Home /News /jobs /

IIM ROHTAK INVITES APPLICATIONS FOR 2 YEAR PG DIPLOMA IN SPORTS MANAGEMENT UMG GH

IIM Rohtak: స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో ఐఐఎం రోహ్‌తక్ స్పెషల్ కోర్సు.. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అడ్మిషన్స్ ప్రారంభం

స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో ఐఐఎం రోహ్‌తక్ స్పెషల్ కోర్సు..

స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో ఐఐఎం రోహ్‌తక్ స్పెషల్ కోర్సు..

స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ రంగంలో లీడర్స్‌గా ఎదగటానికి ఎక్స్‌పీరియన్స్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్, క్రీడా ఔత్సాహికులు, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వాస్తోంది. ఐఐఎం రోహ్‌తక్. ఈ మేరకు  స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల(2022-24) ఎగ్జిక్యూటివ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రారంభమయ్యాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ రంగంలో లీడర్స్‌గా ఎదగటానికి ఎక్స్‌పీరియన్స్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్, క్రీడా ఔత్సాహికులు, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వాస్తోంది ఐఐఎం రోహ్‌తక్. ఈ మేరకు స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల(2022-24) ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తుంది. Ulster యూనివర్సిటీ, యూకే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్సీ చేయడానికి విద్యార్థులకు ఇదో సువర్ణావకాశం. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 10 2022లోపు ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలి.

స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సంబంధిత రంగాల్లో పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం ఈ ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేసినట్లు ఐఐఎం రోహ్‌తక్ తెలిపింది. జాతీయ, అంతర్జాతీయంగా క్రీడా పరిశ్రమలోని లీగల్ విషయాలు, రెగ్యులేషన్స్, ఆఫరేషన్స్, ఫైనాన్షియల్, బ్రాండింగ్ కాన్సెఫ్ట్‌లపై ఈ ప్రోగ్రామ్ ద్వారా అభ్యర్థులకు అవగాహన కల్పించనున్నారు. క్రీడా పరిశ్రమలో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి, భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అభ్యర్థులకు వీలు కల్పిస్తుందని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.

* అర్హత ప్రమాణాలు
కనీసం 50 శాతం మార్కులతో లేదా అందుకు సమానమైన మొత్తం గ్రేడ్ పాయింట్ యావరేజ్‌తో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత రంగంలో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి: ఓరి నీ సర్ప్రైజ్ పాడుగాను.. హారం పోయిందని పెళ్లికొడుకు నాటకం.. చివరికి ఏం జరిగిందంటే !


* దరఖాస్తు విధానం
ఐఐఎం రోహ్‌తక్ అధికారిక వెబ్‌సైట్ www.iimrohtak.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద రూ.1000 చెల్లించాలి.

* సర్టిఫికేషన్
రెండు సంవత్సరాల ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, విద్యార్థులకు “ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్” సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఐఐఎం రోహ్‌తక్ పూర్వ విద్యార్ధుల హోదా కూడా కల్పిస్తామని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

* ప్రోగ్రామ్ ఫీజు
ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనే అభ్యర్థులు ఫీజు రూపంలో రూ. 7,15,524 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సబ్సిడీ ట్యూషన్ ఫీజులు, పూర్వ విద్యార్థుల ఫీజులు, అకడమిక్ ఛార్జీలు, పరీక్షలు, పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ ఫీజులు కలిసి ఉంటాయి. అభ్యర్థులు వాయిదా పద్ధతిలో కూడా ఫీజు చెల్లింపు చేయవచ్చు.



మరోవైపు, ఐఐఎం అహ్మదాబాద్ ఇ-పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్ బిజినెస్ అనలిటిక్స్ (e-PGD ABA)లో నాలుగో బ్యాచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం అప్లైడ్ అనలిటిక్స్‌లో 16-నెలల పాటు ప్రోగ్రామ్ ఉండనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఐఐఎంఏ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే, అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసి ఉండాలి. బిజినెస్ అనలిటిక్స్‌లో కనీసం రెండేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా తప్పనిసరి. GMAT/GRE/CAT/GATE లేదా ePGD-ABA క్వాలిఫైయింగ్-కమ్-ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో వ్యాలిడ్ స్కోర్ చేసి ఉండాలి.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Iim, JOBS, Sports

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు