IIM Raipur: ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు, అభ్యర్థుల్లో స్కిల్స్ పెంపొందించడానికి టాప్ ఇన్స్టిట్యూట్స్ సరికొత్త కోర్సులను ప్రారంభిస్తున్నాయి. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాయ్‌పూర్(IIM Raipur) సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్‌పై ఎగ్జిక్యూటివ్ సర్టిఫికేట్ కోర్సు(Executive certificate course) ఆఫర్ చేస్తోంది. ఇందుకు ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ ఇమార్టికస్ లెర్నింగ్ సహకారం అందిస్తోంది.
స్కిల్స్ డెవలప్మెంట్
సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ రంగంలో ఔత్సాహిక అభ్యర్థులకు నెపుణ్యాలు పెంపొందించడానికి ఈ కోర్సును డిజైన్ చేసినట్లు ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ఈ కోర్సుతో మెరుగైన ఉపాధి, ప్రమోషనల్ అవకాశాలను కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపింది. ఇప్పటికే ఈ రంగంలో పనిచేస్తున్న వారికి స్ట్రాటజీ, ఆపరేషన్స్, టెక్నాలజీ వంటి విభాగాల్లో లీడర్షిప్ స్కిల్స్ పెంపొందించుకోవడంలో ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది.
పది నెలల కోర్సు
సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ రంగంలో ఎమర్జింగ్ లీడర్స్, సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్స్‌కు ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లెర్నర్స్ ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సు 10 నెలల పాటు ఉంటుంది.
CXOలతో ఇంటరాక్ట్
పరిశ్రమ దిగ్గజాలు, ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్ల అధ్వర్యంలో ఈ కోర్సును డెలివరీ చేయనున్నారు. సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ విభాగంలో మేనేజ్మెంట్ సమస్యలపై లోతైన అవగాహన పెంపొందించుకోవడానికి ఈ రంగంలోని ప్రొఫెషనల్స్‌కు అవకాశం ఉంటుంది. తద్వారా సంస్థ లోపల, బయట CXOలతో ఇంటరాక్ట్ కావచ్చు.
మెరుగైన ఉపాధి అవకాశాలు
ఇమార్టికస్ లెర్నింగ్ వ్యవస్థాపకుడు, ఎండీ నిఖిల్ బర్షికర్ మాట్లాడుతూ.. ఈ కోర్సు, సప్లై చెయిన్ అండ్ ఆపరేషన్స్ రంగంలో స్థిరపడిన ఔత్సాహిక నిపుణులకు ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఐఐఎం రాయ్‌పూర్ ఎగ్జిక్యూటివ్ లెర్నింగ్ & డెవలప్మెంట్ ఆఫీస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ అనుభా దధిచ్ మాట్లాడుతూ.. ఈ కోర్సు ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్‌తో థిరిటికల్ పరిజ్ఞానాన్ని కనెక్ట్ చేస్తుందన్నారు. గ్లోబల్ మార్కెట్లో పోటీ పడటానికి సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని సృష్టించడంమే తమ లక్ష్యమన్నారు. ఇందుకు ఇమార్టికస్ లెర్నింగ్ సహకారం అందిస్తుందన్నారు.
CBI cases : ఎమ్మెల్యే,ఎంపీలపై సీబీఐ కేసుల్లో దేశంలోనే ఏపీ నెం.1
రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్
కోర్సులో భాగంగా ఐఐఎం రాయ్‌పూర్ ఎక్స్‌ఫర్ట్స్ 150 గంటల కంటే ఎక్కువ లైవ్ సెషన్స్ అందించనున్నారు. ఈ ఇన్స్టిట్యూట్ అభ్యర్థులకు సర్టిఫికేషన్ అందజేస్తుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ పూర్వ విద్యార్థుల హోదాను కూడా అభ్యర్థులు పొందనున్నారు. క్యాంపస్‌లో మూడు రోజుల ఇమ్మెర్సివ్ సెషన్ కూడా ఉంటుంది. SCM గ్లోబ్ సిములేషన్స్ సెషన్ కారణంగా ప్రొఫెషనల్స్ ఫీల్డ్‌లో పనిచేసేటప్పుడు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. మూడు మాస్టర్‌క్లాస్ సెషన్స్ నుంచి లెర్నర్స్ బలమైన థిరిటికల్ బేస్ పొందనున్నారు. అంతేకాకుండా ఈ రంగంలోని నిపుణులతో ఇంటరాక్ట్ సెషన్ నిర్వహిస్తూ.. నెట్వర్క్ బిల్డింగ్, సహకార అభ్యాసానికి ఈ కోర్సు అవకాశం కల్పిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.