Home /News /jobs /

IIIT ENTRANCE EXAM POSTPONED BECAUSE OF NIVAR CYCLONE NS

నివర్ తుఫాన్ ఎఫెక్ట్.. ఆ పరీక్ష వాయిదా.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cyclone Nivar affect in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరద నీటితో అనేక ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగాల్సి ఉన్న ఐఐఐటీ ప్రవేశ పరీక్ష(IIIT Entrance Exam)ను వాయిదా వేశారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరద నీటితో అనేక ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ముందే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ట్రిపుల్ ఐటీ(IIIT) ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే తుఫాను నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు అనుకూల వాతావరణం లేకపోవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు జరగాల్సి ఉన్న పరీక్షను వాయిదా వేశారు. ఈ మేరకు ఆర్‌జీయూకేటీ కన్వీనర్‌ డి.హరినారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. తుఫాను నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరీక్షను తిరిగి డిసెంబర్‌ 5వ తేదీ(వచ్చే శనివారం) నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే జారీ చేసిన హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల విషయంలో ఎలాంటి మార్పులు లేవని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఒక గుర్తింపు కార్డుతో, రెండు గంటల ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని హరినారాయణ సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Cyclone Nivar, Exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు