IIIT Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) ఒకటి. ఈ సంస్థ ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు పీహెచ్‌డీ, ఎంటెక్ విభాగాల్లో కొత్త కోర్సులను ప్రవేశపెడుతోంది. తాజాగా ఈ ఇన్‌స్టిట్యూట్ 2023 బ్యాచ్ కోసం ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంటెక్ కోర్సుల్లో జాయిన్ కావాలనుకునేవారు ఏప్రిల్ 23 లోపు, పీహెచ్‌డీ కోర్సుల కోసం ఏప్రిల్ 16 లోపు అప్లై చేసుకోవాలి.
IIIT ఢిల్లీలో పీహెచ్‌డీ కోర్సుల కోసం సాధారణ అడ్మిషన్ ప్రక్రియతో పాటు రోలింగ్ మోడ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి-ఏప్రిల్, సెప్టెంబర్-నవంబర్‌లో అన్ని విభాగాలకు రెగ్యులర్ అడ్మిషన్లు జరుగుతాయి. IIITఢిల్లీ ఈ ఏడాది పీహెచ్‌డీలో కొన్ని కొత్త కోర్సులను ఆఫర్ చేస్తోంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSE), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ECE), కంప్యూటేషనల్ బయాలజీ (CB), మ్యాథమెటిక్స్, సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్, హ్యూమన్ సెంటర్డ్ డిజైన్ వంటి అంశాలపై PhD కోర్సులను అందిస్తోంది. ఈ పీహెచ్‌డీ కోర్సుల ద్వారా అభ్యర్థులు విస్తృతమైన పరిశోధనపై దృష్టి సారించనున్నారు.
* బెస్ట్ ప్రాక్టీస్ మోడ్ ఆధారంగా
అభ్యర్థులను ప్రపంచ పరిశోధనా పర్యావరణ వ్యవస్థలో భాగం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనా సంస్థలు, అగ్రశ్రేణి యూనివర్సిటీలకు సహకారం అందించడమే PhD ప్రోగ్రామ్ లక్ష్యమని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. ‘ఈ ప్రోగ్రామ్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లోని బెస్ట్ ప్రాక్టీస్ మోడ్ ఆధారంగా రూపొందించాం. రెగ్యులర్ ప్రోగ్రామ్ మాదిరి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన పార్ట్నర్ గ్రూప్స్/ఇన్‌స్టిట్యూట్‌లతో ఫోకస్డ్ కొలబ్రేటివ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌గా ప్రారంభించాం. పరిశ్రమలో పనిచేసే వ్యక్తుల కోసం ఫుల్‌టైమ్ కోర్సుగా డెవలివరీ చేయనున్నాం.’ అని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.
* సీఎస్‌ఈలో స్పెషలైజేషన్
IIIT ఢిల్లీ ఎంటెక్ ప్రోగ్రామ్ కోసం కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సీఎస్‌ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, మొబైల్ కంప్యూటింగ్, స్పెషలైజేషన్ - కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, వీఎల్‌ఎస్‌ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటేషనల్ బయాలజీలపై స్పెషలైజేషన్ చేయడానికి అవకాశం కల్పిస్తోంది.
* క్రెడిట్ బేస్డ్ విధానంలో
IIIT ఢిల్లీ ఆఫర్ చేస్తున్న మాస్టర్స్ డిగ్రీ ప్రధానంగా ఇండస్ట్రీ ఫోకస్డ్‌గా ఉంటుంది. అలాగే పరిశోధనకు ఆస్కారం ఉంటుంది. ఈ ఎంటెక్ ప్రోగ్రామ్ క్రెడిట్ బేస్డ్ విధానంలో ఉంటుంది. కోర్సు పూర్తి అయ్యేలోపు నిర్దిష్ట క్రెడిట్ పాయింట్స్ పొందాల్సి ఉంటుంది. ‘ప్రస్తుతం ప్రతి రంగంలో సవాళ్లు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం పరిశ్రమ అవసరాలకు సరిపోయే విధంగా మానవశక్తిని తీర్చిదిద్దడానికి MTech ప్రోగ్రామ్ ద్వారా CSE, ECEల్లో స్పెషలైజేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాం. దీంతో అభ్యర్థులు ఎంటెక్ లేదా ఎంటెక్ విత్ స్పెషలైజేషన్ చేయవచ్చు.’ అని IIIT ఢిల్లీ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS