IIM AHMEDABAD AND ISB ONLY INDIAN B SCHOOLS IN THE ECONOMISTS TOP 100 MBA RANKING 2022 UMG GH
MBA Ranking 2022: ప్రపంచంలోని టాప్ 100 బిజినెస్ స్కూల్స్‌లో రెండే ఇండియావి.. ఆ రెండు ఏంటో తెలుసా..?
ప్రపంచలోని టాప్ 100 బీ స్కూల్స్‌లో ఇండియావి రెండే.
ఇండియన్ బిజినెస్ స్కూల్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత పొందినవి చాలా తక్కువని తాజాగా వెల్లడైంది. ది ఎకనామిస్ట్ టాప్ 100 ఫుల్ టైమ్ MBA ర్యాంకింగ్ 2022లో కేవలం రెండు ఇండియన్ బిజినెస్ స్కూల్స్ మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) 75వ స్థానాన్ని సంపాదించింది.
ఇండియన్ బిజినెస్ స్కూల్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత పొందినవి చాలా తక్కువని తాజాగా వెల్లడైంది. ది ఎకనామిస్ట్ టాప్ 100 ఫుల్ టైమ్ MBA ర్యాంకింగ్ 2022లో కేవలం రెండు ఇండియన్ బిజినెస్ స్కూల్స్ మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) 75వ స్థానాన్ని సంపాదించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్ 99వ స్థానంలో నిలిచింది. టాప్ 10 స్థానాల్లో యునైటెడ్ స్టేట్స్ బి-స్కూల్స్ ఏకంగా తొమ్మిది స్థానాలను కైవసం చేసుకున్నాయి.
ది ఎకనామిస్ట్ MBA ర్యాంకింగ్స్ 2021లో IIM-అహ్మదాబాద్ 51వ స్థానంలో, ISB 44వ స్థానంలో ఉన్నాయి. 2019లో IIM అహ్మదాబాద్ మాత్రమే ఇండియా నుంచి ర్యాంకింగ్స్‌లో పాల్గొనగా, 75వ స్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్‌లో రెండు బీ-స్కూల్స్ ర్యాంక్ దారుణంగా పడిపోయింది. అయితే IIM అహ్మదాబాద్ మాత్రం సంవత్సరాలుగా జాబితాలో నిలకడగా కొనసాగింది.
ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ ప్రారంభం.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్.. బెస్ట్ డీల్స్ ఇవే..!
ఒక సంవత్సరం విరామం తర్వాత అమెరికన్ B-స్కూల్స్ అన్నీ ప్రారంభమయ్యాయని, అందుకే గత సంవత్సరం టాప్ ర్యాంక్స్లో నిలిచిన అన్ని B-స్కూల్స్ ఈసారి కిందకు పడిపోయాయని ది ఎకనామిస్ట్ పేర్కొంది. ‘అమెరికన్ MBA ప్రోగ్రామ్స్‌కు ఒక సంవత్సరం బ్రేక్ పడింది. ఈ ఏడాది మళ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ సంవత్సరం ర్యాంకింగ్‌లో చాలా ఇన్స్టిట్యూట్స్ టాప్ ర్యాంకులను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.’ అని వెల్లడించింది.
ఈ ర్యాంకింగ్స్ ప్రకారం.. టాప్ 50 బీ-స్కూల్స్‌లో మూడింట రెండు వంతులు అమెరికన్ ఇన్స్టిట్యూట్స్ ఉండటం గమనార్హం. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోని ఫుల్ టైమ్ MBA.. ఈ లిస్ట్‌లో ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీ వార్టన్ స్కూల్, నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.
ది ఎకనామిస్ట్ ర్యాంకింగ్ 2022లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ బీ-స్కూల్స్
ర్యాంక్ 1 - హార్వర్డ్ బిజినెస్ స్కూల్, US
ర్యాంక్ 2 - యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా - వార్టన్ స్కూల్, US
ర్యాంక్ 3 - నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ - కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, US
ర్యాంక్ 4 - కొలంబియా బిజినెస్ స్కూల్, US
ర్యాంక్ 5 - మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - MIT స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, US
ర్యాంక్ 6 - డ్యూక్ యూనివర్సిటీ - ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్, US
ర్యాంక్ 7 - HEC పారిస్ బిజినెస్ స్కూల్, ఫ్రాన్స్
ర్యాంక్ 8 - స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ- గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, US
ర్యాంక్ 9 - యూనివర్సిటీ ఆఫ్ చికాగో - బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్, US
ర్యాంక్ 10 - యూనివర్సిటీ ఆఫ్- స్టీఫెన్ M రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, US
హాంగ్‌కాంగ్ యూనివర్సిటీకి చెందిన HKU ఆసియా కాలేజీల్లో 43వ ర్యాంక్‌లో అగ్రస్థానంలో ఉంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.