హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIM Trichy: బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ కోర్సు.. వివరాలివే

IIM Trichy: బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ కోర్సు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మేనేజ్‌మెంట్‌ విద్యను అందిస్తోన్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐఎం తిరుచ్చి (IIM Trichy).. బ్యాంకింగ్ (banking), ఫైనాన్స్ (finance) విభాగంలో పీజీ సర్టిఫికెట్ కోర్సు (PG certificate course)ను ప్రారంభించింది.

మేనేజ్‌మెంట్‌ విద్యను అందిస్తోన్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐఎం తిరుచ్చి (IIM Trichy).. బ్యాంకింగ్ (banking), ఫైనాన్స్ (finance) విభాగంలో పీజీ సర్టిఫికెట్ కోర్సు (PG certificate course)ను ప్రారంభించింది. ఒక సంవత్సరం వ్యవధి గల ఈ కోర్సును అత్యంత నాణ్యత ఉండేలా రూపొందించారు. జారో ఎడ్యుకేషన్ (Jaro education) భాగస్వామ్యంతో ఈ కోర్సు (course)ను ప్రవేశపెట్టారు. డిజిటల్ (digital) యుగంలో ఎప్పటికప్పుడు వేగంగా మారుతున్న బ్యాంకింగ్ పరిశ్రమకు వెన్నుదన్నుగా ఈ కోర్సు నిలవనుంది. ఈ కోర్సులో ప్రొఫెషనల్స్ కు అనువైన స్కిల్ సెట్స్ (skills sets), కేస్ స్టడీస్, గ్రూప్ ప్రాజెక్టులు, ఇంటరాక్టివ్ తరగతులు (Interactive classes), టర్మ్ పేపర్ డెవలప్ చేయడం, సిములేషన్లు ఉంటాయి.

* ఈ కోర్సుకు అర్హత లేమిటి?

ఈ కోర్సులో జాయిన్ కావాలనుకున్న వారు 50 శాతం కనీస మార్కులతో డిగ్రీ (degree) లేదా సమానమైన కోర్సు పాసై (should pass) ఉండాలి. సీట్ల కేటాయింపులో ప్రొఫెషనల్ అనుభవం (professional experience) కలిగిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు (reservations) అమలు చేయనున్నారు. ఈ కోర్సులో జాయిన్ కావాలనుకునే వారు జారో ఎడ్యుకేషన్ డాట్ కామ్ ( jaroeducation.com/pg-certificate-programme-in-banking-and-finance-iim-trichy)లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.

* కోర్సు ప్రయోజనాలు

బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీల ( Non Banking Finance Company) పనితీరుపై కీలక విజ్ఙానం పెంపొందించుకునేందుకు, సంస్థలను నియంత్రించే నిబంధనలు, రియల్ వరల్డ్ కేస్ స్టడీస్ పై అనుభవం సాధించడం, న్యూ ఏజ్ ప్రొడక్ట్స్ పై ఇన్ సైట్స్ (Insights) రూపొందించడం, బ్యాంకింగ్ సంస్థల ఆవిష్కరణలు, బ్యాంకింగ్ (banking) వ్యూహాలు రూపొందించడంతోపాటు వాటిని అమలు చేయడంలో ఈ కోర్సు (course) ఉపకరిస్తుంది.

* మార్కెట్ అవసరాలకు

ఆర్ధిక కార్యకలాపాలు క్రెడిట్ (credit) వృద్ధికి దోహదపడతాయి. సంవత్సరానికి 10 నుంచి 13 శాతం క్రెడిట్ వృద్ధి (credit development) ఉండవచ్చని అంచనా. 2018లో దేశం మొత్తం మీద డిజిటల్ రుణాలు రూ.5,60,000 కోట్లు ఉన్నాయి. ఇది 2023 నాటికి రూ.750000 కోట్లకు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. అంటే డిజిటల్ ఇన్ఫ్రా (digital Infra) లో ఐదు రెట్లు పెరుగుదల నమోదవుతుందని జారో ఎడ్యుకేషన్ సీఈవో రంజిత రమన్ తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ వారి స్కిల్ సెట్స్ (skils set) వృద్ధి చేసుకునేందుకు ఈ పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందన్నారు.

దేశంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. డిజిటల్ విప్లవం ఇందుకు దోహదపడింది. రుణాలు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. అంతా డిజిటల్ రూపంలో అంటే ఆన్ లైన్లో బ్యాంకులు కావాల్సిన వివరాలు అందిస్తే చాలు. ఇలా బ్యాకింగ్, ఫైనాన్స్ (finance) రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశంలోని అనేక ప్రతిష్టాత్మక సంస్థలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Bank Jobs, Bank Jobs 2021, Banking, Career and Courses, EDUCATION, Finance, New course, Private Jobs

ఉత్తమ కథలు