ఇటీవల కాలంలో ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు ఆన్లైన్ వేదికగా వివిధ డొమైన్లలో సర్టిఫికేషన్ కోర్సులను(Certificate Course) అనేక సంస్థలు లాంచ్(Launch) చేస్తున్నాయి. తాజాగా హెచ్ఆర్ డొమైన్లో స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్న వారికి ఐఐఎం షిల్లాంగ్, సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ గుడ్ న్యూస్ చెప్పాయి. హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్(Graduate Certificate) కోర్సును తాజాగా ఆఫర్ చేశాయి. కోర్సు డెలివరీ కోసం ప్రముఖ ఎడ్యుకేషన్ కంపెనీ వెరాండా లెర్నింగ్ సొల్యూషన్స్‌తో ఒప్పందం కుదర్చుకున్నాయి. వెరాండా బ్రాండ్ ఎడ్యురెకా (Edureka), ఈ కోర్సును ఆన్లైన్లో డెలివరీ చేయనుంది.
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ పెంపొందించుకోవాలనుకునే వారి కోసం ఒక సంవత్సరం వ్యవధితో ఈ కోర్సును డిజైన్ చేశారు. ఈ కోర్సు మేనేజ్మెంట్ స్ట్రీమ్ నుంచి హ్యుమన్ రిసోర్స్ థియరీకి చెందిన ఫండమెంటల్, అప్లైడ్ అంశాలపై లెర్నర్స్‌కు అవసరమైన ఎక్స్‌పోజర్స్‌ను అందించనుంది. అభివృద్ధి చెందుతున్న హెచ్ఆర్ ల్యాండ్‌స్కేప్‌లో ఎక్సలెన్స్‌కు కీలకమైన క్రిటికల్ నాలెడ్జ్, సామర్థ్యాలపై ఈ కోర్సు ద్వారా లెర్నర్స్‌కు లోతైన అవగాహన కల్పించనున్నారు.
* హెచ్ఆర్లో మేనేజర్స్‌గా ట్రాన్స్ఫామ్ కావడానికి..
సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (SHRM) ఇండియా సీఈవో అచల్ ఖన్నా మాట్లాడుతూ.. హెచ్ఆర్ డొమైన్లో వివిధ రోల్స్ కోసం సిద్ధమవుతున్న వారికి కోర్సును అందిస్తామని చెప్పారు. ఏ సంస్థలోనైనా వ్యక్తుల పనితీరు కంపెనీ కార్యకలాపాలకు కీలకంగా ఉంటుందన్నారు. ముడి ప్రతిభను మార్కెట్ రెడీ, ప్రజలకు అవగాహన కల్పించే మేనేజర్స్‌గా ట్రాన్స్ఫామ్ కావడంలో ఈ కోర్సు కీలకంగా మారుతుందని చెప్పారు.
ప్రాక్టికల్ ఎక్స్పోజర్
ఐఐఎం షిల్లాంగ్ ఫ్యాకల్టీ ఈ కోర్సులోని పాఠ్యాంశాలను బోధించనున్నారు. పోస్ట్ పాండమిక్ నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కోవడానికి, చురుగ్గా ప్రతిస్పందించే సామర్థ్యంతో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి కేస్ స్టడీస్, సిమ్యులేషన్స్, క్లాస్ ఎక్సర్సైజెస్ వంటి టూల్స్ ఉపయోగించుకోవడం కోసం ప్రాక్టికల్ హ్యాండ్-ఆన్ ఎక్స్పోజర్ను కూడా ఈ కోర్సు అందించనుంది. ఈ కోర్సులో చేరిన వారు SHRM ఇండియా కాంప్లిమెంటరీ వార్షిక సభ్యత్వం పొందడానికి అర్హులు. ఈ కోర్సును సక్సెస్‌పుల్‌గా పూర్తి చేసిన అభ్యర్థులు ఐఐఎం షిల్లాంగ్ నుంచి సర్టిఫికేట్ అందుకోనున్నారు.
లెర్నర్స్లో స్కిల్స్ పెంపొందించడానికి..
వెరాండా లెర్నింగ్ సొల్యూషన్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ హెడ్ ఆదిత్య మాలిక్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో న్యూ ట్రెండ్స్, సవాళ్ల కారణంగా హెచ్ఆర్ ల్యాండ్‌స్కేప్ రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పారు. దీంతో విద్యార్థుల స్కిల్స్ పెంపొందించి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. న్యూ-ఏజ్ HRను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుందన్నారు. ఇండస్ట్రీ డిమాండ్లకు తగిన విధంగా స్పందించడానికి నిపుణులను సన్నద్ధం చేయడంలో ఈ కోర్సు కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Certificate, Iim, JOBS, New courses