హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIM Udaipur: బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌.. ఐఐఎం ఉదయ్‌పూర్‌లో స్పెషల్ కోర్సు!

IIM Udaipur: బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌.. ఐఐఎం ఉదయ్‌పూర్‌లో స్పెషల్ కోర్సు!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

PG Diploma Program in Business Administration | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఉదయ్‌పూర్, ఇటీవల వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (PGDBA-WE) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సు 20 నెలల పాటు జరగనుంది.

ఇంకా చదవండి ...

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఉదయ్‌పూర్, ఇటీవల వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (PGDBA-WE) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సు 20 నెలల పాటు జరగనుంది. ఈ కోర్సు ద్వారా వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌లకు కనీసం మూడు సంవత్సరాల పుల్- టైమ్ పోస్ట్-క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఈ కోర్సు వారాంతాల్లో ఆన్‌లైన్ ఫార్మాట్‌ లో జరుగుతుంది. అలాగే ప్రతి రెండు వారాలకోసారి ఆన్-క్యాంపస్ (On Campus) మాడ్యూల్స్‌లో తరగతులు ఉంటాయి. ఐఐఎం ఉదయ్‌పూర్ (Udaypur) ఫ్యాకల్టీ సభ్యులు ఈ కోర్సులో బోధన చేపట్టనున్నారు.

JEE Preparation: జేఈఈలో బెస్ట్ స్కోర్‌తో ఉత్తీర్ణ‌త సాధించాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో బలమైన పునాది, లోతైన అవగాహనను కల్పించడం ద్వారా వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌లు వారి పనితీరు, కెరీర్ వృద్ధిని మెరుగుపరచుకోవడంలో సహాయపడడమే తమ లక్ష్యమని ఐఐఎం ఉదయ్‌పూర్ పేర్కొంది.

ఎంపిక ప్రక్రియ

జీమ్యాట్(GMAT), GRE లేదా CAT లేదా IIM ఉదయ్‌పూర్ నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో సాధించిన స్కోర్‌, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. క్లాస్ రూమ్ సెషన్లు కేస్-బేస్డ్ లెర్నింగ్ విధానంలో ఉంటాయి. ఇది నిజ జీవిత పరిస్థితులను తరగతి గదిలో ప్రతిబింబిస్తుంది. దీంతో విద్యార్థులు నేర్చుకోవడంలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది.

కోర్సు వివరాలు

ఈ కోర్సులో సెమినార్లు, సిమ్యులేషన్స్, గేమ్స్, రోల్-ప్లేలు, గెస్ట్ లెక్చర్స్, గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇందులో పాల్గొనే వారు వ్యక్తిగతంగా కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ ప్రాబ్లమ్స్ స్వీకరించడం, వాటిపై చర్చలు జరపడం, పరిష్కారాలు కనుగొనాల్సి ఉంటుంది.

TS Group-1: గ్రూప్-1 ప‌రీక్ష తేదీ ఖరారు.. ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ.. ఎంపిక విధానంలో కీల‌క విష‌యాలు

ఐఐఎం ఉదయపూర్ డైరెక్టర్  ప్రొఫెసర్ జనత్ షా మాట్లాడుతూ.. ‘పరిశోధన ద్వారా నాలెడ్జ్, మేనేజ్‌మెంట్ ప్రతిభను క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. తద్వారా ఐఐఎం ఉదయ్‌పూర్‌ అత్యుత్తమ పరిశోధనా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు లభించింది. 2030 నాటికి యూటీ డల్లాస్ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాధించడమే మా లక్ష్యం. ప్రస్తుతం ఏ భారతీయ సంస్థ కూడా ఈ జాబితాలో లేదు. ప్రస్తుతం ట్రాన్స్ ఫర్మేషనల్ ఎడ్యుకేషన్‌పై దృష్టి సారిస్తున్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్‌ను అధిక నాణ్యతతో ఆన్‌లైన్‌లో సౌకర్యవంతంగా డెలివరీ చేయడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. తద్వారా నిపుణులు వారి కెరీర్‌లను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.’ అని పేర్కొన్నారు.

Agnipath Scheme: యువ‌త కోసం కేంద్రం అగ్నిపథ్ స్కీమ్.. ఏమిటి ప్ర‌త్యేక‌త‌లు.. వివ‌రాలు

డియాజియో(Diageo) హ్యూమన్ రిసోర్సెస్ డైరెక్టర్ అరుణ్ కృష్ణన్ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని వర్కింగ్ ఎగ్జిక్యూటీవ్‌లు ఉపయోగించుకుని స్కిల్స్ పెంపొందించుకోవాలని సూచించారు. వర్క్‌పై దృష్టి కేంద్రీకరిస్తూ పరిశోధనాత్మక విషయాలపై ఎంతో ఆసక్తిగా ఉండాలన్నారు. సరైన టూల్‌సెట్, స్కిల్‌సెట్, మైండ్‌సెట్‌తో వచ్చే ప్రయోజనాల గురించి ఆలోచించాలన్నారు. నేర్చుకోవడంలో ఎంతో చరుకుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రతి విషయంపై స్వీయ అవగాహన ఉండాలని అరుణ్ కృష్ణన్ అభిప్రాయపడ్డారు.

మరోవైపు, ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) క్వాంటిటేటివ్ ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఇ- మాస్టర్స్ (eMasters) ప్రోగ్రామ్‌‌ను లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ emasters.iitk.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో జూన్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Published by:Sharath Chandra
First published:

Tags: Career and Courses, EDUCATION, IIT, JOBS

ఉత్తమ కథలు