దేశంలోనే అతి పెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) అనేక కొత్త కోర్సులను ప్రారంభిస్తోంది. ఇటీవల మాస్టర్ ఇన్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ (ఎంజేఎంసీ) కోర్సును ప్రారంభించిన ఇగ్నో.. తాజాగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. భారతదేశంలోని యువ నిపుణులు, సీఎస్ఆర్ ప్రొఫెషనల్(CSR Professional)గా కెరీర్(Career)ను కొనసాగించాలనుకునే గ్రాడ్యుయేట్లు/ పోస్ట్-గ్రాడ్యుయేట్ల కోసం ప్రత్యేకంగా ఈ కోర్సును ఆఫర్(Offer) చేస్తోంది. ప్రస్తుతం సీఎస్ఆర్(CSR) నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్, శిక్షణ పొందిన నిపుణుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31లోపు ఇగ్నో అధికారిక వెబ్సైట్(Website) www.ignouadmission.samarth.edu.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీని(Bachlor Degree) పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఈ కోర్సు మొత్తం రెండేళ్ల వ్యవధి కలిగి ఉంటుంది. అభ్యర్థులు రూ. 14,400 (రెండు సంవత్సరాలకు రూ. 7,200) దరఖాస్తు రుసుము చెల్లించాలి.
సీఎస్ఆర్ నిపుణులకు మార్కెట్లో మంచి డిమాండ్..
ఈ కొత్త ప్రోగ్రామ్ గురించి కోర్సు కో-ఆర్డినేటర్లు డాక్టర్ నిషా వర్గీస్, ప్రొఫెసర్ పి.వి.కె. శశిధర్ మాట్లాడుతూ, “మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( MACSR) ప్రోగ్రామ్ అనేది ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) మోడ్ ప్రోగ్రామ్. ఇది సీఎస్ఆర్ నిపుణుల్లో బిజినెస్ నాలెడ్జ్ పెంచడానికి, అప్‌గ్రేడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. MACSR ప్రోగ్రామ్ సీఎస్ఆర్ ఫండమెంటల్స్, సీఎస్ఆర్ ప్రాసెస్, ప్రోగ్రామ్ డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్, మెయింటెనెన్స్, కార్పొరేట్ ఎథిక్స్, గవర్నెన్స్, సొల్యూషన్స్ వంటి వివిధ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేలా ఈ కోర్సును డిజైన్ చేసింది.
కోర్సులో భాగంగా ప్రాజెక్ట్ వర్క్‌పై పనిచేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు." అని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.ignou.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
HPCL Recruitment 2022: విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
న్యాక్ A++ గుర్తింపు పొందిన మొదటి ఓపెన్ వర్సిటీ..
ఇగ్నోను 1985లో పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించారు. కుటుంబ ఆర్థిక పరిస్థుతుల నేపథ్యంలో రెగ్యులర్ విధానంలో విద్యనభ్యసించలేని వారి కోసం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. విద్యార్థులు డిస్టన్స్‌లో కోర్సులను అభ్యసించి సర్టిఫికెట్ పొందవచ్చు. డిస్టన్స్, ఆన్లైన్ కోర్సులతో పాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఈ యూనివర్సిటీ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) A++ గుర్తింపు కూడా పొందింది. భారత్‌లో ఈ గుర్తింపు పొందిన మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ ఇదే కావడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IGNOU, IGNOU TEE