Online Course : నైపుణ్యానికి చిరునామా.. IIIT ఢిల్లీలో కంప్యూట‌ర్ సైన్స్‌ ఉపాధ్యాయుల‌కు ప్ర‌త్యేక కోర్సు

ట్రిపుల్ ఐటీ ఢిల్లీ

ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Indraprastha Institute of Information Technology) ప్రొఫెసర్‌ల కోసం కంప్యూటర్ సైన్స్‌లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సు ద్వారా ఉపాధ్యాయ‌ల‌కు నూత‌న బోధ‌నా విధానాలు నేర్ప‌నున్నారు.

 • Share this:
  సైన్స్‌ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Indraprastha Institute of Information Technology) ప్రొఫెసర్‌ల కోసం కంప్యూటర్ సైన్స్‌లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సు కోవిడ్ ప్రోటోకాల్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వ‌ర్చువ‌ల్ విధానంలో యూనివ‌ర్సిటీ అందిస్తుంది. ఈ కోర్సు బీఈ/ బీటెక్ అండ్ నాన్- ఇంజ‌నీరింగ్  విభాగాలు బీఎస్సీ/ బీసీఏ / ఎంసీఏ నేప‌థ్యాల నుంచి వ‌చ్చివారు చేసేందుకు రూపొందించిన స‌ర్టిఫికెట్ ప్రోగ్రామ్ (Certificate Program) ముఖ్యంగా కంప్యూట‌ర్ సైన్స్ (Computer Science) విభాగాల్లో ఉపాధ్యాయులు బోధ‌నా సామర్థ్యాలు మెరుగు ప‌ర్చుకొనేందుకు రూపొందించిన కోర్సుగా యూనివ‌ర్సిటీ తెలిపింది. ఈ కోర్సు చేసేందుక ఇత‌ర యూనివ‌ర్సిటీలు త‌మ అధ్యాప‌కుల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి. అంతే కాకుండా అసోసియేష‌న్ ఫ‌ర్ కంప్యూటింగ్ మిష‌న‌రీ (Association for Computing Machinery) ఈ కోర్సు చేసేందుకు అధ్యాప‌కుల‌ను పాక్షిక‌ ఆర్థిక చేయూత అందించ‌నుంది.

  కాలానికి అనుగుణంగా మార్పులు..
  ప్ర‌స్తుత ప‌రిస్థుల్లో కంప్యూట‌ర్ కోర్సు రంగంలో వేగ‌వంతమైన మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ముఖ్యంగా మెషీన్ లెర్నింగ్ (Machine Learning), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ (DATA Science) విభాగాల్లో నిరంత‌రం ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉపాధ్యాయుల కాలానికి అనుగుణంగా త‌మ నైపుణ్యం.. విష‌య ప‌రిజ్ఞానం మెరుగుప‌ర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అంతుకోసం ఆధునికీక‌రించిన ఈ కోర్సుల ద్వారా కోర్సు అందిస్తున్న‌ట్టు యూనివ‌ర్సిటీ తెలిపింది. ఈ స‌ర్టిఫికెట్ ప్రొగ్రాం ఉపాధ్యాయులు వృత్తిప‌రంగా మెరుగ్గా రాణించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుందిన ఐఐఐటీ ఢిల్లీ (IIIT ఢిల్లీ) అధికారిక నోటీసులో పేర్కొంది.

  BEL Recruitment 2021 : "బెల్‌"లో 88 ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు.. జీతం రూ.50,000
  వారానికి 6 నుంచి 8 గంట‌ల బోధ‌న‌..
  ఈ కోర్సు బోధించేందుకు ఆయా రంగాల్లో స్పెష‌లిస్టుల‌ను ఎంపిక చేసి బోధ‌న అందించ‌స్తారు. ముఖ్యంగా ఏఐసీటీ (AICTE) సెల‌బ‌స్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా పాఠ్యాంశాల‌ను బోధిస్తున్నారు. ఈ మాడ్యుల్ బోధ‌న‌కు ఐఐటీ, ఐఐఐటీ విద్యావేత్త‌ల‌ను నియమించ‌నున్నారు. ఈ కోర్సు మొద‌టి మాడ్యూల్ జ‌న‌వ‌రి 2022న ప్రారంభ‌మ‌వుతుంది. ఈ కోర్సు రెగ్యులర్ సెమిస్టర్‌లో పాఠ్యాంశాలు ఆన్‌లైన్ మాడ్యూల్‌ (Online Module)లను కలిగి ఉన్నందున ఫ్యాకల్టీ ఎప్పుడైనా సెలవు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వారం, ప్రతి వారం దాదాపు 5 నుంచి 6 గంటల మొత్తం ప్రయత్నం కోసం, కొన్ని వారపు ప్రాక్టీస్ పనితో పాటు ఒక సింగిల్ సెషన్ జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్ పూర్తి చేసిన తర్వాత హాజరైనవారు సర్టిఫికెట్ పొందుతారు.

  ఈ కోర్సులో ప్రతీ మాడ్యూల్ ధర రూ. 10,000 అద‌నంగా జీఎస్‌టీ చెల్లించాలి. ఈ ఫీజులోనే ఆన్‌లైన్ క్లాస్‌లు, మెటీరియ‌ల్ (Material) అందిస్తారు. మాడ్యూల్ పూర్తి చేసుకొన్న వారు వారి డిపార్ట్‌మెంట్‌/ ఇన్‌స్టిట్యూట్ ద్వారా నిమినేట్ చేయ‌బ‌డ‌తారు. వారానిఇక 6 నుంచి 8 గంట‌ల పాటు కోర్సు విధానాన్ని నిర్ణ‌యిస్తారు.

  TCS iON Course: టీచ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. టీసీఎస్ ఐఓఎన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోర్స్‌


  దీని ద్వారా అభ్యాస‌కుల‌పై భారం త‌క్కువ‌గా ఉంటుంది. ఐఐఐటీ ఢిల్లీ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ రంజ‌న్ బోస్ నోట్ ద్వారా ఈ కోర్సును ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌తి ఒక్క‌రికి ప్రయోజ‌నం ఉంటుంద‌ని తెలిపారు. ఈ కోర్సు బోధ‌నాసామ‌ర్థ్యాల‌ను మెరుగు ప‌రుస్తుంద‌ని అన్నారు. ఇది అధ్యాప‌కుల‌కు మాత్ర‌మే కాదని విద్యార్థుల‌కు ఎంతో మేలు చేకూరుస్తుందిన ఆయ‌న అన్నారు.

  ఏఐసీటీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ స‌హ‌స్ర‌బుదే ఈ కోర్సుపై మాట్లాడారు. ప్ర‌స్తుతం కంప్యూట‌ర్ విద్యావిధానంలో సృజ‌నాత్మ‌కంగా బోధించే నైపుణ్యం (Skills) ఉపాధ్యాయుల‌కు లేద‌ని అన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ ఉపాధ్యాయుల్లో కొంద‌రు అలా చేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న కంప్యూట‌ర్‌సైన్స్ ఉపాధ్యాయుల‌కు ఈ నైపుణ్యం అందిచేందుకు ఈ కోర్సు ఉప‌యోగ ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు.
  Published by:Sharath Chandra
  First published: