Home /News /jobs /

IIM BANGALORE LAUNCHES 1 YEAR HOSPITAL MANAGEMENT COURSE FOR PROFESSIONALS UMG GH

IIM, Bangalore: హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కు గుడ్ న్యూస్.. ఐఐఎం బెంగళూరు గోల్డెన్ ఆఫర్..!

ఐఐఎం బెంగళూరు

ఐఐఎం బెంగళూరు

డాక్టర్స్ డే సందర్భంగా ఐఐఎం బెంగళూర్, కొత్త ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్సును లాంచ్ చేసింది.  ఇది 12 నెలల ఆన్‌లైన్ కోర్సు. మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సుల (MOOCs) కలయికగా ఉంటుంది.

ఇంకా చదవండి ...
డాక్టర్స్ డే సందర్భంగా ఐఐఎం బెంగళూర్, కొత్త ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్సును లాంచ్ చేసింది. ఇది 12 నెలల ఆన్‌లైన్ కోర్సు. మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సుల (MOOCs) కలయికగా ఉంటుంది. హెల్త్ కేర్ రంగంలో ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్న వారు, కెరీర్ మధ్యలో ఉన్నవారు మేనేజ్ మెంట్‌లోని వివిధ విభాగాల్లో తమ స్కిల్స్‌ను మెరుగుపర్చడం కోసం ప్రత్యేకంగా ఈ కోర్సును డిజైన్ చేసింది. ఈ కోర్సులో పబ్లిక్ హెల్త్, ఆపరేషన్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్, మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ, లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్నోవేషన్ కీలకమైన అంశాలు.

ఈ ప్రోగ్రామ్‌లో ఐదు నుండి ఆరు మాడ్యూళ్లతో కూడిన 10 కోర్సులు ఉంటాయి. సిరీస్‌లుగా ఆన్‌లైన్ కోర్సులు, లెక్చర్లు, వర్క్‌షాప్‌లు, హ్యాండ్-ఆన్ ప్రాజెక్ట్‌లు, పరిశ్రమ నిపుణుల చర్చలు, వెబ్‌నార్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ ముగింపులో అభ్యాసకులు క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించాలి. ఇది అన్ని వ్యక్తిగత కోర్సుల నుండి లెర్నింగ్‌ను మిళితం చేస్తుంది.

ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్లు అన్నింటికీ ఇక టైప్ C ఛార్జరే.. మరి ఐ ఫోన్‌కు యూజర్ల పరిస్థితి ఏంటంటే..?


* నాణ్యమైన విద్యను అందించేలా కోర్స్‌ డిజైన్‌
ఈ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్ణాటక ప్రభుత్వ ఆరోగ్య & వైద్య విద్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ మాట్లాడుతూ.. రోగులకు సంతృప్తికరంగా ఆరోగ్య సేవలను అందించడానికి ప్రభుత్వానికి మంచి మేనేజ్‌మెంట్ అవసరం. దేశంలో హెల్త్‌కేర్ డెలివరీ పరివర్తన ఐఐఎం బెంగళూరు నుంచే ప్రారంభమవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

మరో అతిథి.. నారాయణ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ దేవి శెట్టి మాట్లాడుతూ.. ఐఐఎం బెంగళూరు ప్రపంచ స్థాయి అధ్యాపకులతో ఈ కోర్సును అందించనుందన్నారు. మెట్రో నగరాల్లో అందుతున్న 80 శాతం హెల్త్‌కేర్ కార్పొరేట్ చైన్‌తో సంబంధం లేదన్నారు. ఇక టైర్ II, టైర్ III నగరాల్లో 30 పడకలు, 50 పడకల నర్సింగ్‌హోమ్‌ల ద్వారా హెల్త్ కేర్ డెలివరీ అవుతోందన్నారు. కాబట్టి నర్సింగ్ హోమ్‌లను నడుపుతున్న వైద్యులకు మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్‌లో సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి నెలా చివరిలో జీతాలు చెల్లించడానికి డబ్బు ఉన్నందున వారు సక్సెస్ అయ్యారని భావిస్తున్నారు. అయితే, వాస్తవానికి, అలాంటి వ్యాపారాలు ఎల్లప్పుడూ అట్టడుగున ఉంటాయన్నారు. కొన్ని మెడికో-లీగల్ కేసుల కారణంగా నర్సింగ్ హోమ్‌లను దివాలా తీయవచ్చు. కాబట్టి అటువంటి ఆసుపత్రులను నడుపుతున్న వారు మేనేజ్‌మెంట్ సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవి శెట్టి అభిప్రాయపడ్డారు.



ఐఐఎం బెంగళూరు డైరెక్టర్ ప్రొఫెసర్ రిషికేశ టి కృష్ణన్ మాట్లాడుతూ.. హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ఇన్ స్టిట్యూట్ పబ్లిక్ సిస్టమ్స్ అండ్ పబ్లిక్ పాలసీలో భాగంగా రూపకల్పన చేశామన్నారు. నాణ్యమైన మేనేజ్‌మెంట్ విద్యను అందించడం కోసం ఈ కోర్సును డిజైన్ చేశామన్నారు.
Published by:Mahesh
First published:

Tags: Bangalore, Health care, Iim, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు