• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • IIM BANGALORE TO OFFER RURAL ENTREPRENEURSHIP INCUBATION PROGRAMME NS GH

IIM Bangalore: గ్రామీణ వ్యవస్థాపకుల కోసం ఇంక్యుబేషన్ ప్రోగ్రాం.. ప్రారంభించిన ఐఐఎం బెంగళూరు

ప్రతీకాత్మక చిత్రం

ఐఐఎం బెంగళూరు మరో కొత్త కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది. సంస్థకు చెందిన NSRCEL, బుద్ధ ఫెలోషిప్ ప్రోగ్రాం (BFP) సంయుక్తంగా రూరల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఇంక్యుబేషన్ ప్రోగ్రాంను ప్రారంభించాయి.

  • Share this:
ఇన్నొవేషన్ హబ్ అయిన ఐఐఎం బెంగళూరు మరో కొత్త కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది. సంస్థకు చెందిన NSRCEL, బుద్ధ ఫెలోషిప్ ప్రోగ్రాం (BFP) సంయుక్తంగా రూరల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఇంక్యుబేషన్ ప్రోగ్రాంను ప్రారంభించాయి. గ్రామీణ స్థాయిలో ప్రతిభావంతులను తీర్చిదిద్దడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలనేది ఈ ప్రోగ్రాం లక్ష్యం. గ్రామీణ స్థాయిలో ఉండే వ్యవస్థాపకులు, పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పించి.. స్వావలంబన దిశగా వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కోర్సును ప్రారంభించారు. డెవలప్‌మెంట్ ఎంట్రప్రెన్యూర్స్‌గా మారాలనుకునే ప్రొఫెషనల్స్‌కు ఈ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడనుందని ఐఐఎం బెంగళూరు తెలిపింది. అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడంతో పాటు.. ఆధునిక, భవిష్యత్తు భారత నిర్మాణంలో అభ్యర్థులు పాలుపంచుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రస్తుతం కోర్సులో అడ్మిషన్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి చూపించే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
IGNOU: ఇగ్నోలో కొత్తగా రెండు మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్స్.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ వివరాలివే

ఈ కోర్సు ప్రారంభించిన సందర్భంగా ఐఐఎం బెంగళూరు NSRCEL ఛైర్ పర్సన్ వెంకటేష్ పంచపగేశన్ మాట్లాడారు. ‘రూరల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. దేశంలో స్వావలంబన పెంచి, జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో కోర్సులు డిజైన్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇలాంటి కోర్సులతో ప్రయోజనం ఉంటుంది’ అని చెప్పారు.

గ్రామీణ స్థాయిలో వ్యవస్థాపకులు, పారిశ్రామిక వేత్తలకు పెద్దగా అవగాహన ఉండట్లేదని వెంకటేష్ చెబుతున్నారు. మార్కెటింగ్, బ్రాండింగ్, నాణ్యతా ప్రమాణాలు, వ్యాల్యూ చెయిన్ క్రియేషన్, ఉత్పత్తి ఆవిష్కరణలపై అవగాహన లేకపోవడం వల్ల వారు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సంస్థ ప్రారంభించిన కోర్సులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

యువ వ్యవస్థాపకుల కలలను సాకారం చేయడమే తమ లక్ష్యమని బుద్ధ ఫెలోషిప్ ప్రోగ్రాం వ్యవస్థాపకులు డైరెక్టర్ వేద్ ఆర్య తెలిపారు. గ్రామ స్థాయిలో పేదరిక సమస్యలను పరిష్కరించడంతో పాటు దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి కృషి చేస్తామని చెప్పారు. రాబోయే పదేళ్లల్లో.. 1000 మంది బుద్ధ సభ్యులు 50 లక్షల మంది జీవితాలను ప్రభావితం చేస్తారని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో యువ పారిశ్రామిక వేత్తలను ఇందులో భాగం చేయనున్నామని స్పష్టం చేశారు.
Published by:Nikhil Kumar S
First published: