Home /News /jobs /

IIM AHMEDABAD IS OFFERING ADVANCED BUSINESS ANALYTICS FOR WORKING PROFESSIONALS BA GH

IIM Ahmedabad: వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఐఐఎం అహ్మదాబాద్ స్పెషల్ కోర్సు.. అర్హతలు, కాల వ్యవధి, ఫీజు డిటెయిల్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ (IIMA).. ఇ-పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్ బిజినెస్ అనలిటిక్స్ (e-PGD ABA)లో నాలుగో బ్యాచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం అప్లైడ్ అనలిటిక్స్‌లో 16-నెలల పాటు ప్రోగ్రామ్ ఉండను?

ఇంకా చదవండి ...
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ (IIMAhmedabad).. ఇ-పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్ బిజినెస్ అనలిటిక్స్ (e-PGD ABA)లో నాలుగో బ్యాచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం అప్లైడ్ అనలిటిక్స్‌లో 16-నెలల పాటు ప్రోగ్రామ్ ఉండనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఐఐఎంఏ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత ప్రమాణాలు
అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. బిజినెస్ అనలిటిక్స్‌లో కనీసం రెండేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా తప్పనిసరి. స్ట్రాంగ్ క్వాంటిటేటివ్, అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. GMAT/GRE/CAT/GATE లేదా ePGD-ABA క్వాలిఫైయింగ్-కమ్-ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో వ్యాలిడ్ స్కోర్ చేసి ఉండాలి. ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పూర్తిస్థాయిలో కోర్సును పూర్తిచేసే అభ్యర్థులను మాత్రమే అనుమతించనున్నారు.

NEET SS 2021: నీట్ SS-2021లో జీరో పర్సంటైల్ స్కోర్ వచ్చిందా..? అయినా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందే అవకాశం



దరఖాస్తు- పరీక్ష తేదీల వివరాలు
అడ్వాన్స్‌డ్ బిజినెస్ అనలిటిక్స్‌లో నాలుగో బ్యాచ్ రౌండ్-1 కోసం దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 30, 2022 వరకు సమయం ఉంటుంది. ఇక రెండో రౌండ్ కోసం నవంబర్ 7, 2022 నుంచి జనవరి 15, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రౌండ్ -1 కోసం ప్రవేశ పరీక్షను నవంబర్ 6న నిర్వహించనున్నారు. ఇక రెండో రౌండ్ కోసం ప్రవేశ పరీక్షను జనవరి22, 2023న చేపట్టనున్నారు. దరఖాస్తు ఫీజు రూ. 1500గా నిర్ణయించారు.

CAT 2022 రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. అర్హత, డాక్యుమెంట్స్ వివరాలు.. క్యాట్ లేకుండా బిజినెస్ స్కూల్‌లో చేరడానికి మార్గాలు



ఇంటర్వ్యూ, ఫలితాల వివరాలు
రౌండ్ వన్ కోసం నవంబర్ 12-13 తేదీల్లో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. రెండో రౌండ్ కోసం 2023 ఫిబ్రవరి 4- 5 తేదీల్లో ఇంటర్వ్యూ ఉంటుంది. మొదటి రౌండ్ ఫలితాలు నవంబర్ 21న ప్రకటించనున్నారు. రెండో రౌండ్ ఫలితాలు 2023 ఫిబ్రవరి 20న వెలువడనున్నాయి. డేటా విజువలైజేషన్, మోడలింగ్ అండ్ డేటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌లో టూల్స్ అండ్ టెక్నిక్స్‌పై ePGD-ABA ప్రోగ్రామ్ కోర్సులను అందిస్తుంది. ఫంక్షన్స్ డేటా అనలిటిక్స్ డొమైన్ స్పెసిఫిక్ అప్లికేషన్స్‌లో కూడా కోర్సులను ఆఫర్ చేస్తోంది.

Quess Corp Survey: ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయా..? అయితే, మీకు మాంచి డిమాండ్.. ఓ సర్వేలో తేలిన సంచలన విషయాలు ఇవే..!



ఇది ఇలా ఉంటే.. డేటా సైన్స్ అండ్ అప్లికేషన్‌ల్లో నాలుగేళ్ల BS డిగ్రీ కోసం ఐఐటీ మద్రాస్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీఎస్ డీగ్రీలో భాగంగా 8 నెలల అప్రెంటిస్‌షిప్ లేదా పరిశోధనా సంస్థలతో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఆన్‌లైన్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తరగతులు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. 

ఈ డేటా సైన్స్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ -2022 టర్మ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 19గా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు onlinedegree.iitm.ac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మల్టిపుల్ ఎంట్రెన్స్ అండ్ ఎగ్జిట్ ఆప్షన్‌తో ఈ కోర్సును రూపకల్పన చేశారు. దీంతో అభ్యర్థులు ఒక సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే అది వారు కోర్సు నుంచి నిష్క్రమించే స్థాయిని బట్టి ఉంటుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Career and Courses, EDUCATION, Iim, JOBS

తదుపరి వార్తలు