హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIIT Delhi: ఐఐఐటీ ఢిల్లీ నుంచి సరికొత్త ECE కోర్సు.. స్పెషలైజేషన్‌తో బీటెక్ EVE ప్రోగ్రామ్‌..

IIIT Delhi: ఐఐఐటీ ఢిల్లీ నుంచి సరికొత్త ECE కోర్సు.. స్పెషలైజేషన్‌తో బీటెక్ EVE ప్రోగ్రామ్‌..

IIIT Delhi: ఐఐఐటీ ఢిల్లీ నుంచి సరికొత్త ECE కోర్సు.. స్పెషలైజేషన్‌తో బీటెక్ EVE ప్రోగ్రామ్‌..

IIIT Delhi: ఐఐఐటీ ఢిల్లీ నుంచి సరికొత్త ECE కోర్సు.. స్పెషలైజేషన్‌తో బీటెక్ EVE ప్రోగ్రామ్‌..

IIIT Delhi: ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- ఢిల్లీ (IIIT Delhi) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (ECE)లో సరికొత్త అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును ఆఫర్ చేస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు విద్యార్థుల్లో స్కిల్స్ పెంపొందించేలా కొత్త కొత్త కోర్సుల (New Courses) రూపకల్పనకు ప్రధాన ఇన్‌స్టిట్యూట్స్ శ్రీకారం చుడుతున్నాయి. ఇందుకు ఇండస్ట్రీ ఎక్స్‌ఫర్ట్స్ సహాయం తీసుకుంటున్నాయి. తాజాగా ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- ఢిల్లీ (IIIT Delhi) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (ECE)లో సరికొత్త అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ సంస్థ తాజాగా ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI ఇంజనీరింగ్ (EVE)లో కొత్త BTech ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.

స్పెషలైజేషన్‌ ఆప్షన్‌తో వచ్చే ఈ కొత్త బీటెక్ కోర్సు EE+X ఫార్మాట్‌లో ఉంటుంది. EE+Xలో EE అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అని అర్థం. ఇక X అంటే.. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన ఇతర రంగాల్లోని నాలెడ్జ్, టెక్నాలజీని సూచిస్తుంది. ఈ కొత్త కోర్సును ఇప్పటికే ఉన్న ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI ఇంజనీరింగ్ (EVE) ప్రోగ్రామ్‌కు అదనంగా ప్రవేశపెడుతున్నారు.

* ఈ కోర్సుల్లో ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

2022-23 అకడమిక్ సెషన్‌లో బీటెక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు జాయింట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ (JAC) ద్వారా ఐఐఐటీ ఢిల్లీలో చేరవచ్చు. అయితే జేఈఈ మెయిన్ స్కోర్ తప్పనిసరి. ప్రస్తుత అకడమిక్ ఇయర్‌లో ఈవీఈ, ఈ‌సీఈ కోర్సుల్లో 60 చొప్పున సీట్లు కేటాయించారు. ఈ కోర్సులకు సంబంధించిన రీసెర్చ్, ఇంటర్న్‌షిప్, జాయింట్ ప్రాజెక్ట్స్ కోసం ఇండస్ట్రీ లీడర్స్, అకడమిక్ ఇన్‌స్టిట్యూట్స్‌తో ఐఐఐటీ ఢిల్లీ టై‌అప్ అయింది.

* స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు

ఇన్‌స్టిట్యూట్‌ ECE డిపార్ట్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ స్నేహ సౌరభ్ మాట్లాడుతూ.. సంబంధిత డొమైన్‌లపై దృష్టి సారించడం ద్వారా ECE, EVE ప్రోగ్రామ్‌ల కోసం ఇండస్ట్రీ ఫేసింగ్ స్కిల్ బేస్డ్ కోర్సులను డిజైన్ చేశామన్నారు. కోర్సు ముగిసే సమయానికి, ECE, EVE విద్యార్థులు ఎలక్ట్రానిక్స్‌‌పై బలమైన పట్టుసాధిస్తారని.. అలాగే సంబంధిత రంగాలలో నైపుణ్యం పెంపొందించుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

* రెండు కోర్సుల మధ్య వ్యత్యాసం ఇలా..

ఇప్పటికే ఉన్న కోర్సు, కొత్తగా లాంచ్ చేసిన కోర్సు మధ్య పాఠ్యాంశాల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇవి నిర్దేశించుకున్న ఫలితంపై దృష్టి సారించనున్నాయి. మొదటి మూడు సెమిస్టర్లలో ECE అండ్ EVE పాఠ్యాంశాలు ఎలక్ట్రానిక్స్ ఫండమెంటల్స్‌పై అవగాహన కల్పిస్తాయి. తరువాతి సెమిస్టర్‌లలో ECE కమ్యూనికేషన్-స్పెసిఫిక్ కోర్సులపై దృష్టి సారిస్తే... EVE కోర్సు VLSI-స్పెసిఫిక్ కోర్సులపై ప్రత్యేక దృష్టిసారిస్తుంది.

ఇది కూడా చదవండి : సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫారమ్ విడుదల... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..

* ఇండస్ట్రీ - ఫోకస్డ్ స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్

EVE ప్రోగ్రామ్ హ్యాండ్-ఆన్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇది ఇండస్ట్రీ - ఫోకస్డ్ స్కిల్ బేస్డ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ఈ కోర్సు సెమీకండక్టర్ పరిశ్రమలో ఉజ్వలమైన కెరీర్ కోసం అభ్యర్థులను రెడీ చేస్తుంది. విద్యార్థులు ఎంచుకున్న డొమైన్ లేదా కాంప్లిమెంటరీ టెక్నాలజీలో లోతైన నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా ప్రోత్సహించడానికి ECE కోర్సును EE+X ఫార్మాట్‌లో కొత్త లాంచ్ చేసినట్లు ఐఐఐటీ ఢిల్లీ తెలిపింది.

సాధారణంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) కోర్సుల్లో కమ్యూనికేషన్లతో కలిపి ఎలక్ట్రానిక్స్‌ను బోధిస్తారు. ఇక, సెమీకండక్టర్స్, VLSI అనేది ఎలక్ట్రానిక్స్‌లో ఒక భాగం. ఇందులో ప్రస్తుతం నైపుణ్యం ఉన్న ఇంజనీర్‌లకు గణనీయమైన డిమాండ్-సప్లై గ్యాప్ ఉంటుంది. ఇది VLSI ఇంజనీర్ల జీతాలను ప్రభావితం చేస్తుంది. దీంతో డిమాండ్‌కు తగ్గట్టు ఈ ఇంజనీర్ల సప్లై పెంచడానికి పరిశ్రమ నిపుణులు, VLSI ప్రపంచ ప్రఖ్యాత విద్యావేత్తలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత EVE పాఠ్యాంశాలను అభివృద్ధి చేశామని సౌరభ్ చెప్పుకొచ్చారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS

ఉత్తమ కథలు