IIM BODH GAYA LAUNCHES NEWS COURCES ON AI AND MACHINE LEARNING LINK TO APPLY BA GH
IIM Bodh Gaya new Cources : కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఐఐఎం బోధ్ గయా.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ వివరాలు...
IIM Bodh Gaya (Image; Wikipedia)
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బోధ్ గయా (IIM Bodh Gaya) కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. టైమ్స్ ప్రొఫెషనల్ లెర్నింగ్ (TPL)కు చెందిన బ్రాండ్ ది సెకండ్ విండ్ (TimesTSW) సహకారంతో కొత్త కోర్సును లాంచ్ చేసింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బోధ్ గయా (IIM Bodh Gaya) కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. టైమ్స్ ప్రొఫెషనల్ లెర్నింగ్ (TPL)కు చెందిన బ్రాండ్ ది సెకండ్ విండ్ (TimesTSW) సహకారంతో కొత్త కోర్సును లాంచ్ చేసింది. ఈ సంస్థలు సంయుక్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫర్ బిజినెస్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించాయి.
ఈ పది నెలల ప్రోగ్రామ్‌ను ప్రొఫెషనల్స్, మేనేజర్లు, కన్సల్టెంట్ల కోసం డిజైన్ చేశారు. ఇందులో అధునాతన AI & ML నైపుణ్యాలను పరిచయం చేస్తారు. డేటా అండ్ బిజినెస్ అనలిస్ట్ రోల్స్ గురించి తెలుసుకోవడానికి.. వివిధ మేనేజ్మెంట్ ఫంక్షన్స్‌కు నైపుణ్యాలు జోడించడానికి కోర్సు సహాయపడుతుంది. వ్యాపారానికి సంబంధించిన డిస్క్రిప్టివ్ అనలిటిక్స్, డేటా విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్, పైథాన్ కాన్సెప్ట్‌లు, అప్లికేషన్స్, మార్కెటింగ్ అనలిటిక్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటివి అభ్యర్థులకు నేర్పిస్తారు. వీటిని ఇండస్ట్రీ నిపుణులు బోధిస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
వారికి ఉపయోగం..
ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసిన సందర్భంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బోధ్ గయా ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ సమంత్ సౌరభ్ మాట్లాడారు. ‘గత రెండేళ్లుగా టెక్-ఎనేబుల్డ్ అప్లికేషన్స్‌కు డిమాండ్ పెరగడం వల్ల నైపుణ్యాలు కలిగిన నిపుణులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో వీరి అవసరం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లోని ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్.. ప్రొఫెషనల్స్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఉత్పాదకతను (ప్రొడక్టివిటీ) పెంచుతుంది. వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. అంతిమంగా వృద్ధిని పెంచుతుంది.’ అని సౌరభ్ వివరించారు.
JEE Main-2022: జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1 పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇలా..!
టైమ్స్ ప్రొఫెషనల్ లెర్నింగ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సునీల్ సూద్ మాట్లాడుతూ.. కాంప్లెక్స్ బిజినెస్ ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ప్రభావం చూపుతుందన్నారు. ‘స్టార్టప్‌ల ఆవిర్భావం పరిశ్రమలలో నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్‌ను పెంచుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని TPL-IIM బోధ్ గయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫర్ బిజినెస్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇది అభ్యర్థుల కెరీర్ గ్రాఫ్‌ను పెంచుతుంది.’ అని సునీల్ తెలిపారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.