Home /News /jobs /

IIM BODH GAYA COURSES IIM BODH GAYA LAUNCHES THREE EXECUTIVE COURSES THESE ARE THE DETAILS GH VB

IIM Bodh Gaya Courses: మూడు ఎగ్జిక్యూటివ్ కోర్సులను ప్రారంభించిన ఐఐఎం బోధ్ గయా.. పూర్తి వివరాలిలా..

 IIM Bodh Gaya

IIM Bodh Gaya

బిజినెస్ స్టూడెంట్స్‌కు (Business Students) తీపి కబురు అందించింది ప్రముఖ ఎడ్యుకేషన్ ప్రొవైడర్ (Education Provider) టైమ్స్ ప్రొఫెషనల్ లెర్నింగ్ (TPL).

బిజినెస్ స్టూడెంట్స్‌కు (Business Students) తీపి కబురు అందించింది ప్రముఖ ఎడ్యుకేషన్ ప్రొవైడర్ (Education Provider) టైమ్స్ ప్రొఫెషనల్ లెర్నింగ్ (TPL). వివిధ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేసేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బోధ్ గయా (IIM Bodh Gaya)తో స్ట్రాటిజిక్ టై-అప్ ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా మూడు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లను కూడా లాంచ్ చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్‌ ఫర్ బిజినెస్ (Executive Certificate Program In Digital Marketing For Business), ఎగ్జిక్యూటివ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (Executive Certificate Program In Business Management), ఎగ్జిక్యూటివ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ ఫర్ బిజినెస్ (Executive Certificate Program In Artificial Intelligence and Machine Learning for Business) వంటివి ఉన్నాయి.

TS Jobs Coaching: నిరుద్యోగుల‌కు అలర్ట్.. ఉచిత శిక్ష‌ణ‌.. రూ.1,500 విలువైన స్ట‌డీ మెటీరియ‌ల్

ఈ మూడు ప్రోగ్రామ్‌ల సమయంలో అభ్యాసకులు (Learners) క్యాంపస్-ఇమ్మర్సివ్ సెషన్‌ను ఎక్స్‌పీరియన్స్‌ చేస్తారు. వీరు ఐఐఎం బోధ్ గయా ఎగ్జిక్యూటివ్ పూర్వ విద్యార్థుల హోదా (Executive Alumni Status)ను కూడా పొందుతారు. టీపీఎల్, ఐఐఎం (TPL-IIM) బోధ్ గయా రెండూ కలిసి వివిధ రంగాల అవసరాలను తీర్చడానికి సప్లై చైన్ అనలిటిక్స్ తో పాటు అభివృద్ధి చెందుతున్న ఇతర సబ్జెక్టులలో కూడా కోర్సులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

“ఐఐఎం బోధ్ గయా 119-ఎకరాల ఫెసిలిటీ దాని అభ్యాసకులకు టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. అలాగే లెర్నర్స్ లో మోడ్రన్ డే స్కిల్స్ పెంపొందిస్తుంది. ఇది జ్ఞానం (Knowledge), జ్ఞానోదయం (Enlightenment) పొందడంలో ప్రసిద్ధి చెందిన నలంద భూమిలో ఎస్టాబ్లిష్ చేసారు. అందుకే ఇది గర్వించదగిన గుర్తింపును పొందింది. టీపీఎల్, ఐఐఎం బోద్ గయా టాలెంట్ ఇన్నోవేషన్ యూత్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అదే సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా న్యూ-ఏజ్ ప్రోగ్రామ్స్ ప్రవేశపెడుతున్నాయి, తద్వారా దేశ నిర్మాణానికి దోహదపడతాయి" అని టీపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

Jobs in Telangana: సింగ‌రేణి కొల‌రీస్‌లో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూలు

ఈ ప్రకటనపై ఐఐఎం బోధ్ గయా డైరెక్టర్ డాక్టర్ వినితా ఎస్ సహాయ్ మాట్లాడుతూ, “టైమ్స్ ప్రొఫెషనల్ లెర్నింగ్‌తో అసోసియేట్ కావడం, లెర్నింగ్‌లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇండియా ప్రొడ్యూస్ చేసిన రెండు అతిపెద్ద బ్రాండ్‌లైన ఐఐటీలు, ఐఐఎంలలో ఒకదానికి మేం సంరక్షకులుగా ఉన్నాం. మేం దీనిని వారసత్వంగా పొందాం.

భారత యువతకు ఉజ్వల భవిష్యత్తును సృష్టించే బృహత్తర బాధ్యతను మేం కలిగి ఉన్నాం. యంగ్ లీడర్లను సన్నద్ధం చేయడంలో, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండేలా వారికి సాధికారత కల్పించడంలో దృఢనిశ్చయం కలిగి ఉన్నాం. మా టీచర్లు మోడ్రన్ డే స్కిల్స్ తో జ్ఞానాన్ని అందించడం, లెర్నింగ్ స్టాండర్డ్స్ నెలకొల్పడం ద్వారా మన దేశ వృద్ధికి తోడ్పడేందుకు కట్టుబడి ఉన్నారు." అని చెప్పారు.
Published by:Veera Babu
First published:

Tags: Business course, Career and Courses, Iim, New course

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు