IIIT Hyderabad: ట్రిపుల్​ఐటీ హైదరాబాద్​లో కొత్త కోర్సు.. ఆ ప్రోగ్రాంకు దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

మారుతున్న టెక్నాలజీ, మార్కెట్​ అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి ప్రతిష్టాత్మక సంస్థలు. తాజాగా హైదరాబాద్​లోని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ (ట్రిపుల్​ఐటీ) సరికొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఎంటెక్ ప్రోగ్రామ్​ను​ ప్రారంభించింది.

  • Share this:
మారుతున్న టెక్నాలజీ, మార్కెట్​ అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి ప్రతిష్టాత్మక సంస్థలు. తాజాగా హైదరాబాద్​లోని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ (ట్రిపుల్​ఐటీ) సరికొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఎంటెక్ ప్రోగ్రామ్​ను​ ప్రారంభించింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఐఐటీ హైదరాబాద్​ అధికారిక వెబ్‌సైట్ www.pdm.iiit.ac.in ద్వారా నవంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.​ టెక్నాలజిస్ట్​లు, ప్రొడక్ట్ డిజైనర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, స్టార్టప్ ఫౌండర్లు, ఎంటర్​ప్రెన్యూర్లను తయారు చేయడమే లక్ష్యంగా ఈ కోర్సును ఆవిష్కరించింది.

RRB NTPC Result: ఆ రోజే ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ ఫలితాలు.. కేటగిరీ వారీగా కటాఫ్​ మార్కులు ఇలా..


ఈ ప్రోగ్రామ్ కొత్త ఉత్పత్తులు, కొత్త స్టార్టప్‌లు లేదా కొత్త ఐటీ కొలువుల సృష్టికి దారి తీస్తుంది. ఎంటెక్ ప్రోగ్రామ్‌ మొదటి సంవత్సరంలో నూతన టెక్నాలజీపై అవగాహన, టెక్నాలజీ కన్వర్జెన్స్, డిజైన్, మార్కెట్లు & బిజినెస్, ప్రొడక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీస్​పైలోతైన అవగాహన కల్పిస్తారు. ఇక, రెండో సంవత్సరంలో క్రియేటింగ్ ప్రొడక్ట్స్, డీప్​టెక్నాలజీస్​లోకి ఐడియాలు ట్రాన్స్​లేట్​ చేసుకోవడం, ​ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మార్కెట్‌ వంటి సబ్జెక్ట్​లపై అవగాహన కల్పిస్తారు.

ఇలా దరఖాస్తు చేసుకోండి..
Step 1 : ముందుగా www.pdm.iiit.ac.in క్లిక్ చేసి వెబ్ సైట్ కు వెళ్లాలి.
Step 2 : అందులో టాప్ లో అడ్మిషన్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేయాలి.
Step 3 : కొత్త పేజీ ఓ పెన్ అయిన తర్వాత బాటమ్ లో అప్లై(Apply)అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 : తదనంతరం New Users click here to register పైన క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎమర్జింగ్​ టెక్నాలజీపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా..
ఈ కొత్త కోర్సు పై పీడీఎం ప్రోగ్రామ్ హెడ్ ప్రొఫెసర్ రఘు రెడ్డి మాట్లాడుతూ ‘‘నేటి టెక్నాలజీ యుగంలో రాణించాలంటే ఎమర్జింగ్​ టెక్నాలజీస్​పై పట్టు సాధించాలి. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా కొత్త స్ట్రాటజీలపై పనిచేయాల్సి ఉంటుంది. ఇలా పనిచేసే వ్యక్తులు దొరకడం చాలా అరుదు. మరోవైపు, ప్రొడక్ట్ మేనేజర్లు, ప్రొడక్ట్ మార్కెట్లు స్ట్రాటజిస్ట్ ​ల కొరత కూడా ఐటీ ఇండస్ట్రీని వేదిస్తోంది.

Central Govenment: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ఫలాలు వారికి కూడా.. 


అందుకే, వీరిపై ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఈ కొత్త కోర్సు ద్వారా నూతన టెక్నాలజీలు, ప్రొడక్ట్ డిజైన్, ప్రొడక్ట్ డెవలప్​మెంట్​ విభాగాల్లో సామర్థ్యాలను మెరుగుపర్చడంపై దృష్టి పెట్టాం.”అని అన్నారు. కెరీర్​ ప్రారంభంలో ఉన్న ఐటీ గ్రాడ్యుయేట్లు, వర్కింగ్​ ప్రొఫెషనల్స్​ కొరకు ప్రత్యేకంగా ఈ కోర్సును అందిస్తున్నారు. గేట్ లేదా సీడ్ స్కోర్​, స్క్రీనింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
Published by:Veera Babu
First published: