్నారు.
సెమీకండక్టర్ టెక్నాలజీ డిజైన్, మోడలింగ్, వర్గీకరణ, డెవలప్‌మెంట్‌తో పాటు ఈ రంగంలోని అవకాశాలపై కోర్సు ద్వారా అభ్యర్థులకు లోతైన అవగాహన కల్పించనున్నట్లు శ్రీవాస్తవ తెలిపారు. త్వరలోనే సెమీకండక్టర్ రంగం ట్రిలియన్ డాలర్ల పరిశ్రమగా వృద్ధి చెందుతుందని, దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి IISc- Bangalore ఈ కోర్సు ద్వారా ఒక వేదికను అందిస్తోందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Iisc bangalore, JOBS, New courses