Home /News /jobs /

IIM CAT 2021: క్యాట్- 2021 ఎగ్జామ్ రాస్తున్నారా? పరీక్షకు హాజరయ్యే వారు పాటించాల్సిన నిబంధనలు ఇవే..

IIM CAT 2021: క్యాట్- 2021 ఎగ్జామ్ రాస్తున్నారా? పరీక్షకు హాజరయ్యే వారు పాటించాల్సిన నిబంధనలు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కామన్ అడ్మిషన్ టెస్ట్‌ (CAT- 2021) పరీక్షకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 18న ఆదివారం క్యాట్ ఎగ్జామ్‌ను దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈసారి IIM అహ్మదాబాద్ ఈ ప్రక్రియ చేపట్టింది. అయితే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఐఐఎం అహ్మదాబాద్ డ్రెస్‌కోడ్‌ను నిర్దేశించింది.

ఇంకా చదవండి ...
ఎడ్యుకేషన్ : దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)లు, ఇతర మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్‌ (CAT- 2021) పరీక్షకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 18న ఆదివారం క్యాట్ ఎగ్జామ్‌ను దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈసారి IIM అహ్మదాబాద్ ఈ ప్రక్రియ చేపట్టింది. అయితే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఐఐఎం అహ్మదాబాద్ డ్రెస్‌కోడ్‌ను నిర్దేశించింది. అభ్యర్థులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలి. మాస్క్ లేకపోతే ఎగ్జామ్‌ హాల్‌లోకి ఎవరినీ అనుమతించరు. మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా నిబంధనల ప్రకారం స్పెషల్ డ్రెస్‌ పాటించాల్సి ఉంటుంది.

RRB NTPC: ఆర్ఆర్​బీ పరీక్ష రాసిన అభ్యర్థులకు శుభవార్త.. వారికి ఫీజు రీఫండ్

CAT 2021 డ్రెస్ కోడ్ మార్గదర్శకాలు

- అభ్యర్థులు హైహీల్స్ లేదా మందంగా ఉండే సోల్స్‌ ఫుట్‌వేర్స్‌ ధరించకూడదు.

- అభ్యర్థులు స్లిప్పర్స్‌ను లేదా బాటమ్ సోల్ తక్కువగా ఉండే స్లిప్ ఆన్ షూస్ ఎంచుకోవాలి.

- ఎలాంటి జేబులు లేని సాక్స్, ప్లెయిన్ టైప్ పుల్ ఓవర్/స్వెటర్స్/కార్డిగాన్‌లు ధరించేందుకు అనుమతి ఉంటుంది.

- జీన్స్, ట్రౌజర్స్ లేదా ప్యాంటు వంటి వాటికి ఎక్కువ పాకెట్స్ ఉండకూడదు. కాపీ కొట్టేందుకు అనుకూలంగా ఉన్నందువల్ల, ఇలాంటి దుస్తులు ధరించే వారిని పరీక్షకు అనుమతించరు.

- దుస్తులకు మరీ పెద్దసైజు బటన్లు ఉండకూడదు.

- లోహాం (మెటల్స్) ఉండే వివిధ రకాల ఆభరణాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

- అధిక విలువ కలిగిన వస్తువులను ఎగ్జామ్ హాల్‌లో తీసుకెళ్లకూడదు. అభ్యర్థి బయోమెట్రిక్ వేలిముద్రను క్యాప్చర్ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, వారి అరచేతిపై హెన్నా ఉండకూడదనే నిబంధన ఉంది.

RRB NTPC Result: ఆ రోజే ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ ఫలితాలు.. కేటగిరీ వారీగా కటాఫ్​ మార్కులు ఇలా..

అభ్యర్థులందరూ కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలి. ఫేస్ మాస్క్ ధరించడం, శానిటైజర్‌ను వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. పరీక్ష హాలు లోపలికి ఎలాంటి బ్యాగులను అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, మొబైల్ ఫోన్‌లు, గడియారాలు, కాలిక్యులేటర్లు, గాగుల్స్ వంటి వాటిని అనుమతించరు.

అభ్యర్థులందరూ CAT 2021 అడ్మిట్ కార్డును తప్పకుండా తీసుకెళ్లాలి. దీంతో పాటు ఫోటో ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయర్ ID, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, కాలేజీ ID, ఐడెంటిఫికేషన్ అఫిడవిట్ వంటి వాటిలో ఏదో ఒకదాన్ని తీసుకెళ్లాలి. పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు మెడికల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.

CAT 2021 పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఉదయం 8.30, మధ్యాహ్నం 12,30, 3.30.. వంటి మూడు స్లాట్‌లలో ఎగ్జామ్‌ ఉంటుది. ఈ సంవత్సరం CATను IIM అహ్మదాబాద్ నిర్వహిస్తోంది. దేశంలోని ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్‌లో చేరేందుకు అభ్యర్థులు CAT 2021లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Cat, Exams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు